Posts

Showing posts from January, 2026

శ్రీసాయిసందేశామృతము 7 (Nectar of Sri Sai's Message 7).

Image
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము 7. సర్వజనోద్ధరణము,సర్వమానవసామరస్యము,సర్వమత ఐకమత్యము శ్రీషిర్డీసాయిబాబా అవతారముఖ్యోద్దేశములుగా తలంపవచ్చును . హిందూమత పండుగలను, ముస్లింమత పర్వదినాలను సమభావంతో జరిపించెడివారు . ఇరుమతముల సాంప్రదాయములను అంతేశ్రద్ధతో పాటించెడివారు . వారివేషభాషలు , ఆహారవిహారాలు అందరికీ ఆమోదయోగ్యములు . జాతిమతాతలకతీతంగా సర్వహృదయవాసిగా వెలుగొందేసాయి విశ్వచైతన్య స్వరూపులు. జనులందరి అంతరంగ ఆశలు , ఆశయాలు , అవసరాలు వారికెరుకే ! శిరిడీలోని వివిధదేవాలయాలను భక్తులచే బాగుచేయించెడివారు . భక్తులనుండి పొందిన దక్షిణను ఏరోజు కారోజు పంచిపెట్టెడివారు . సాయిసన్నిధి కేవలం దేవాలయమేకాదు , శారీరక మానసిక రుగ్మతలను దూరంజేసే వైద్యాలయంకూడ! కుష్టు, కుంటి , గుడ్దిరోగులు సాయి అశీసులతో స్వస్థత పొందేవారు . సద్గురుసాయినాథులు యోగక్రియలందు మిగుల నిష్ణాతులు. తమ నిత్యజీవన విధానం ద్వారా కర్మ, భక్తి ,జ్ఞానయోగములను భక్తులకు బోధించడమేగాక, అష్టాంగరాజయోగమెరిగిన ర...

శ్రీసాయిసందేశామృతము 6 (Nectar of Sri Sai's Message 6).

Image
శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.May Baba bless all the readers on this Happy New Year 2026 day. శ్రీసాయిసందేశామృతము 6. ఈ అధ్యాయ ఆరంభమున రచయిత గురుకరస్పర్శ ప్రభావమునుగూర్చి విశేషముగా విశ్లేషించాడు. సద్గురువు పరమానంద ఆత్మస్వరూపుడు,ఆపాదమస్తకం దైవశక్తితో నిండియుంటాడు. సద్గురు హస్తస్పర్శ తగలగానే శిష్యుని భౌతికదేహమేగాక, ప్రళయాగ్నిచేకూడ కాలానట్టి వాసనభరిత సూక్ష్మ శరీరము సైతం కాలి భస్మమైపోతుంది.శ్రీరామకృష్ణ పరమహంస పాదస్పర్శచే నరేంద్రుని (స్వామి వివేకానంద) జీవితంలో అద్భుతమైన మార్పురావడం ఇచట స్మరణీయము. సద్గురుని శక్తిపాత ప్రభావముచే శిష్యుని అప్పటివరకు కప్పియుంచిన అహంకారపొర ఛిద్రమై అంతరంగజాగరణ జరుగుతుంది. నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది. ఇది ఎంతోమంది భక్తుల యనుభవసత్యము. భక్తాగ్రగణ్యులు, పూజ్యులు యగు శ్రీ బి.వి.నరసింహస్వామి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, ప్రస్తుత విశ్వ సాయితత్వ ప్రచారకులు శ్రీ చంద్రభాను శతపతి మున్నగువారల యనుభవము ఇదేవిషయాన్ని ధృవీకరించుచున్నది. సర్వస...