శ్రీసాయిసందేశామృతము 8 (Nectar of Sri Sai's Message 8)

శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 8. భగవంతుడు విశ్వవ్యాపక చైతన్యస్వరూపుడు . మానవుని చైతన్యము కేవలము తన దేహము , మనసులకు మాత్రమే పరిమితము . దైవము పరిపూర్ణ శక్తి క్షేత్రముగా తలచిన, మానవుని శక్తిసామర్ధ్యములు అందు లేశమాత్రమే ! భగవంతుడు సాగరమైతే , సృష్టిలోని చరాచరజీవులెల్ల సముద్ర ఉపరితలంపై ఉద్భవించి లయించే తరంగాలుగా యూహింపవచ్చును . సద్గురునికి సముద్రము తానే, తరంగమూ తానే! సామాన్య మానవుడు తనను క్షణభంగుర తరంగమని ఎరుగడు,అహంకార అజ్ఞానములచే తానే సర్వమన్నటుల వ్యవహరిస్తాడు . కేవలం సద్గురునికృపచేతనే వాని అజ్ఞానతెర తొలగుతుంది . సద్గురుని కృపచే మానవుడెపుడు తానే క్షణభంగుర తరంగముగాక సర్వవ్యాపిత సాగరమని అనుభవపూర్వకంగా గ్రహించి పరమానందసాగరంలో ఈదులాడుతాడో అదేవానికి ఆత్మసాక్షాత్కారము,పరిమితస్థాయినుండి అపరిమిత ఐశ్వర్యము . దైవసృష్టిలో కేవలం మానవునికిమాత్రమే ఈవిధమైన వివేచనకు అవకాశముగలదు కావున ఈదుర్లభ నరజన్మను తెలివిగా మోక్షప్రాప్తికి వినియోగించెడి వ్యక్తి ధన్యుడు . ఇందులకు సద్గురు సన్నిధి , సర్వస్యశరణాగతి ఆవశ్యకములు . ఏవిధంగా బలీయ అయస్కాంతము సమీప లోహరజమును తనవైపుకు ఆకర్షించి ఆ లోహఖండమును సైతము మరొక అయస్కాంత శక్తిగా మార్చునో, అదేవిధంగా సద్గురువు తనశక్తిని శిష్యునికాపాదిస్తాడు.సద్గురుని బోధనామార్గములనేకవిధములు . వేషభాషలు , ఆహారవిహారాలు , తానాచరించే నిత్యకర్మలద్వారా సద్గురువు శిష్యునికి మార్గాన్ని సూచిస్తాడు . సాయిబాబా భిక్షాటనలో ఎన్నోవిషయాలు తెలియగలము . ఫకీరు వేషము , బిచ్చమెత్తుట వారి అహంకారసూన్యతకు సూచికలు . తాను తెచ్చినభిక్షను కేవలము తనకొరకేగాక తోటి మనుష్యులతోడను , పశుపక్ష్యాదులతోను పంచుకొనుట అందరిలోనేనున్నానే వారి మాటకు భాష్యము . రుచులెరుగని వారిజిహ్వ, పెక్కురుచులకు పోవద్దనే వారి సూక్తికి నిదర్శనము . అలాంటి సాధారణ చంచలచిత్త భిక్షకుని మహనీయునిగా గుర్తించి సేవించిన బాయిజాబాయి జన్మము ధన్యముగదా ! సాయిమహరాజుకు తాను మహనీయుడన్నభావమేనాడు లేదు . పాతమజీదులో తాత్యాకోతే పాటీలు , మహాల్సాపతులతో కలిసి శయనించేవారు, అంతేగాక వారికి సపర్యలు జేసెడివారు . బాబా తనభక్తులపై జూపెడి ప్రేమాదరములు మిగుల కొనియాడదగినవి . రహతావాసి కుశాల్ చంద్ గృహాన్ని పావనంజేసి వారిని సంతోషపరచేవారు . పైనజెప్పిన విషయములన్నింట బాబాజూపిన నిరహంకార నిరభిమానములు, శాంతి సహనములు ,ప్రేమానురాగములు , వివేకవైరాగ్యములు , దానధర్మములు భక్తులకు మౌనప్రబోధకములు ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" Sages look with an equal eye upon a Brahmana endowed with learning and humility, on a cow, on an elephant, and even on a dog and on outcaste. The Holy Geeta: 5:18. విద్య , వినయము పూర్తిగాగల బ్రాహ్మణునియందును, గోవునందును , ఏనుగునందును , కుక్కయందును , కుక్కనుతిను శ్వపచునియందును అంతర్యామియై ఒకేసర్వేశ్వరుండు వెలుగుచున్నాడని తెలిసికొనువారే జ్ఞానముగలవారగుదురు . ఇట్టి దివ్యత్వముగలవారే పండితులనబడుదురు . గీత : 5:18 " )
Śrī Sāyināthaaya Namah With rays of His sacred teachings, Sai Baba fills the hearts of devotees with light and awakens higher consciousness within them. By living according to His divine messages, may we make our lives truly meaningful. Sri Sai Sandeshamrutam — Chapter 8 The Supreme Lord is boundless, all-pervading Consciousness. Human consciousness, however, is limited only to the body and mind. If the Divine is the vast ocean, then all beings in creation are but waves rising and dissolving upon its surface. To the Sadguru, both the ocean and the wave are His own Self. But the ordinary human, ignorant of his fleeting nature, behaves as though he alone is everything, trapped in ego and delusion. Only by the grace of the Sadguru does this veil of ignorance lift. Through the Guru’s compassion, a seeker realizes: “I am not this momentary wave—I am the boundless ocean itself.” When this understanding dawns through personal experience, it is true Self-realization: the journey from the limited to the limitless. Among all creation, only the human birth grants the power of such discrimination. Blessed indeed is the one who uses this rare life for liberation. For this, the refuge of a Sadguru and total surrender to Him are essential. Just as a powerful magnet pulls a piece of iron close and transforms it into another magnet, so does the Guru draw the disciple to Himself and infuse him with divine strength. The ways in which a Guru teaches are countless. His attire, His words, His food habits, His daily actions— all of them silently guide the disciple. In Sai Baba’s begging rounds, profound lessons are hidden. His fakir’s attire and His practice of accepting alms show His perfect egolessness. Whatever He received, He shared— with humans, with animals, with all beings— revealing His truth: “I dwell in every heart.” His simple tongue, indifferent to tastes, teaches the seeker to rise beyond the temptations of the senses. How blessed was Bayyaji Bai, who recognized greatness in this humble wanderer and served Him with complete devotion! Sai Maharaj never considered Himself great. He slept in the old Masjid with Tatya Kote Patil and Mhalsapati and served them lovingly. His affection for devotees was deep, gentle, and overflowing. He sanctified the home of Rahata resident Kushal Chand by visiting him often. In all these actions, Baba silently displayed: – utter egolessness, – freedom from attachment, – peace and patience, – love and compassion, – discrimination and detachment, – charity and selflessness. These were His silent teachings to all. May the mercy-rays of Sri Sai shine upon everyone! May all be blessed! Om Sai Sri Sai Jai Jai Sai! Geeta Quotation (Translation) “Sages look with equal vision upon a humble, learned Brahmin, a cow, an elephant, a dog, and even the eater of dogs. Those who truly perceive the one inner Self that shines in all these forms— they alone are the wise.” — Bhagavad Gita 5:18

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)