సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి !
శ్రీసాయినాథాయనమః! సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి! సాయిబాబా తమభక్తులతో మాట్లాడుచూ ' ఈ దేహంలో ఓ హీనజాతి వాడున్నాడు, వాణ్ణి వెడలగొట్టాలి ' యంటూ వుండేవారు. అందరిలోను మంచిచెడులుంటాయిగదా, చెడును గూర్చి అలా చెబుతున్నారేమో యని తలచేవాణ్ణి. ఈమధ్య శ్రీరామకృష్ణ పరమహంస జీవిత గ్రంధాన్ని చదివేటపుడీ సత్యం మరింత బోధపడింది. అదెలాగో పరమహంసలవారి అనుభవాన్ని వారిమాటల్లోనే చూద్దాం. " ఆధ్యాత్మ గ్రంధాలలో వివరింపబడిన సూత్రాలకనుగుణంగా నా ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుండేది. సాధన ఫలితంగా నాలోని పాపపురుషుని దహించినటుల భావించేవాణ్ణి. మనలో నిజంగా ఓ పాపపురుషుడున్నాడనియు, వానిని దహించి నాశనం జేయవచ్చునని అపుడెవరెరుగుదురు. సాధన ప్రారంభంలో నా దేహమంతా మండునటుల తీవ్ర బాధను అనుభవించేవాణ్ణి. ' ఏ రకమైనదీజబ్బు? ' యని తలస్తుండేవాడిని. కొలదికాలంలోనే అది భరింపరాని బాధగా పరిణమించినది. ఎన్నో ఔషధములను, లేపనములను వాడినను యేమాత్రము ఉపశమనము కలుగలేదు. ఆ పిమ్మట ఓరోజు పంచవటిలో కూర్చున్నాను. అనుకోకుండా, ఆశ్చర్యం గొల్పుతూ నా యీదేహంనుండి వెలువడు ఓభయంకర...