Posts

Showing posts from August, 2024

Pictorial stories of Shirdi Saibaba.

Image
Wishing all the readers a very Happy and Blessed Janmashtami! Reading my stories brings peace, prosperity,success and joy to the readers. Sri Saibaba. Shirdi Saibaba was a saint who lived between 1838 and 1918. He was a Godly person helping the people all the time. He lived in an old masjid, named it Dwarakamayi. He used to grind wheat daily. In fact he was grinding the sins, people believed. Saibaba used to go to five houses daily for begging food,this was much benefitting the house holders. He shared the food with other people and animals like dogs and cats. He never objected them eating. Saibaba liked lighting the lamps. For that he was getting oil from the village merchants.Once the merchants collectively refused to give oil. With out perturbed, he went to the masjid and to the surprise of all, lighted the lamps with water. The lamps brightly lighted the entire night. The merchants realised their folly and fell at Baba's feet for pardon. Saibaba was very kind a...

అందమైన బాబాబడి 2.

Image
శ్రీసాయినాథాయనమః! (Continued from the previous post). గతవ్యాసంలో సాయిబాబా బడిలో ప్రవేశించినవిధం,ఆపై బావిలో తల్లకిందులుగా వ్రేలాడి అనిర్వచనీయఆనందం పొందిన రీతిని చూసాము. ఆపై జరిగిన వివరాలనిచట గ్రహించెదము. సాయి అనుభూతి విన్న గురువు ప్రసన్నుడై వీపుతట్టి తల్లిపక్షి పిల్లపక్షిని కాపాడినవిధంగా మిగుల ప్రేమించారట. ఆ ప్రేమమయ వాతావరణంలో సాయి తమ తల్లిదండ్రుల మరచి స్వాభిమానం సయితం కోల్పోయి బాహ్యప్రపంచానుభవాలనుండి ముక్తులయ్యారట. సాయి ఇంద్రియముల శక్తియంతయు వారి కన్నులలో కేంద్రీకరించి, ఆశక్తివంత నేత్రాలతో తదేకంగా గురుని వీక్షించేవారట. గురువియోగం క్షణమాత్రం భరింపలేని విరహవేదన యనుభవించారట. గురువే సాయి ధ్యానమూర్తి. అధ్యానస్థితిలో వారి మనోబుద్ధులు మూగబోయినవట. వారిగురువులు ఇతర స్వరూప సాక్షాత్కారరహిత గురువులకు భిన్నము. ఆ పవిత్ర గురుసన్నిధిలో ఎలాంటి శ్రమలేకయే ఆత్మజ్ఞానం సాయిలో ప్రకాశించినది. కాని సాయితో బయలుదేరిన మిత్రులు తమతమ పరిమిత జ్ఞానపంజరంలో బందీలై గమ్యాన్ని చేరలేకపోయారు, వారికర్మఫలమలాంటిది.ఇంతటి ఆత్మసాక్షాత్కారానుభవం పొందటానికి సాయి చెల్లించిన గురుదక్షిణేమిటంటే రెండు పైసలేనట! అవి మాములు పైసలు కావు...