సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును." బాబా సపత్నేకర్ తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె. " ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. " సంతానలేమిచే దుఃఖపడు యాతనికి ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవేనమః ( గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు విశ్వ మూలకారణ పరబ్రహ్మ. అలాంటి గురువరేణ్యునకు నా నమస్కారములు.) శరణం శరణం గురుచరణం శరణం శరణం శరణం శరణం సాయీచరణం ...శరణం శరణం భవభయహరణం బహుశుభకరణం బాబాచరణం పావన తీర్ధం ...