సాయి కథలు - పై లోకాలున్నయ్యా ?

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు -  పై లోకాలున్నయ్యా ?
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై 
ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం 
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు?  సర్వము తానె యైన వా 
వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే  శరణంబు వేడెదన్                గజేంద్రమోక్షము, శ్రీమద్భాగవతము 

ఓ పర్యాయము బాబా ప్రియభక్తుడు శ్యామా తనకు బ్రహ్మాది లోకాల జాపమని సాయిని పట్టుబట్టాడు. భగవంతునిముందు అవి అల్పాలని, అశాశ్వితాలని, వాటిని పట్టించుకోవద్దనీ చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయాలోకాలు కన్పిస్తుంటే బాబా, సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి జూపి , " మనం కోరవలసినది వీటికతీతమైనది. " అన్నారు. 
శ్రీ సాయిలీలామృతము 
పైనున్న లోకాలగురించి  రామకృష్ణ పరమహంస గాంచిన అద్భుత దృశ్యము.
శ్రీరామకృష్ణుల మాటలలోనే వారు గాంచిన అద్భుతదృశ్య వివరములు, " ఒకరోజు సమాధిస్థితిలో నామనసు వెలుగుమార్గంలో పయనిస్తూ  యెంతో సుదూర ఉన్నత లోకాలలో   విహరించినది. కొద్దిసమయంలోనే నక్షత్రమండలాలదాటి సూక్ష్మ భావనాలోకంలో ప్రవేశించినది. అలా పైపైకీ వెళ్ళేమార్గానికిరువైపులా దేవీ దేవతల సుందరరూపాలు విరాజిల్లుచున్నాయి. నామనసప్పుడు భావనాలోక  హద్దులుదాటి ప్రకాశమయ వెలుగులతో వేరుచేయబడిన కారణలోకంలో ప్రవేశించినది. ఆలోకం మనుష్యలోకం, దేవీదేవతల లోకాలకంటే ఎంతో యెత్తైనది. వారెల్లరు ఆ కారణలోకానికి చాల దిగువస్థానంలో విహరించెడివారే. దైవావతారులు సైతము  ప్రవేశించుటకు సాహసింపలేనిదా కారణలోకము. ఆమరుక్షణములోనే  అచట  తపమాచరించు వందనీయులగు సప్తఋషుల గాంచాను.   జ్ఞానంలోగాని, పవిత్రతలోగాని, త్యాగంలోగాని మరియు ప్రేమలోగాని ఆ ఋషిపుంగవులు  మనుష్యులనేగాక  దైవాల స్థాయినిగూడా  మించినటుల నాకు తోచినది. వారి ఘనతకు మిగుల అబ్బురపడినాను. ఆ ప్రకాశమయ అఖండిత వెలుగుక్షేత్రమునుండి ఒక ఖండభాగము వేరై  అదియొక   దైవిక బిడ్డ రూపు దాల్చినది. ఆబిడ్డ తపమాచరించు యొక ఋషిని సమీపించి, మృదువుగా కంఠమును ప్రేమతో స్పృశించి బహుతియ్యని పలుకులతో వానిని సమాధిస్థితినుండి బాహ్యస్థితికి తెచ్చుటకు ప్రయత్నించినది. బాలుని  ఆ ఇంద్రజాలస్పర్శచే   ఋషి సమాధిస్థితి వీడి అర్ధనిమీలిత నేత్రాలతో ఆ అద్భుత బిడ్డను తిలకించాడు. బాలుని  సుందరరూపానికి ఋషి మిగుల పులకించాడు, తనహృదయ బంగారు గనిగా తలచాడు. పరమానందంతో దైవికబిడ్డ వానితో యిలా అన్నాడు, ' నేను క్రిందికి వెళ్లుచున్నాను. నీవు నాతో తప్పక రావలెను.'   మౌనముద్ర వీడకయే  తాపసి తన అంగీకారభావమును తెలియబరచాడు. బిడ్డనుజూస్తూనే  మరల సమాధిస్థితిలోకి ప్రవేశించాడు. నాకు   మిగుల ఆశ్చర్యముకలిగేవిధముగా  ఆ తాపసియొక్క  కొంతదేహభాగము, కొంత మనోభాగము ప్రకాశమయ వెలుగు పుంజంలా భూమిని తాకినది. నరేంద్రు (స్వామి వివేకానంద)  ని జూసిన క్షణంలోనే వానిని  ఆ ఋషిగా గుర్తించాను. "   తాపసిని భూలోకానికి దెచ్చిన  దైవిక బిడ్డ తామేనని   శ్రీరామకృష్ణ పరమహంస ఆ తరువాత తెలిపారు.
Reference: Sree Ramakrishna and His Divine Play by Swami Sharadananda, Swami Chetanananda 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక !
అందరికి శుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !

బ్రహ్మలోకము


 వైకుంఠము

కైలాసము 

Comments

  1. సర్వలోకములకు అతీతమైన మూలకారణము నెరుగవలెనని, పొందవలెనని సాయిబాబా ప్రబోధించారు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)