Posts

సాయిబాబా- నిత్యసత్యుడు, అనంతశక్తిస్వరూపుడు.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీసాయిబాబా శివ, శక్తి తత్వముల తనలో పరిపూర్ణముగ నింపుకొన్న మహాశక్తిస్వరూపుడు! నేడు బాబా మహాసమాధిచెందిన పుణ్యతిధి, 103 సంవత్సరములపూర్యము బాబా తమభౌతికరూపము చాలించారు. కాని సాయిబాబా నిత్యసత్యులు, ఈవిషయమై ముందుగా శ్రీసాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతమున చెప్పబడిన కొన్ని అక్షరసత్యవాక్యముల స్మరించెదము. శ్రీ బీ.వీ . నరసింహస్వామిగారు తమ 'భక్తులయనుభవములు' పుస్తకము మొదటిపేజీలో ఓ హైకోర్టు జడ్జిగారి యనుభవమిలా వ్రాసారు. " నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారుసమాధిచెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనటులే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధిచెందినట్లు లేరు. నాదృష్టిలో వారు అన్నిపరిమితులకు అతీతులు. వారు మామధ్య యున్నప్పుడు వారిమానవశరీరము మాకనులముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మాదృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువభాగము మా ఎరుకలో నిలబడినదిమాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము-అశాశ్వతముల అద్భుతసమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.అశాశ్వతమైన తమమానవ...

పవర్ అఫ్ అటార్ని !

Image
శ్రీసాయినాథాయనమ! శ్రీరామకృష్ణాయనమః! " పవర్ అఫ్ అటార్ని" అంటే ఏమిటో సాధారణంగా అందరికి తెలిసినవిషయమే. న్యాయస్దాన పరమగు తనసర్వహక్కులను వేరొకరికి సమర్పించుట. ముఖ్యముగా ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఓ వ్యక్తి తాను స్వయంగా హాజరుకాలేనపుడు తనతరఫున నమ్మకమైన వేరొకవ్యక్తికి తన పూర్తిహక్కులను సమ్పరిస్తాడు. రెండవవ్యక్తి మొదటివ్యక్తి తరఫున పనిపూర్తిజేస్తాడు. ఇదే విషయం ఆధ్యాత్మికరంగంలో గురుశిష్యులకు కూడ వర్తిస్తుందనేది ప్రస్తుత వ్యాసములోని విషయము. శిష్యుడతనతనగురువునెలా సేవించాలో తెలిపే ఆధ్యాత్మిక అంశములుండుటచే భక్తులకిది సహాయకారి కాగలదని తలచి వ్రాయడమైనది. శ్రీరామకృష్ణ పరమహంస మరియు ఆతని ప్రియశిష్యుడు గిరీష్ చంద్రఘోష్ లకు సంబంధించిన విషయమిది.అప్పట్లో గిరీష్ (1844-1912)బెంగాల్ రాష్ట్రంలో మిగుల పేరొందిన రంగస్థలనటుడు కళాకారుడు రచయిత దర్శకుడు.ఇతడు శ్రీరామకృష్ణను పెక్కుమార్లు దర్శించి వారికి మిగుల సన్నిహితభక్తుడైనాడు. ఓ రోజు గిరీష్ పరమహంసనిలా అడిగాడు, " స్వామీ! ఇప్పటినుండి నేనెలాంటి సాధనచేయాలి? " అందులకు శ్రీరామకృష్ణ సమాధానంగా " ప్రస్తుతం జీవనమే కొనసాగించు. ఓ చేత్...

సాయిలీలా విశ్లేషణ - సర్వస్యశరణాగతి.

Image
శ్రీసాయినాథాయనమః. శ్రీసాయిసచ్చరిత్రలో పెక్కుమంది సాయి అంకితభాక్తులగాథలను చూడగలము. వారెల్లరు సాయిబాబాను తమదైవంగా భావించి పూజించేవారు. ఓసందర్భంలో సాయి వారి భక్తినిపరీక్షింపదలచి ఓ చిన్న పరీక్ష పెట్టారు. ఈవివరములన్నియు పాఠకులు 23వ అధ్యాయమున చూడగలరు. ఒకప్పుడు శిరిడీలో కలరావ్యాధి మిగుల వ్యాపించినది. ఆకారణంగా గ్రామపెద్దలు వ్యాధి నిర్మూలనకై రెండు షరతుల విధించారు. గ్రామస్తులు కట్టెలుకొనరాదు, మేకను కోయరాదనెడివి ఆ నియమాలు. ఆచట్టములు చాదస్తమనితలఁచి బాబా వాటిని లక్ష్యపెట్టక తమ నిత్యధునినిర్వహణకై కట్టెలు కొన్నారు. రెండవ నియమోలంఘన ప్రస్తుత చర్చయనియాంశ విషయము. నిబంధనలమలులో నున్నపుడు యెవరో చావుకుసిద్ధమైన ఓముసలి మేకను ద్వారకామాయికి తెచ్చారు. తమభక్తుల విశ్వాసాన్ని పరీక్షింపదలచి బాబా ఓచక్కని కథనడిపారు. బాబాచే మిగులగౌరవము పొందువాడు మిగులసన్నిహితుడగు బడేబాబాతొ ఆ మేకను నరుకవలసినదిగా సాయి చెప్పారు. కాని కారణమేమీలేక మేకనుచంప బడేబాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపనిచేయమన్నారు. శ్యామా రాధాకృష్ణమాయివద్దకుపోయి కత్తిదెచ్చి బాబాముందు పెట్టాడు. విషయముతెలిసిన రాధాకృష్ణమాయి కత్తినితెప్పించుకొన్నది. మరొ...

సాయిబాబా శ్రీగణేశుడు.

Image
శ్రీసాయిగణేశాయనమః! పాఠకభక్తులెల్లరకు వినాయకచవితి శుభాకాంక్షలు. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధారంభమున రచయిత హేమాద్రిపంత్ ప్రప్రధమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి గ్రంథరచన జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని స్థుతించాడు.నిత్యం శిర్డీలోని సాయిసమాధిమందిరంలో భక్త దాసగణు రచించిన శ్రీసాయినాథ స్థవన మంజరి శ్రవణం జరుగుతుంది. స్థవనమంజరి రచన 9-9-1918, సోమవారం గణేశ చతుర్థి రోజున (నేటికి సరిగా 103 సంవత్సరముులపూర్వము) నర్మదానది తీరాన మహేశ్వర క్షేత్రమువద్ద సమాప్తమైనది. దాసగణు స్వయంగా బాబాకు మూడురోజులపిమ్మట సెప్టెంబరు 12న వినిపించి వారికంకితంజేసి ఆశీసులు పొందాడు. సాయి మిగుల ప్రసన్నులై "దీనిని నిత్యపారాయణ చేసేవారి సర్వారిష్టాలు తొలగిపోతాయని" అన్నారు. చిదంబరరావు గాడ్గిల్ యనే గణపతిభక్తుడు ఓ పర్యాయము శిరిడీలో సాయిని దర్శించి, అప్పటినుండి యింటివద్ద బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు శిరిడీ వచ్చినపుడు సాయి చిరునవ్వుతో, " ఈముసలాయన చాలాటక్కరి ఎలుకే నావాహనమని కనిపెట్టాడు" అన్నారు. మరొక పర్యాయం బాంద్రానుండి ఒకామెవచ్చి బాబాకునమస్కరించి ...

శ్రీకృష్ణభగవానుడు చెప్పిన భక్తుని లక్షణములు.

Image
శ్రీసాయినాథాయనమః!శ్రీకృష్ణపరమాత్మనేనమః! పాఠకమహాశయులెల్లరకు జన్మాష్టమి శుభాకాంక్షలు! సాధారణంగా జనులు తమకు నచ్చినవిధంగా తమతృప్తికి ఆనందానికి అనుగుణంగా దేవుని పూజిస్తారు. దేవునిపై భావంకూడా ఉహాజనితమే! మనకు ఇష్టమైన విధంగాగాక భగవంతునికి ప్రీతికలుగునటుల మన నిత్యవ్యవహారములను సరిదిద్దుకొనుట ఆధ్యాత్మిక ప్రగతికెంతో ముఖ్యమైన విషయము. భగవంతుడనగా ధర్మము. ధర్మానికనుగుణంగా నడచుకోగలిగితే దైవానికి ఇష్టమైనవారలమే గదా! భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగములో శ్రీకృష్ణపరమాత్మ తమకు ప్రియమైన భక్తలక్షణాలను అర్జునకు వివరించాడు. అసందేశం సర్వులకు వర్తిస్తుందనే వుద్దేశ్యంతో శ్రీకృష్ణజన్మాష్టమి శుభసందర్భమున స్మరించుట మిగుల సమంజసముగాతలచి శ్రీకృష్ణసందేశమిచట మిగుల క్లుప్తముగా వ్రాయడమైనది. ప్రియభక్తుని లక్షణములు వరుసగా 1)సర్వభూతములను అనగా యెవరిని ద్వేషింపనివాడు. 2)మిత్రధర్మము కలవాడు. 3)కారుణ్యము కలవాడు. 4)మమకారములేనివాడు. 5)అహంకారరహితుడు. 6)సుఖదుఃఖములయందు సమభావము కలిగినవాడు.7)ఓర్పుకలవాడు.8)నిత్యసంతోషి.9)ధ్యానానుష్ఠానపరుడు. 10)మనోనిగ్రహము కలవాడు.11)దృఢమైన జ్ఞానముకలవాడు.12)భగవంతునియందర్పించిన మనసు బుద్ధికలవాడు.1...

సాయిలీలా విశ్లేషణ - రాచకురుపు నయమగుట.

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీసాయిబాబా వైద్యులకు వైద్యుడు, మహావైద్యుడు, సాక్షాత్తు నారాయణుడు. 'వైద్యోనారాయణోహరి' నానుడి సాయి పట్ల పరిపూర్ణముగా సార్ధకమైనది. ప్రస్తుత విషయము శ్రీసాయిసచ్చరిత్ర 34 అధ్యాయమునుండి గ్రహించడమైనది. ఇందు శ్రీసాయినాథుల భక్తకారుణ్యము, సామర్ధ్యము, ద్వారకామాయి ప్రాశస్థ్యము, బాబా మాటలమంత్రాక్షరాలు, ఉదీమహిమ మున్నగు విషయములను పాఠకులు తెలియగలరు. ఈవిశేషములనిచట క్లుప్తముగా పరిశీలించెదము. ఓ కుఱ్ఱవాడు నయముకాని రాచకురుపువ్యాధిచే బాధపడుచున్నాడు. ఆతని మేనమామ నాసిక్ జిల్లాలోని మాలేగాంలో పెద్దవైద్యుడు. మానవప్రయత్నము కొంతవరకుమాత్రమే విజయవంతమగునటుల, ఆ డాక్టరుతో పాటు మరికొందరు వైద్యులు మిగులప్రయత్నించినప్పటికీ వాని వ్యాధి తగ్గలేదు. బంధుమిత్రుల సలహాపై తల్లిదండ్రులు కుర్రవానిని బాబాచెంతకు తెచ్చి బిడ్డనుకాపాడమని మిగులవినయవిధేయతలతో వేడుకొన్నారు. వారినోదార్చి శ్రీసాయినాథులిట్లన్నారు, " ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు వ్యాధిచేబాధపడరు, కురుపుపై ఉదినిపూయుడు. దేవునిపై నమ్మకముంచుడు. ఇది పాతమజీదుకాదు, ద్వారవతి. ఇందుకాలిడినవారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారికష్టములు గట్టెక్క...

గురుపూర్ణిమ.

Image
శ్రీసాయినాథాయనమః నేడు పవిత్ర గురుపూర్ణిమ. గురుపూర్ణిమ పరిపూర్ణ సద్గురుతత్వానికి, జ్ఞానానికి సంకేతమని విజ్ఞులు చెబుతారు. విష్ణుభగవానుని అంశగా జన్మించిన వేదవ్యాసమహర్షి ఇదేసుదినమున ఆవిర్భవించుటచే ఈరోజు వ్యాసపూర్ణిమగా ప్రాచుర్యము పొందినది. గౌతమబుద్ధుడు పూర్ణిమరోజునే జన్మించాడు, పూర్ణిమరోజునే నిర్వాణము లేక ఆత్మసాక్షాత్కారం పొందాడు మరల పూర్ణిమరోజునే నిర్యాణం చెందాడు. పవిత్రసిక్కుమత స్థాపకుడు గురునానక్ పూర్ణిమదినముననే అవతరించాడు. ఈవిధంగా పూర్ణిమ వ్యక్తియొక్క ఆధ్యాత్మిక జీవనంలో ప్రముఖ సంకేతస్థానాన్ని సంతరించుకొంది. సమర్ధసద్గురు శ్రీసాయినాథులు స్వయంగా భక్తులకు చేసుకోమని చెప్పినది గురుపూర్ణిమ పండుగను మాత్రమే! ప్రస్తుతవ్యాసంలో శిరిడీలో జరుగుగురుపూర్ణిమ యెలా ఆరంభమైనదో తెలుపు వివరాలను పరిశీలించెదము. పూజ్య ఆచార్యభారద్వాజ మాస్టరుగారు రచించిన శ్రీసాయిలీలామృతమునుండి ప్రస్తుత విషయములను గ్రహించడమైనది. " ఓరోజు 1908వ సంవత్సరములో, పండరినుండి వచ్చిన కృష్ణాజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామాతో " ఆముసలయ్య (నూల్కర్) ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు " అని అతడు చెప్ప...