దొంగల పసికట్టు , శాంతికదె తొలిమెట్టు !

శ్రీసాయినాథాయనమః , ఈనాడు శ్రీభరద్వాజమాస్టారు సద్గురుసాయిసమాధిమందిరమున ఆత్మానుభవము పొందిన సుదినము.
పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారి సమాధిమందిరము,ఒంగోలు .
" నా కథలు బోధలు విన్నభక్తులకు భక్తివిశ్వాసములు కుదురును . వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు , " శ్రీసాయిబాబ. బాబా తమభక్తులకిచ్చెడి బోధామృతము బహువిధములు . తమజీవన విధానముద్వార, ప్రసంగములద్వార, ప్రకటిత లీలద్వార, స్వప్నసందేశములద్వార, చిన్నచిన్న కథలద్వార భక్తులకు సందేశమందించేవారు.బాబా 16-1-1912 న చెప్పిన ఓ కథ : " ఒకప్పుడు నావద్దనున్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది వచ్చారు . నేను వారినేమీ అనక ధనాన్ని తీసుకు పోనిచ్చాను . కాని వారి పేర్లను మాత్రం గురుంచుకున్నాను . తర్వాత ఒకచోట దొంగలంతా భోజనాలకు కూర్చోగానే వారందర్ని కనిపెట్టి రహస్యంగా వెంబడించి వారందరిని హతమార్చి నా ధనాన్ని తిరిగి తెచ్చుకున్నాను . " వివరణ : వివేక వైరాగ్యాలు , ధ్యానములే ధనం. రజస్తమో గుణాలవలన హృదయంలో దాగిన పూర్వపు మలిన సంస్కారాలే దొంగలు . అవి మనసును చంచల పరచడమే ధనాన్ని అపహరించడం. అప్పటికప్పుడే మనసును నిగ్రహించుకుని ఆ సంస్కారాలను ప్రక్కకు తోసివేయడం ఆ దొంగలతో పోరాడి తన ధనాన్ని కాపాడుకోవడం . అలా చేస్తే తాత్కాలికంగా తన ధనాన్ని రక్షించుకోగలమేమోగాని దొంగలు మాత్రం తప్పించుకుపోయి, పొంచియుండి మరలా ఎప్పుడో దాడిచేసి మనలను చంపి ధనాన్నపహరించే యత్నంలోనే వుంటారు . కనుక సాయి మనసులో మెదిలిన సంస్కారాలను ఆటంక పరచక అవేమిటో నిశితంగా గుర్తించి తాత్కాలికంగా వూరుకున్నారు . తర్వాత ఒక్కొక్క దానిని గురించి తీవ్రమైన వివేకంతో అలోచించి దానిని నశింపజేశారు . తిరిగి ఆయన ధ్యానధనం ఆయనకు లభించడమే గాక ఆ వాసనలు శాశ్వతంగా రూపుమాసి పోయాయని భావం. విషయసేకరణ : శ్రీసాయినాథప్రబోధామృతము, పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.