పుస్తకజ్ఞానము - అనుభవజ్ఞానము 2.
శ్రీసాయినాథాయనమః ! శ్రీరామకృష్ణ యతీంద్రాయనమః ! (Continued from previous post).పండిట్ శశిధర్ శ్రీరామకృష్ణుల కాలంలో పేరొందిన విద్వాంసుడు, విద్యావేత్త,గొప్ప వక్త. ఇతిహాస పురాణాల బాగుగ నెరిగినవాడు. శశిధర్ శ్రీరామకృష్ణ పరమహంస పేరుప్రఖ్యాతులు నెరిగి ఓ రోజు వారిని దర్శింప దక్షిణేశ్వర్ వచ్చాడు. వాని రాకనెరిగిన పరమహంస తమను నిరక్షరాస్యునిగ తలచి పండితునితో సరిగా మాట్లాడగలనొలేదొయని శంకిచి సాయంకోసం విద్యావంతులైన కొందరి శిష్యుల చెంత నుంచుకొన్నారు.కాని పండితుని చూసిన పిమ్మట రామకృష్ణులవారి భావం చిత్రంగా మారిపోయింది, బెరుకు సంకోచాలు మాయమయ్యాయి.ఆతని మందహాసంతో ఆహ్వానించి, మీరు పండితులుగదా ఏదైనా చెప్పండంటూ ఓ విధమైన పారవస్యస్థితిలోకి వెళ్లారు. అపుడాతడిట్లన్నాడు, " అయ్యా! నా మనసంతా పొడిబారిన మెట్టవేదాంతంతో నిండిపోయినది. మీనుండి ఓ లేశ భక్తిభావానుభవము నాశించి మీ చెంతకొచ్చాను. అమృతతుల్య తమ సందేశంకోసం ఎదురుచూస్తున్నాను, దయచేసి నాకో మార్గం చూపండి." అందులకు ఉద్రేక భావంతో శ్రీరామకృష్ణులిలా బదులిచ్చారు " నేనేమి చెప్పగలను, పరబ్రహ్మతత్వాన్నెవరు వివరించగలరు? ఆరంభంలో అర్ధనారీశ్వరంలా ...