Posts

సాయి బోధ - ఈశోపనిషత్తు.

Image
   శ్రీసాయినాథాయనమః  సాయి బోధ - ఈశోపనిషత్తు   దేహ ఆరోగ్యానికి, పోషణకు, ఎదుగుదలకు ఆహారపువిలువలతోకూడిన పౌష్టిక ఆహారము మిక్కిలి ఆవశ్యకము. అలాగే తిన్నటువంటి ఆ ఆహారమును బాగుగా జీర్ణించుకొనవలెను, లేనియెడల  అజీర్ణవ్యాధిచే ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును. ఇదేవిధంగా పుస్తక లేక గ్రంథపఠనముకూడ. చదివిన మంచి  విషయముల భావమునెఱిగి తదనుగుణంగా ఆచరించినయెడల ప్రయోజనముంటుందికాని, కేవలం అర్ధం తెలియని పఠనం వ్యర్థం, పైపెచ్చు యెంతో  తెలుసుననెడి గర్వం తలెత్తే ప్రమాదముంది. సరిగ్గా దీనిని పోలిన ఓ సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములో చూడగలము. దాసగణు మహరాజు, గొప్పసాయి భక్తుడు, కీర్తనకారుడు. ఓ పర్యాయం యితడు సంస్కృత భాషలోని ఈశావాస ఉపనిషతును మరాఠీభాషలోని ఓవీ ఛందస్సులోనికి అనువదించాడు. (గ్రంధంలో ఆత్మ తత్వముగూర్చి వివరింపబడినది.)   కాని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన విషయ సారాంశము వానికి సరిగా బోధపడలేదు, పండితులతో చర్చించినప్పటికి సరియైన సమాధానం లభింపకపోవుటచే ఆత్మసాక్షాత్కారము పొందిన సద్గుఫు సాయినాథుని దర్శించి తన సమస్యను వివరించి వివరణకై వేడుకొన్నాడు. బాబా వాని నాశీర్వదించి యిట్లన్నార...

శ్రీసాయికృష్ణ భాగవతము.

Image
 శ్రీకృష్ణ పరమాత్మనే నమః ! పాఠక   సాయిబంధువులందరికి    హృదయపూర్వక   జన్మాష్టమి   శుభాకాంక్షలు ! ముందుమాట,  ఓ చిన్న స్వానుభవము.  శ్రీకృష్ణ   జన్మాష్టమి  1994  వ   సంవత్సరములో   ఆగష్టు  29  వ   తేదీన   వచ్చినది . షుమారు ఓ నెలరోజులముందుగ    ఓ   ఆలోచన   కలిగినది .  సాయిబాబా   ఎన్నో   మహిమలు ,  లీలలు   చూపారు .  అలాగే   శ్రీకృష్ణ   పరమాత్మకూడ   బాలప్రాయంలోనే   ఎన్నెన్నో   అద్భుత   లీలలు   చూపారు .  సాయిబాబా   బూటీ   వాడలోని   మురళీధరుడుగదా !   మరి   శ్రీకృష్ణ   లీలలకు  ,  బాబా   లీలలకు   ఏమైనా   పోలికలున్నాయా   అనే   తలంపు   వచ్చినది .  ఆ   ఆలోచన   కలిగిన   రెండు   రోజుల   తర్వాత   ఈనాడు   పేపర్   చదువుతున్నాను .  కొన్నిపేజీల   తర్వాత   ఓ   పేజీలో   క్రిందభాగంలో   శ్ర...

సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు!

Image
శ్రీ సాయినాథాయనమః  శ్రీసాయి విశ్వభక్త పరివారానికి   గురుపూర్ణిమ శుభాకాంక్షలు, బాబా ఆశీసులు ! సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు! " సాధనగూర్చి సాయిచెప్పిన ఈ సూక్తులు పరమపవిత్రమైనవి. ఒకవిధంగా భగవద్గీతా సారాంశాన్ని బాబా మనకందించారు. ఫలాపేక్షరహితమైన కర్మ, కష్టించి పనిచెయ్యి, అది కర్మయోగము. దేవునినామ ముచ్ఛరించు, స్మరణ మనన, నిధిధ్యాసములు , అవి భక్తియోగము.  సద్గ్రంథాలు చదువు. సద్గ్రంథపఠనం వల్ల సద్గురునిపై మనసు లగ్నమౌతుంది. అదే గురుభక్తి, దానివల్ల జ్ఞానం కల్గుతుంది. అదే జ్ఞానయోగం. వీటన్నిటివల్లకూడా నిశ్చలభక్తి లభించలేదో అనుభవం ప్రసాదించి మనలను ఉద్ధరిస్తారు శ్రీసాయి. అదే విశ్వరూప సందర్శన యోగం. "   సాయి సూక్తి - ఆచార్యవాణి  సాయి తమ భక్తులకు బోధించినది కేవలము వాచకము అనగా నోటిమాటల బోధకాదు. వారు చెప్పినసూక్తులను సాయి స్వయంగా ఆచరించిచూపారు  , భక్తులకు సరియగు అవగాహనగూర్చుటకు తదనుగుణ అనుభవాన్నికూడ  ప్రసాదించారు, అందులకే వారు అనుభవాన్నందించే  సద్గురువులు. భగవద్గీతలో వివిధయోగములగూర్చి  వివరణ చెప్పబడినది. అవి వరుసగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన...