శ్రీమద్భగవద్గీతాసారము 2 - భగవాన్ శ్రీరమణమహర్షి.

శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః.
(Continued). 10) బురద మొదలగు సకల వస్తువులయందును వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమైన దగుటవలన పంకాదులచే అంటబడనట్లు సకల దేహములయందును గల పరమాత్మ దేహేంద్రియములతో నంటబడదు. (13 : 33). 11) ఆ బ్రహ్మపదమును సూర్యుడు ప్రకాశింపజేయజాలడు, చంద్రుడు ప్రకాశింపజేయజాలడు, అగ్నియు ప్రకాశింపజేయజాలదు, ఏ సూక్ష్మస్థానమును పొంది తిరిగి జన్మకు రారో అదియే నాయొక్క పరమపదము. (15 : 6). 12) ఏ పరమాత్మను ఇంద్రియములకు గోచరము కానివాడనియు, నాశరహితుడనియు చెప్పుచున్నారో ఆ పరమాత్మనే ఉత్తమమైన ప్రాప్యస్థానమనియును చెప్పుదురు. దేనిని పొందినచో తిరిగి జన్మించరో అదియే భగవంతుడ నగు నా యొక్క సర్వోత్తమ మయిన స్థానము. (8 : 21). 13) అభిమానము లేనివారును; దారా, పుత్ర, బంధు, మిత్ర, ధనధాన్యాదుల యందలి యాసక్తిని విడచినవారును, సదా భగవధ్యానమును చేయువారును, కోరికల నన్నిటినీ విడిచిన వారును, సుఖదుఃఖ కారణములగు శీతోష్ణాది ద్వన్ద్వములచేత విడువబడిన వారునైన అజ్ఞానరహితులు (జ్ఞానులు) నాశములేని ఈ మోక్షపదవిని పొందుచున్నారు. (15 : 5). 14) వేదములలో చెప్పబడినట్టి చేయదగిన, చేయదగని వాక్యములను అనాదరణ చేసి, విడిచిపెట్టి, స్వేచ్చాప్రకార మెవడు నడుచుకొనుచున్నాడో, వానికి పురుషార్థ ప్రాప్తయోగ్య మగు తత్త్వజ్ఞానముగాని, ఇహలోక సౌఖ్యముగాని, స్వర్గముగాని, మోక్షముగాని యేదియును లభింపదు. (16 : 23). 15) భారతశ్రేష్ఠా! ఓ అర్జునా! చరములును, అచరములును, సకలవస్తుసముదాయమును క్షేత్రక్షేత్రజ్ఞుల చేరికవలన పుట్టుచున్నవని తెలిసికొనుము. ప్రకృతిపురుషుల సంబంధము లేక యే వస్తువును కొంచెమైనను పుట్టుటలేదు. (13 : 27). 16) ఇట్టి విశ్వరూపమును ధరించిన నేను మదేకనిష్ఠమైన భక్తిచేతనే యదార్ధముగా తెలిసికొనుటకును, దర్శించుటకును, మోక్షమును పొందుటకును సాధ్యమైనవాడ నగుచున్నాను. (11:54). 17) సకల ప్రాణులకు నంతఃకరుణానురూప మగు శ్రద్ధ గలుగుచున్నది. జీవుడు శ్రద్ధాస్వరూపు డగుచు, నెవ్వడేయే గుణోత్కర్షముతో నున్నాడో, ఆయా గుణానుగుణమగు శ్రద్ధ కలవాడగుచున్నాడు. (17 : 3). 18) గురూపదిష్ట వేదాంత వాక్యార్థములయందు నమ్మకము గలవాడును, గురూపదిష్ట వేదాంతవాక్యార్ధమును తెలిసికొని యనుష్ఠించుటయం దాసక్తి గలవాడును, జయింపబడిన యింద్రియములు గలవాడు నయిన పురుషుడు బ్రహ్మజ్ఞానమును పొందుచున్నాడు. అట్టి జ్ఞానమును పొందిన పిమ్మట సర్వోత్తమమైన శాంతిని పొందుచున్నాడు. (4 : 39). సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! (To be continued.)
(Continued). Summary of Sreemadbhagavadgeetha 2 : Selected verses by Bhagavan Sree Ramana Maharshi. 10) As the all-pervading ether is not tainted, because of its subtlety so too the Self, seated everywhere in the body, is not tainted. (13:33). 11) Nor does the sun shine there, nor the moon, nor fire; to which having gone they return not; that is My Supreme Abode. (15:6). 12) That which is called the Unmanifest and the Imperishable, that, they say is the Higher Goal. Those who reach It never ever return. That is My highest abode.(8:21). 13) Free from pride and delusion, victorious over the evil of attachment, dwelling constantly in the Self, their desires having completely retired, freed from the pairs of opposites such as pleasure and pain, the undeluded reach that Goal Eternal. (15:5). 14) He who, having cast aside the ordinance of the scriptures, acts under the impulse of desire, attain neither perfection nor happiness, nor the Supreme Goal. (16:23). 15) Wherever any being is born, the unmoving or the moving, know You, the best of Bharataws, that, it is from the union between the " Field" and the " Knower -of- the- Field". (13:27). 16) But, by single-minded devotion, can I, of this Form, be 'known' and 'seen' in reality, and also 'enter' into, O scorcher of your foes)! (11:54). 17) The faith of each is in accordance with his nature., O Bharata. Man consists of his faith; as a man's faith is, so is he. (17:3). 18) The man who is full of faith, who is devoted to It, and who has subdued the senses, obtains this 'Knowledge'; and having obtained 'Knowledge' he goes to the Supreme Peace.(4:39). (to be continued).

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)