శ్రీమద్భగవద్గీతాసారము 3 - భగవాన్ శ్రీరమణమహర్షి.
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః. నేడు భగవాన్ శ్రీ రమణమహర్షి మహాసమాధి చెందిన పుణ్యతిథి.
( Continued )
19) ఎల్లప్పుడును భగవంతుడ నగు నాయందేగాగ్ర చిత్తులును, ప్రీతిపూర్వకముగా నన్ను భజించువారును నైన, నిరంతర ధ్యానపరులకు పరమేశ్వరుండనగు నన్ను పొందు జ్ఞానమును కలిగించుచున్నాను. (10 : 10). 20) ఎల్లప్పుడును ధ్యానముచేయు భక్తుల ననుగ్రహించుట కొరకే వారి అంతఃకరణ మందున్నవాడనై, వారియొక్క అజ్ఞానజన్యమైన మోహాంధకారమును జ్ఞానమనెడి దీపముచేత పోగొట్టుచున్నాను. (10 : 11). 21) అట్టి అజ్ఞానమును జ్ఞానముచేత నెవరు నాశము చేయుచున్నారో, అట్టివారలకు జ్ఞానము, సూర్యునివలె, ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. (5 : 16). 22) బ్రహ్మవేత్తలు దేహమునకన్న కర్మేంద్రియములు చైతన్యము గలవి యనియు, వాటికన్న జ్ఞానేంద్రియములు చైతన్యవంతములనియు, అట్టియింద్రియములకంటె మనస్సు చైతన్యమైనదనియు, మనస్సుకంటెను బుద్ధి చైతన్యమైనదనియును, అట్టి బుద్ధి కంటెను మిక్కిలి చైతన్యము గలది యాత్మ యనియు చెప్పుదురు. (3 : 42). 23) ఓ అర్జునా! ఈవిధముగా బుద్ధికంటె వ్యతిరిక్తమైన యాత్మను జ్ఞానస్వరూపంబుగా నెరింగి, తన్నుతాను నిశ్చలముగా చేసికొని సుస్థిర మొనర్చుకొని జయింప ప్రయాస మైనదియు, కామస్వరూప మైనదియునైన మూలప్రకృతి యనెడి శత్రువును జయింపుము. (3 : 43). 24) ఏ ప్రకారము చక్కగా రగులుచుండెడి అగ్ని హోత్రుడు సమిధల ననగా కట్టెలను హోమ ద్రవ్యములను భస్మము చేయుచున్నాడో ఆ ప్రకారముగానే జ్ఞానమనెడు అగ్ని సమస్తకర్మలను భస్మము చేయుచున్నది. (4 : 37). 25) ఎవనియొక్క కర్మలన్నియు కామ సంకల్పములచే విడువబడినవో అనగా ఫలాపేక్ష రహితములో, అట్టి జ్ఞానమనెడి అగ్నిచేత దహింపబడిన కర్మలు గలవానిని పెద్దలు పండితునిగా చెప్పుదురు. (4 : 19). 26) కామక్రోధములు లేనివాడును, బాహ్యవిషయములమీదికి పోకుండునట్లు నియమింపబడిన అంతఃకరణము గలవారును. ఆత్మతత్త్వము తెలిసికొనినవారును నయిన సన్యాసులకు (త్యాగులకు) ఈ శరీరముతో నున్నప్పుడును, ఈ శరీరము పోయిన వెనుకను అంతటను మోక్షము ఉండనే యున్నది. (5 : 26). 27) ధైర్యము నవలంబించిన దృఢమైన బుద్ధిచేత మనస్సును ఆత్మతో లయపరచవలెను. అట్లు లయపరచిన తరువాత ఆత్మతత్త్వమునకంట దానిని కొంచెమైనను చింతింప చేయకూడదు. నిశ్చింతుడు కావలెను. (6 : 25). సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! (To be continued ).
Summary of Sreemadbhagavadgeetha 3 : Selected verses by Bhagavan Sree Ramana Maharshi. 19) To the ever-steadfast, worshipping Me with love, I give the " Buddhi-Yoga", by which they come to Me. (10:10) 20) Out of mere compassion for them, I, dwelling within their heart, destroy the darkness born of ignorance by the luminous Lamp-of-knowledge. (10:11). 21) To those whose ignorance is destroyed by the knowledge of the Self, like the sun, to them Knowledge reveals the Knowledge of the Self, like the sun, to them Knowledge reveals the Supreme. (5:16). 22) They say that the senses are superior to the body; superior to the senses is the mind; superior to the mind is the intellect; one Who is even superior to the intellect is He, (the Atman/Self). (3:42). 23) Thus knowing Him, Who is superior to the intellect and restraining the self by the Self, O mighty-armed, slay you , the enemy in the form of 'desire', no doubt hard indeed to conquer. (3:43). 24) As the blazing fire reduces fuel to ashes, O Arjuna, so does the Fire-of-Knowledge reduce all actions to ashes. (4:37). 25) Whose undertakings are all devoid of desires and purposes, and whose actions have been burnt by the Fire-of-Knowledge, him the " Wise" call a Sage. (4:19). 26) Absolute Freedom exists on all sides for those self-controlled ascetics, who are free from desire and anger, who have controlled their thoughts, and who have realized the Self. (5:26). 27) Little by little, let him attain quietude by the intellect, held firm; having made the mind established in the Self, let him not think of anything. (6:25). (To be continued).
Comments
Post a Comment