Posts

Showing posts from February, 2026

శ్రీసాయిసందేశామృతము 8 (Nectar of Sri Sai's Message 8)

Image
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 8. భగవంతుడు విశ్వవ్యాపక చైతన్యస్వరూపుడు . మానవుని చైతన్యము కేవలము తన దేహము , మనసులకు మాత్రమే పరిమితము . దైవము పరిపూర్ణ శక్తి క్షేత్రముగా తలచిన, మానవుని శక్తిసామర్ధ్యములు అందు లేశమాత్రమే ! భగవంతుడు సాగరమైతే , సృష్టిలోని చరాచరజీవులెల్ల సముద్ర ఉపరితలంపై ఉద్భవించి లయించే తరంగాలుగా యూహింపవచ్చును . సద్గురునికి సముద్రము తానే, తరంగమూ తానే! సామాన్య మానవుడు తనను క్షణభంగుర తరంగమని ఎరుగడు,అహంకార అజ్ఞానములచే తానే సర్వమన్నటుల వ్యవహరిస్తాడు . కేవలం సద్గురునికృపచేతనే వాని అజ్ఞానతెర తొలగుతుంది . సద్గురుని కృపచే మానవుడెపుడు తానే క్షణభంగుర తరంగముగాక సర్వవ్యాపిత సాగరమని అనుభవపూర్వకంగా గ్రహించి పరమానందసాగరంలో ఈదులాడుతాడో అదేవానికి ఆత్మసాక్షాత్కారము,పరిమితస్థాయినుండి అపరిమిత ఐశ్వర్యము . దైవసృష్టిలో కేవలం మానవునికిమాత్రమే ఈవిధమైన వివేచనకు అవకాశముగలదు కావున ఈదుర్లభ నరజన్మను తెలివిగా మోక్షప్రాప్తికి వినియో...