శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - అర్హత
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
వ్యక్తులకు తాముజేసిన పాపపుణ్యాలబట్టి భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, గురుకృపా లభిస్తాయి.కావున ఈవిషయమున ఇతరులతో పోల్చుకొనరాదు. సాయిలీల కీర్తనకారుడు, ప్రముఖ సాయిభక్తుడు శ్రీ దాసగణు మహారాజు చెప్పిన సాయి సందేశము.
" ఒకసారి ఒకభక్తుడు , నాకు భగవంతుడెలా లభిస్తాడు? " అని అడిగాడు. వెంటనే బాబా తమకు వందరూపాయలు కావాలని బాగ్ చంద్ మార్వాడికి, మరో వర్తకునికి కబురుజేశారు. ఆ యిద్దరూ తమవద్ద పైకంలేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాను పిలిచి ఆపైకం అడిగారు. అతడు చీటీ వ్రాసి పంపగానే బాగ్ చంద్ మార్వాడి వందరూపాయలు పంపారు. ఆ భక్తునితో బాబా, ' ఈప్రపంచంలో అన్నీ యిలానే వుంటాయి ' అన్నారు. అతడికర్ధం కాలేదు. అపుడు నేనిలా వివరించాను. బాబా అడిగినా పైకం రాలేదుగాని నానా అడిగినవెంటనే లభించింది. అలానే అడిగినంతమాత్రాన సాక్షాత్కారం లభించదు. అర్హత కలవారికే లభిస్తుందని చెప్పాను ".
Ref: శ్రీ సాయిసన్నిధి , పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
లోకాన గురుకృప పొందగలిగితే సర్వము పొందినటులే !
ReplyDelete