Posts

Showing posts from April, 2022

శ్రీమద్భగవద్గీతాసారము 3 - భగవాన్ శ్రీరమణమహర్షి.

Image
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః. నేడు భగవాన్ శ్రీ రమణమహర్షి మహాసమాధి చెందిన పుణ్యతిథి. ( Continued ) 19) ఎల్లప్పుడును భగవంతుడ నగు నాయందేగాగ్ర చిత్తులును, ప్రీతిపూర్వకముగా నన్ను భజించువారును నైన, నిరంతర ధ్యానపరులకు పరమేశ్వరుండనగు నన్ను పొందు జ్ఞానమును కలిగించుచున్నాను. (10 : 10). 20) ఎల్లప్పుడును ధ్యానముచేయు భక్తుల ననుగ్రహించుట కొరకే వారి అంతఃకరణ మందున్నవాడనై, వారియొక్క అజ్ఞానజన్యమైన మోహాంధకారమును జ్ఞానమనెడి దీపముచేత పోగొట్టుచున్నాను. (10 : 11). 21) అట్టి అజ్ఞానమును జ్ఞానముచేత నెవరు నాశము చేయుచున్నారో, అట్టివారలకు జ్ఞానము, సూర్యునివలె, ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. (5 : 16). 22) బ్రహ్మవేత్తలు దేహమునకన్న కర్మేంద్రియములు చైతన్యము గలవి యనియు, వాటికన్న జ్ఞానేంద్రియములు చైతన్యవంతములనియు, అట్టియింద్రియములకంటె మనస్సు చైతన్యమైనదనియు, మనస్సుకంటెను బుద్ధి చైతన్యమైనదనియును, అట్టి బుద్ధి కంటెను మిక్కిలి చైతన్యము గలది యాత్మ యనియు చెప్పుదురు. (3 : 42). 23) ఓ అర్జునా! ఈవిధముగా బుద్ధికంటె వ్యతిరిక్తమైన యాత్మను జ్ఞానస్వరూపంబుగా నెరింగి, తన్నుతాను నిశ్చలముగా చేసికొని సుస్థిర మొనర్చుక...

శ్రీమద్భగవద్గీతాసారము 2 - భగవాన్ శ్రీరమణమహర్షి.

Image
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః. (Continued). 10) బురద మొదలగు సకల వస్తువులయందును వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమైన దగుటవలన పంకాదులచే అంటబడనట్లు సకల దేహములయందును గల పరమాత్మ దేహేంద్రియములతో నంటబడదు. (13 : 33). 11) ఆ బ్రహ్మపదమును సూర్యుడు ప్రకాశింపజేయజాలడు, చంద్రుడు ప్రకాశింపజేయజాలడు, అగ్నియు ప్రకాశింపజేయజాలదు, ఏ సూక్ష్మస్థానమును పొంది తిరిగి జన్మకు రారో అదియే నాయొక్క పరమపదము. (15 : 6). 12) ఏ పరమాత్మను ఇంద్రియములకు గోచరము కానివాడనియు, నాశరహితుడనియు చెప్పుచున్నారో ఆ పరమాత్మనే ఉత్తమమైన ప్రాప్యస్థానమనియును చెప్పుదురు. దేనిని పొందినచో తిరిగి జన్మించరో అదియే భగవంతుడ నగు నా యొక్క సర్వోత్తమ మయిన స్థానము. (8 : 21). 13) అభిమానము లేనివారును; దారా, పుత్ర, బంధు, మిత్ర, ధనధాన్యాదుల యందలి యాసక్తిని విడచినవారును, సదా భగవధ్యానమును చేయువారును, కోరికల నన్నిటినీ విడిచిన వారును, సుఖదుఃఖ కారణములగు శీతోష్ణాది ద్వన్ద్వములచేత విడువబడిన వారునైన అజ్ఞానరహితులు (జ్ఞానులు) నాశములేని ఈ మోక్షపదవిని పొందుచున్నారు. (15 : 5). 14) వేదములలో చెప్పబడినట్టి చేయదగిన, చేయదగని వాక్యములను అనాదరణ చేసి, విడిచిపెట్టి, స్వేచ్చ...

శ్రీమద్భగవద్గీతాసారము 1 - భగవాన్ శ్రీరమణమహర్షి.

Image
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః. భగవాన్ ఓ పర్యాయం తమను దర్శించవచ్చిన పండితునికి భగవద్గీతా ఘనతనుగూర్చి వివరిస్తున్నారు. ఆ సమయంలో వారికి సమీపమునున్న భక్తుడొకరు 700 శ్లోకములతో కూడిన గీతను గ్రహించుట బహుజటిలమనియు ఒక్కశ్లోకములో గీతాసారమును తెలుపవలసినదిగా విన్నవించుకున్నాడు. అందులకు సమాధానంగా భగవాన్, గీత 10వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని వివరించారు. " ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే".పిమ్మట వారు దిగువ వివరించిన 42 శ్లోకముల నెన్నుకొన్నారు. వేరు వేరు అధ్యాయములలోని శ్లోకములను భగవాన్ భక్తులకుపయోగముకొరకు ఓ ప్రత్యేక క్రమములో కూర్చారు. (పైన పేర్కొనబడిన శ్లోకము వరుసలో 4వదిగా చెప్పడమైనది). 1) సంజయుడు చెప్పాడు: మధుసూదనుడు, అట్లు కనికరముతో కూడుకొన్నవాడును, కన్నీటితో నిండుకొని కలతబారిన నేత్రములు గలవాడును, దుఃఖపడుచున్న వాడును నగు అర్జునినికిటుల జెప్పెను.(2:1, రెండవ అధ్యాయము :1వ శ్లోకము). 2) శ్రీ భగవంతుడు చెప్పెను. కుంతీపుత్రుడవగు ఓ అర్జునా ! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనినెవడు తెలియుచున్నాడో,వానిని క్...