సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 3

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము  3
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
" సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."  

గురువు స్పర్శపొందిన తృణమైనా భక్తునకు అత్యంత విలువైన బహుమానము.  సాయిభక్తుడు, కీర్తనకారుడు దాసగణు మహారాజు చెప్పిన బాబా తలగడగా వాడిన ఇటుక వివరణమిచట చూచెదము. 

సాయి వద్ద ఎప్పుడూ ఒక ఇటుక ఉండేది. అదంటే వారికి ప్రాణంకంటే తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దానిని తమచెంతనే తలక్రింద పెట్టుకొనేవారు. ఒకనాడు నానాచందోర్కరు అది చూచి ఆశ్చర్యపోయి నమస్కరించి, " బాబా, మీరు తలక్రింద ఆ ఇటుక పెట్టుకొనవద్దు , నేనొక దిండు సమర్పించుకొంటాను" అన్నాడు. సాయిబాబా, లక్షదిండ్లయినా ఈ ఇటుకతో సమానం గాదు, ఇది నాగురు ప్రసాదము, ఇది యావత్ విశ్వంకంటే విలువైనది. ఈ ఇటుకే నా ధ్యేయము, ధ్యానము, నాప్రాణము గూడా. ఇది పగిలితే నా శరీరంగూడా మరణించడం తధ్యం! " అన్నారు. " దీనికి నాగురువుయొక్క పాదస్పర్శ వున్నది గనుక దీనిని నా తలక్రింద వుంచుకుంటున్నాను, ప్రతిరోజూ తెల్లవారిన దగ్గరినుండి మీరంతా వచ్చి నా మోకాళ్ళమీద పడతారు. మీ నమస్కారాలన్నీ నేను నాగురువుకు సమర్పించుకొంటాను. "  

Ref: శ్రీ సాయిసన్నిధి , పరమపూజ్య  ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

Comments

  1. మనుషులలోని నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపింపజేసి మేల్కొల్పుతుంది సద్గురుస్పర్శ !

    ReplyDelete

Post a Comment