Posts

Showing posts from January, 2020

సాయి కథలు - ఆరతి సాయిబాబా !

Image
శ్రీసాయినాథాయనమః  ప్రియ సాయిభక్తకోటి పరివారానికి నూతనసంవత్సర శుభాకాంక్షలు ! సాయి కథలు - ఆరతి సాయిబాబా ! (సంక్షిప్త సాయిచరిత్ర) (సమర్ధసద్గురు  శ్రీసాయిబాబా ప్రేరణచే హేమాద్రిపంతు రచించిన  శ్రీసాయిసచ్చరిత్రము సాయిభక్తులకు భగవద్గిత, ఖురాను, బైబిల్ లాంటి పవిత్రగ్రంధ సమానము. ప్రస్తుతము శ్రీసాయిచరిత్రసారాంశమును  తక్కువసమయంలో చదువుటకు వీలుగా వ్రాయడమైనది. ఇప్పటికే పూర్తిగ్రంధ  పారాయణము జేసిన భక్తులకిది సింహావలోకనంగా ఉపకరించుననెడి సదుద్దేశ్యముతో జేసిన నావినయపూర్వక ప్రయత్నమిది. పాఠకులు ఇందలి మంచిభావముల, సందేశములను  గ్రహించి సాయిబాబా పరిపూర్ణకృపపొందుటకు  సద్గురుసాయినాథుని మనఃపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను.)  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము    గురుమద్యే స్థితం విశ్వం,  విశ్వమద్యే స్థితో గురు  గురుర్విశ్వం నచాన్యోస్తి,   తస్మై శ్రీగురువేనమః  1) సాయిబాబా కర్మధ్వంసి, గోధుమల విసిరి శిరిడీగ్రామమునుండి   కలరావ్యాధిని పారద్రోలిరి.  2)...

సాయి కథలు: సద్గురువు - అభయప్రదాత.

Image
శ్రీసాయినాథాయనమః                                                                                  సాయి కథలు: సద్గురువు - అభయప్రదాత " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సద్గురువులు, మహాత్ములు మానవాళిని ఉద్ధరించుటకై భూమిపై అవతరింతురు. గడచిన వంద, రెండువందల యేండ్లకాలంలో ఎందరో మహనీయులు భూతలమును పవిత్రపరిచారు. ముఖ్యంగా భారతావనిలో వీరిరాక విశేషంగా గోచరిస్తుంది. ఆకోవకు చెందినవారే సద్గురుదేవులైన సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మున్నగువారు. సాయిబాబా తమ చివరిక్షణంవరకు మానవోద్ధరణకు విశేష కృషిజేశారు, ప్రస్తుతం తమ సమాధినుండిగూడ ఆ పవిత్ర కార్యం నిర్వహిస్తున్నారు. సద్గురువులు తమ అలౌకిక దృష్టి, నవ్వు మరియు స్పర్శలచే తమ భక్తులకు ఇంద్రియాతీత పారవశ్య, పరమానందముల సమకూర్పగలరు. ఖాపర్డే  విద్యావంతుడు, సాయిని సశరీరంగా సేవించిన ధన్యజీవి.  అతడ...

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 3

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము  3 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."   గురువు స్పర్శపొందిన తృణమైనా భక్తునకు అత్యంత విలువైన బహుమానము.  సాయిభక్తుడు, కీర్తనకారుడు దాసగణు మహారాజు చెప్పిన బాబా తలగడగా వాడిన ఇటుక వివరణమిచట చూచెదము.  సాయి వద్ద ఎప్పుడూ ఒక ఇటుక ఉండేది. అదంటే వారికి ప్రాణంకంటే తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దానిని తమచెంతనే తలక్రింద పెట్టుకొనేవారు. ఒకనాడు నానాచందోర్కరు అది చూచి ఆశ్చర్యపోయి నమస్కరించి, " బాబా, మీరు తలక్రింద ఆ ఇటుక పెట్టుకొనవద్దు , నేనొక దిండు సమర్పించుకొంటాను" అన్నాడు. సాయిబాబా, లక్షదిండ్లయినా ఈ ఇటుకతో సమానం గాదు, ఇది నాగురు ప్రసాదము, ఇది యావత్ విశ్వంకంటే విలువైనది. ఈ ఇటుకే నా ధ్యేయము, ధ్యానము, నాప్రాణము గూడా. ఇది పగిలితే నా శరీరంగూడా మరణించడం తధ్యం! " అన్నారు. " దీనికి నాగురువుయొక్క పాదస్పర్శ వున్నది గనుక దీనిని నా తలక్రింద వుంచుక...

సాయి కథలు - అర్హత

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు -  అర్హత " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము వ్యక్తులకు తాముజేసిన పాపపుణ్యాలబట్టి  భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, గురుకృపా లభిస్తాయి.కావున ఈవిషయమున ఇతరులతో పోల్చుకొనరాదు.  సాయిలీల కీర్తనకారుడు, ప్రముఖ సాయిభక్తుడు శ్రీ దాసగణు మహారాజు చెప్పిన సాయి సందేశము.  " ఒకసారి ఒకభక్తుడు , నాకు భగవంతుడెలా లభిస్తాడు? "  అని అడిగాడు. వెంటనే బాబా తమకు వందరూపాయలు కావాలని బాగ్ చంద్ మార్వాడికి, మరో వర్తకునికి కబురుజేశారు. ఆ యిద్దరూ తమవద్ద పైకంలేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాను పిలిచి ఆపైకం అడిగారు. అతడు చీటీ వ్రాసి పంపగానే బాగ్ చంద్ మార్వాడి వందరూపాయలు పంపారు. ఆ భక్తునితో బాబా, ' ఈప్రపంచంలో అన్నీ యిలానే వుంటాయి ' అన్నారు. అతడికర్ధం కాలేదు. అపుడు నేనిలా వివరించాను. బాబా అడిగినా పైకం రాలేదుగాని నానా అడిగినవెంటనే లభించింది. అలానే అడిగినంతమాత్రాన సాక్షాత్కారం లభించదు. అర్హత కలవారికే లభిస్తుందని చెప్పాను ".    Ref: శ్రీ సాయిసన్నిధి , పరమపూజ్య  ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద...