శ్రీసాయిసందేశామృతము 7 (Nectar of Sri Sai's Message 7).

శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము 7. సర్వజనోద్ధరణము,సర్వమానవసామరస్యము,సర్వమత ఐకమత్యము శ్రీషిర్డీసాయిబాబా అవతారముఖ్యోద్దేశములుగా తలంపవచ్చును . హిందూమత పండుగలను, ముస్లింమత పర్వదినాలను సమభావంతో జరిపించెడివారు . ఇరుమతముల సాంప్రదాయములను అంతేశ్రద్ధతో పాటించెడివారు . వారివేషభాషలు , ఆహారవిహారాలు అందరికీ ఆమోదయోగ్యములు . జాతిమతాతలకతీతంగా సర్వహృదయవాసిగా వెలుగొందేసాయి విశ్వచైతన్య స్వరూపులు. జనులందరి అంతరంగ ఆశలు , ఆశయాలు , అవసరాలు వారికెరుకే ! శిరిడీలోని వివిధదేవాలయాలను భక్తులచే బాగుచేయించెడివారు . భక్తులనుండి పొందిన దక్షిణను ఏరోజు కారోజు పంచిపెట్టెడివారు . సాయిసన్నిధి కేవలం దేవాలయమేకాదు , శారీరక మానసిక రుగ్మతలను దూరంజేసే వైద్యాలయంకూడ! కుష్టు, కుంటి , గుడ్దిరోగులు సాయి అశీసులతో స్వస్థత పొందేవారు . సద్గురుసాయినాథులు యోగక్రియలందు మిగుల నిష్ణాతులు. తమ నిత్యజీవన విధానం ద్వారా కర్మ, భక్తి ,జ్ఞానయోగములను భక్తులకు బోధించడమేగాక, అష్టాంగరాజయోగమెరిగిన రాజాధిరాజ యోగిరాజులు శ్రీసాయినాథులు. ధౌతి , ఖండయోగములెరిగిన మహామహిమాన్వితులు శ్రీసాయి . పరోపకారమే సాయిధర్మసూత్రము . రోగులనుండి ఎలాంటి ధనమాశింపక వైద్యంజేసేవారు . పరులబాధలనేగాక , వ్యాధుల సయితం అనుభవించే కారుణామయుడు సాయిబాబా . వారికారుణ్యానికి తీర,దూరాలు లేవు . మండేధునిలో తమచేతిని కాల్చుకొని ఎక్కడోనున్న రగిలేకొలిమినపడ్డ పసిబిడ్డను రక్షించారు . అల్లాహ్ తో ఐక్యమైన బాబాకు దేహభ్రాంతి,బాధలుంటాయా ? ఎలాంటి మందులు , లేపనములు అంగీకరింపక, కేవలం కుష్టువ్యాధి పీడితుడు భాగోజీషిందేననుగ్రహించుటకొరకే వానిచేత రోజూ నేతికట్టుకంగీకరించారు. తల్లిప్రేమ పరిమితం , కేవలం తనబిడ్డలకు మాత్రమే , కాని సద్గురువు ప్రేమ విశ్వానికంతటికి. సాగరంలో ఏమూల చిన్నతుఫాను సంభవించినా సంద్రానికెరుకే , అటులనే సృష్టిలో ఏప్రాణి బాధపడినా,గాయపడినా సద్గురుని హృదయం తల్లడిల్లుతోంది . ఖాపర్డేబిడ్డ ప్లేగువ్యాధిని తమదేహంపై ధరించి వాని రోగముక్తునిజేశారు సాయి . బాగుపడ్డ ఆబిడ్డతల్లినుండి ఆశించినది కేవలము ఆమె ప్రేమనుమాత్రమే ! అంతకుమినహా ఆమె ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? నిత్యం స్మరించే భక్తుల ఆలోచనలు సాయికి తెరచిన పుస్తకాలు. భక్తహృదయవాసిని నోరువిప్పి అడుగవలెనా ? పుణ్యక్షేత్రం పండరీపురానికి బదిలీయైన భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ సాయిని దర్శించి వారిని తనతోపాటు పండరికి ఆహ్వానింపదలచాడు . ఆవిషయం ముందే గ్రహించిన సాయి, నానాచేరే సమయాన తోటిభక్తులతో తాము పండరి వెళ్లి భజనజేద్దామనే భావం వ్యక్తపరిచే పాట పాడారు . సాయిసర్వజ్ఞతకు మిగుల ఆశ్చర్యపడ్డాడు చాందోర్కర్. సాయిని విశ్వసించిన భక్తుల హృదయవాసి శ్రీసాయినాథులు . తనభక్తుని సదానీడలా వెన్నంటినడుస్తారు సాయి . మన పనులు , ఆలోచనలు బాబాకు తెలియును అనే ఎరుకను సదా కలిగియుంటే తప్పుడు పనులను , ఆలోచనలను ఎలా చేయగలము ? భక్తుడు తప్పుజేస్తే హృదయవాసి సద్గురుని ఆత్మ తల్లడిల్లుతుంటుందని పూజ్యులు సాయిమాస్టర్ శ్రీ ఎక్కిరాల భరద్వాజ తమ శ్రీసాయినాథప్రబోధామృతమను గ్రంధంలో వ్రాసారు . భక్తులకిది సందేశమేగాక హెచ్చరికగను తలంపవచ్చును . శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయిశ్రీసాయి జైజైసాయి !
" The Lord dwells in the hearts of all beings, O Arjuna, causing all being, by His illusive power, to revolve, as if mounted on a machine". The Holy Geeta: 18:61. ఓ అర్జునా ! మానవులను కీలుబొమ్మలవలె , సర్వాంతర్యామియగు పరమేశ్వరుడు సకల ప్రాణులయొక్క హృదయములందుండి మాయచేత సకలభూతములను వారి వారి జన్మాంతరకర్మ సంస్కారము ననుసరించి త్రిప్పుచు , ఆయా కర్మములందు ప్రవర్తింపజేయుచున్నాడు " . గీత: 18:61
🌺 Devotional English Translation Śrī Sāyināthāya Namah. Sai Baba fills the hearts of His devotees with rays of auspicious wisdom and divine compassion, awakening them into inner light. Let us sanctify our lives by walking in the fragrance of His sacred teachings. Sri Sai Sandeshamrutam – 7 Universal upliftment, harmony among all beings, and unity among all faiths—these may be regarded as the central purposes of the divine incarnation of Sri Shirdi Sai Baba. He celebrated Hindu festivals and Muslim holy days with the same equal-visioned reverence. He honored the traditions of both faiths with unwavering sincerity. His dress, language, food, and way of life were accepted by all—because He belonged to all. Beyond caste, creed, and religion, Sai shone as the indweller of all hearts, the very embodiment of universal consciousness. Everyone’s innermost wishes, aspirations, and needs were known to Him without being spoken. Through the devotees, He ensured that all temples in Shirdi were repaired and cared for. The dakshina He received was distributed daily—He kept nothing for Himself. Sai’s presence was not merely a temple; it was a hospital of grace, where physical and mental afflictions were healed. The lame, the blind, and even those afflicted with leprosy were cured by His blessings. Sai, the Sadguru, was a master of yoga. By His daily conduct, He taught His devotees the essence of Karma Yoga, Bhakti Yoga, and Jnana Yoga. He was the Yogeshwara—the King of Yogis—well-versed even in advanced practices like Dhauti and Khanda Yoga. Service to others was the dharma-sūtra of Sai. He healed the sick without expecting even a grain of payment. He not only removed others’ suffering but often experienced their pain within Himself, out of boundless compassion. His mercy had no limits. When a child fell into a burning ember-pit far away, Sai burnt His own arm to save the little one. One who is united with Allah—could He ever have bodily delusion or fear of suffering? Refusing medicines or bandages, He permitted the leper Bhagoji Shinde alone to dress His wound daily—only to bless him. A mother’s love is confined to her children, but the love of a Sadguru extends to the entire universe. Just as the ocean senses even a tiny ripple anywhere within its vastness, so too does the heart of the Sadguru tremble when any creature suffers. Sai bore the plague of Khaparde’s child in His own body and cured the boy. From the grateful mother He sought nothing but love—what else could she offer to repay such divine grace? The constant thoughts of devotees are open books to Sai, who dwells in their hearts. Should one even speak aloud his needs to the Lord within? When Nana Saheb Chandorkar was transferred to Pandharpur, he wished to invite Sai. Sai, already knowing his unspoken desire, burst into a song saying He wished to go to Pandharpur with the devotees for bhajan. Nana stood amazed at Sai’s omniscience. Sai walks behind every devotee like a steady shadow—never leaving their side. If we maintain constant awareness that all our actions and thoughts are known to Him, how could we ever do anything wrong? Sri Ekirāla Bharadwaja Master writes in Sri Sainath Prabodhamrutam that whenever a devotee commits a wrong deed, the heart of the indwelling Guru feels the tremor of pain. This is not just a message—it is a warning filled with love. May the rays of Sai’s compassion fall upon everyone! May auspiciousness surround all! Om Sai, Sri Sai, Jai Jai Sai! Bhagavad Gita 18:61 “The Lord dwells in the hearts of all beings, O Arjuna, causing all beings, by His divine illusive power, to revolve as if mounted on a machine.” The Supreme Indweller, residing in the hearts of all creatures, makes them move according to the impressions of their past actions— turning them like puppets on the wheel of life.
Śrī Sāyināthāya Namah. The summary of the above article follows. Sri Shirdi Sai Baba came for the upliftment of all beings, nurturing harmony among faiths and unity among hearts. He revered Hindu and Muslim traditions equally, lived a simple life accepted by everyone, and shone as the indweller of all souls. Sai knew His devotees’ needs without their asking. He ensured Shirdi’s temples were cared for, distributed all dakshina received, and turned His dwelling into a hospital of grace where illnesses of body and mind were healed. The blind, lame, and even lepers received relief through His compassion. A master of yoga, Sai taught Karma, Bhakti, and Jnana through His daily life. Service was His dharma; He bore others’ suffering as His own. He protected a distant child from fire at the cost of His own arm, allowed Bhagoji Shinde to dress His wound only to bless him, and even took on the plague of Khaparde’s child to save the boy. Like the ocean sensing every ripple, the Sadguru feels the pain of every creature. Sai’s omniscience guided devotees gently—He knew their unspoken thoughts, as when He expressed the desire to go to Pandharpur before Nana Chandorkar invited Him. One who remembers that Sai witnesses every thought, walks with purity and courage. As Sri Bharadwaja writes, when a devotee falters, the Guru’s heart trembles—not in condemnation, but in loving warning. May Sai’s compassion bless all beings. Om Sai, Sri Sai, Jai Jai Sai. — (Reflecting Bhagavad Gita 18:61: the Lord, dwelling in all hearts, directs all beings through divine power, like wheels moved upon a machine.) గీతా సారమిది జీవన గీతాసారమిది కర్మకోరు వారు కర్మలు జేయవచ్చును అది పరులకుజేస్తే కర్మయోగమవుతుంది భక్తి కోరువారు కేవలం మాట్లాడని భగవంతునికొరకేగాక తోటివారిపట్ల పెద్దలపట్ల భక్తి శ్రద్ధలు జూపవలె అది భక్తి యోగం కాగలదు జ్ఞానమంటే ఇష్టపడేవారు కేవలం పుస్తకపఠనంలో మునగక సర్వసృష్టికి మూలం ఆత్మ యనెడి సత్యాన్ని తెలుసుకొంటే అదే జ్ఞానయోగం కాగలదు, ఇదే విషయాన్ని భగవాన్ రమణమహర్షి చెప్పారు యోగమన్నా ఆధ్యాత్మికతయన్నా ఇష్టపడనివారు సొంతలాభం కొంతమాని పరుల శ్రేయస్సుకై పాటుపడాలి ఇది మానవతా యోగం గా తెలుసుకోవాలి. మరోక్కవిషయం ఓ కవిజెప్పినట్లు జీవితరంగం ఓ రంగస్థలిగా తలచి అన్నివయసులలో మనపాత్ర పోషించాలి సినిమాలోలాగ , అందరూ హీరోలుగా వుండరు. ఏవిధంగా కరెంటు తీగలో, కనబడకుండా విద్యుత్తు ప్రవహిస్తుందో అదేవిధంగా జీవులనాధారంగా జేసుకొని జీవితం కొనసాగుతుంది. కరెంటు తీగ పాడైపోయినా కరెంటు సదా ప్రవహిస్తున్నటుల జీవులుతెరమరుగైనా జీవితం కొనసాగుతుందనే విషయం మరువరాదు . ఉన్న జీవితాన్ని సద్వినియోగం జేసుకోవాలిగాని చికాకులు చింతలతో కూడిన మనసుతో పోరాటం జేయరాదు . మనమంతా రిటైర్ అయినామనసు బుద్ధులు రిటైర్ కారాదు . జీవించినంతకాలం నూటికినూరుపాళ్లు వినియోగించుకోవాలి , లేకుంటే ఆరుబయటవదలిన ఇనుపమేకు తుప్పుపట్టినటుల సోమరి మనసు శక్తిని కోల్పోతుంది . తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత !

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)