సాయి కథలు - కాపాడబోతె కర్రదెబ్బా?

శ్రీసాయినాథాయనమః! 

సాయి కథలు - కాపాడబోతె  కర్రదెబ్బా ?

హంసరాజు మిగుల ఉబ్బస వ్యాధి భరించలేక భార్యతో శిరిడీలో కొంతకాలమున్నాడు. బాబా దయతొ వానికి వ్యాధి నయమైంది, కాని పుల్లపెరుగు యేమాత్రము తినకూడదన్నారు. బాబామాటను లక్ష్యపెట్టక వాడు రోజూ భార్యచె పాలుతోడు పెట్టించేవాడు. ఈవిషయాన్ని బాబాకు తెలియనివ్వలేదు. చిత్రమేమంటే రోజూ భార్యాభర్తలు ఆరతికి వెళ్లివచ్చేటప్పటికి ఒక పిల్లి ఆపెరుగు తాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడవెళ్ళక పొంచియుండి, పిల్లివచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. ఆపిమ్మట యాతడు మజీదుకు వెళ్ళగానే బాబా, " ఇక్కడొక మూర్ఖుడు పుల్లపెరుగుతిని చావాలని చూస్తున్నాడు. కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడీరోజు కర్రతో కొట్టాడు ! " అన్నారు. భక్తుల రక్షించే సాయి కొన్ని సందర్భాలలో వారినుండి తిట్లు దెబ్బలు తినవలసి వచ్చేది.   సాయిసహాయం ఏరూపంలోనైనా మనకు లభింపవచ్చు, మనమే సాయి సర్వవ్యాపి యనే ఎరుకతో వ్యవహరించాలి.
శ్రీసాయిలీలామృతము: పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!  

Comments

  1. ఎంతటి విచిత్రం , తమ భక్తులను రక్షిస్తూనే వారిదెబ్బలు తినేవారట సాయినాథులు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.