శ్రీసాయిసందేశామృతము 6 (Nectar of Sri Sai's Message 6).

శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.May Baba bless all the readers on this Happy New Year 2026 day.
శ్రీసాయిసందేశామృతము 6. ఈ అధ్యాయ ఆరంభమున రచయిత గురుకరస్పర్శ ప్రభావమునుగూర్చి విశేషముగా విశ్లేషించాడు. సద్గురువు పరమానంద ఆత్మస్వరూపుడు,ఆపాదమస్తకం దైవశక్తితో నిండియుంటాడు. సద్గురు హస్తస్పర్శ తగలగానే శిష్యుని భౌతికదేహమేగాక, ప్రళయాగ్నిచేకూడ కాలానట్టి వాసనభరిత సూక్ష్మ శరీరము సైతం కాలి భస్మమైపోతుంది.శ్రీరామకృష్ణ పరమహంస పాదస్పర్శచే నరేంద్రుని (స్వామి వివేకానంద) జీవితంలో అద్భుతమైన మార్పురావడం ఇచట స్మరణీయము. సద్గురుని శక్తిపాత ప్రభావముచే శిష్యుని అప్పటివరకు కప్పియుంచిన అహంకారపొర ఛిద్రమై అంతరంగజాగరణ జరుగుతుంది. నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది. ఇది ఎంతోమంది భక్తుల యనుభవసత్యము. భక్తాగ్రగణ్యులు, పూజ్యులు యగు శ్రీ బి.వి.నరసింహస్వామి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, ప్రస్తుత విశ్వ సాయితత్వ ప్రచారకులు శ్రీ చంద్రభాను శతపతి మున్నగువారల యనుభవము ఇదేవిషయాన్ని ధృవీకరించుచున్నది. సర్వస్య శరణాగతిచే వ్యక్తిహృదయంలో అహం తొలగి శూన్యమేర్పడినప్పుడు, ఆ స్థానాన్ని గురువు ఆక్రమిస్తాడు. ఆ క్షణంలో వ్యక్తికీ సర్వం సాయిమయం, దైవమయం అవుతుంది. ఈవిషయం నిజమన్నట్లు రచయిత వేదపురాణములు చదువునప్పుడు, సాయి వానికి శ్రీరామునిగా,శ్రీకృష్ణునిగా ఎదుటనిలబడి తమ లీలల వివరించునటుల యనుభవమయ్యేదట. ద్వారకామాయిలో తానెప్పుడూ అసత్యమాడనని సాయి తమభక్తులకు తరచు చెబుతుండెడివారు. భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా తనను సేవించే భక్తుని గృహంలో అన్నవస్త్రాలకు లోటుండదు, వాని యోగక్షేమాల తామే చూస్తామనన్నారు. ఇదే విషయాన్ని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునినికి బోధించాడు. (9:22). అన్యవిషయముల చింతన మరచి సమస్తఇంద్రియములను,మనసును ఇష్టదైవంపై నిలుపుటయే శిష్యుని కర్తవ్యంగా బాబా చెప్పారు. అలాంటి శిష్యునికే చిత్తశాంతి లభిస్తుందని తన మాటగా చెప్పారు సాయి.ఓ సుందర చిత్రాన్ని తెర ( కాన్వాస్ ) పై చిత్రించుటకు కళాకారుడు మొదట ఏమి అర్ధంకాని గీతలతోగాని , బిందువులతోగాని ఆరంభిస్తాడు . చూపరులకు అతడేచిత్రాన్ని గీస్తున్నాడో తెలియదు . కాని ఆగీతలను,బిందువులను కలుపుతు చిత్రకారుడు ఓ అద్భుత చిత్రాన్ని రచిస్తాడు. అలాగే బాబా సంకల్పాలు, చేసెడి పనులు ఆరంభంలో ఎవరికీ తెలియవు . కాని ఆపై కొంతకాలానికి ఆ సంఘటనలన్నీ సమగ్రంగా ఓ మహత్కార్యానికి ఇటుకలు లేక మైలురాళ్లుగా మారతాయి . ఇచట వివరింపబడిన విషయం, హిందూ ముస్లింల మతసామరస్యానికి బాబాసంకల్పం వేరువేరు కాలాల్లో ఏవిధంగా పనిచేసిందో తెలియడానికి చక్కని ఉపమానంగా పనిచేస్తుంది . శ్రీసాయిబాబా సంకల్పాలు మిగుల అగోచరములు మరియు అనూహ్యములు . సర్వమానవ సామరస్యత, హిందూముస్లిముల ఐక్యత బాబా ముఖ్య ఆశయాలుగా తలచవచ్చును . కర్మల కుశలత్వమే యోగమని గీతలో చెప్పబడినట్లుగా బాబా పనులుండేవి . బాబా సంకల్పించిన మత సమైక్యతకు 1897వ సంవత్సరంలో పునాదిపడినది . ఆ సంవత్సరము శ్రీరామనవమినాడు శిరిడీలో గోపాలరావు గుండు ద్వారా ఉరుసు కార్యక్రమము ప్రారంభమైనది . 1902న అదేరోజున అమీరుశక్కర్ దలాల్ ద్వారా చందనోత్సవం జతగూడినది . 1912 నుండి శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి . జోగేశ్వర్ భీమ, కాకామహాజని ఆవేడుకల ముఖ్యనిర్వహులు.హిందూ ముస్లింలు తరతమ భేదములు మరచి పండుగల నెంతో ఘనంగా జరిపేవారు . ఆ సాంప్రదాయమిప్పటికీ దినదిన ప్రవర్ధమానమవడం అందరికీ తెలిసిన విషయమే ! భారతదేశ స్వతంత్రోద్యమానికి వారిసమైక్యపోరాటమెంతో బలం చేకూర్చింది . చిత్రంవెనుక కనబడని తెరలాంటి అగోచర సూత్రధారి బాబా ! వేరువేరు భక్తులకు వివిధ ప్రేరణలకర్త శ్రీసాయి . రచయితకు పవిత్రగ్రంధ రచనాభాగ్యము లభించింది.కొన్నిసందర్భాలలో బాబాజూపెడి కోపం భక్తులను ఆశీర్వదించుటకే ! మజీదు మరమ్మత్తువేళ మిగులకోపంతో తాత్యా పీక పట్టుకున్నారు కాని, మరుక్షణంలో శాంతించి వానిని జరీతలపాగాతో సత్కరించారు . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
(To those men who worship Me alone,thinking of no other, to those ever self-controlled, I secure for them that which is not alreadu posssessed by them, and prerve for them what they already possess. The Holy Geeta 9:22. Even those devotees, who endowed with faith worship other Gods, worship Me alone, O son of Kunti, but by the wrong methods. 9:23.) ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారై, పరమదైవమగు పరమాత్మనగునన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో , అట్లు సర్వకాలములయందు సమాహితచిత్తులైన వారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను . గీత 9:22, ఏజనులు ఇతర దేవతలందాసక్తి గలవారగుచు , ఆస్తిక్య బుద్ధితో గూడుకొనినవారై ఆ యితర దేవతలనే, పూజించుచున్నారో , అట్టిజనులు మోక్షమును కలిగించునట్టి రీతిని తెలియక నన్నే సేవించుచున్నారు . గీత : 9:23)
Nectar of Sri Sai's message 6: Sai Baba awakens inner light in devotees, guiding them toward a life enriched by faith and surrender. Chapter 6 of Śrī Sai Sandeshamṛtam highlights the transforming power of the Guru’s touch. The Sadguru radiates divine bliss, and when His sacred hand touches a disciple, both body and mind awaken; even deep-rooted karmic impressions are burned away. Like the awakening of Vivekananda through Ramakrishna’s touch, this spiritual descent (śaktipāta) shatters ego and kindles hidden divine power — a truth affirmed by many saints. When devotees surrender fully, the ego dissolves and the Guru dwells within. The author describes moments when Sai appeared as Rama or Krishna, speaking directly through the scriptures. Baba assured devotees that He never spoke untruth and promised that sincere households devoted to Him would never lack essentials — echoing the Gita’s assurance (9:22). True peace, He taught, comes from fixing the mind steadily on one’s chosen deity.
Baba’s ways often seemed mysterious, like a painter’s first random lines, yet each event later revealed itself as part of a divine plan. A major mission of Baba was fostering Hindu–Muslim harmony. Festivals such as Urus and Sri Rama Navami grew together in Shirdi, uniting communities and strengthening social harmony — all under Baba’s unseen guidance. Even when Baba appeared stern, His actions were rooted in compassion, as seen when He scolded Tatya yet soon honored him lovingly. Baba’s life shows that skill in action is true Yoga, and His grace continues to inspire unity, devotion, and trust in divine providence. May the rays of Sai’s compassion shine upon all! May all be blessed! Om Sai, Śrī Sai, Jai Jai Sai!
Bhajan format: Om Sai, Śrī Sai Refrain (Chorus): Om Sai… Śrī Sai… Jai Jai Sai… Light of our hearts, be ever near, Om Sai… Śrī Sai… Jai Jai Sai… 1️⃣ Guru’s touch is grace divine, Melting ego, clearing the mind, Hidden fire begins to rise, Love awakens… tears in the eyes. Refrain 2️⃣ When we surrender all to You, Empty hearts become new, In that silence, deep and mild, Sai resides — tender and child. Refrain 3️⃣ Reading scriptures, hearts grow still, Sai reveals His loving will, Rama speaks… and Krishna smiles, Walking with us through life’s trials. Refrain 4️⃣ “You’ll not want,” Baba said, “I will guard your daily bread.” As the Gita gently sings, God provides all needed things. Refrain 5️⃣ Like a painter’s unseen hand, Sai prepares a wondrous plan, Step by step the picture grows, Grace is working — no one knows. Refrain 6️⃣ Hindu, Muslim — hearts unite, Baba shines a single light, Peace and love in every door, Sai’s compassion flows evermore. Refrain 7️⃣ Even when His tone seemed strong, Love was guiding all along, Scolding turns to gentle smile, Blessings hidden all the while. Final Refrain (soft): Om Sai… Śrī Sai… Jai Jai Sai… Lead us, Lord, in truth and love, Om Sai… Śrī Sai… Jai Jai Sai…

Comments

  1. This message of Sadhguru Saibaba to all His devotees is similar to the message of Lord Sri Krishna to His warrior disciple Arjuna.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)