సాయి కథలు - ఎంత ప్రాప్తమో, అంతే ఫలితం !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - ఎంత ప్రాప్తమో, అంతే ఫలితం !  

మనకు లభించే ప్రాప్తాప్రాప్తాలకు  మనం చేసిన పుర్వకర్మలు మరియు  పుణ్యపాపాలకు సంబంధం వుంటుందని పెద్దలమాట. తెలిసో తెలియకో చేసిన ప్రతి కర్మ దాని ఫలితాన్ని శాసిస్తుందని దీని అర్ధం. తక్కువ పుణ్యంజేసుకొని ఎక్కువ ఫలాలను ఆశించడం అత్యాశయనియుకూడ దీని భావం. కర్మబలం  కొన్నిసందర్భాలలో  దైవానుగ్రహాన్ని, దైవబలాన్ని సయితం అతిక్రమిస్తుంది. ఈవిషయానికి తగిన ఉదాహరణమును శ్రీసాయిబాబా జీవితచరిత్రలో చూడవచ్చును. ఒకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం యొకడు తనకు నాలుగు వేల రూపాయలుకావాలని సాయిని మిగుల ప్రాధేయపడ్డాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంతచెప్పినా అతడు వినలేదు. తుదకు  మరునాడు మఱ్ఱిచెట్టువద్ద లంకెబిందె దొరుకుతుందని చెప్పగా, అతడు  నమ్మలేదు గాని చెట్టువద్దకెళ్లాడు.  ఆశ్చర్యంగా అచట లంకెబిందొకటి కన్పించింది. ఆబిందెను మోయలేక వేరొకరి సాయంకోసం వెళ్లివచ్చేలోపున అదక్కడలేదు. అతడేడుస్తూవచ్చి బాబాకు చెప్పాడు. దానిని రూయీ  గ్రామస్థుడొకడు తీసుకెళ్లాడన్నారు సాయిబాబ. అందులకే సాయిమనలను,   నిత్యం మంచికర్మల చేయమన్నారు, దైవనామాన్ని ఉచ్ఛరించమన్నారు, సద్గ్రంధాల  చదవమన్నారు !  అలాచేస్తే పుణ్యఫలం అదే ప్రాప్తిస్తుందనేది వారిభావం కాబోలు!
శ్రీసాయిలీలామృతము : పూజ్యఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Comments

  1. పిండికొలదీ రొట్టి, పుణ్యంకొలదీ ప్రాప్తం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.