దొంగల పసికట్టు , శాంతికదె తొలిమెట్టు !
శ్రీసాయినాథాయనమః , ఈనాడు శ్రీభరద్వాజమాస్టారు సద్గురుసాయిసమాధిమందిరమున ఆత్మానుభవము పొందిన సుదినము. పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారి సమాధిమందిరము,ఒంగోలు . " నా కథలు బోధలు విన్నభక్తులకు భక్తివిశ్వాసములు కుదురును . వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు , " శ్రీసాయిబాబ. బాబా తమభక్తులకిచ్చెడి బోధామృతము బహువిధములు . తమజీవన విధానముద్వార, ప్రసంగములద్వార, ప్రకటిత లీలద్వార, స్వప్నసందేశములద్వార, చిన్నచిన్న కథలద్వార భక్తులకు సందేశమందించేవారు.బాబా 16-1-1912 న చెప్పిన ఓ కథ : " ఒకప్పుడు నావద్దనున్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది వచ్చారు . నేను వారినేమీ అనక ధనాన్ని తీసుకు పోనిచ్చాను . కాని వారి పేర్లను మాత్రం గురుంచుకున్నాను . తర్వాత ఒకచోట దొంగలంతా భోజనాలకు కూర్చోగానే వారందర్ని కనిపెట్టి రహస్యంగా వెంబడించి వారందరిని హతమార్చి నా ధనాన్ని తిరిగి తెచ్చుకున్నాను . " వివరణ : వివేక వైరాగ్యాలు , ధ్యానములే ధనం. రజస్తమో గుణాలవలన హృదయంలో దాగిన పూర్వపు మలిన సంస్కారాలే దొంగలు . అవి మనసును చంచల పరచడమే ధనాన్ని అపహరించడం. అప్పటికప్పుడే మనసును నిగ్రహించుకుని ఆ సంస్కారాలను...