Posts

సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి !

Image
శ్రీసాయినాథాయనమః! సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి! సాయిబాబా తమభక్తులతో మాట్లాడుచూ ' ఈ దేహంలో ఓ హీనజాతి వాడున్నాడు, వాణ్ణి వెడలగొట్టాలి ' యంటూ వుండేవారు. అందరిలోను మంచిచెడులుంటాయిగదా, చెడును గూర్చి అలా చెబుతున్నారేమో యని తలచేవాణ్ణి. ఈమధ్య శ్రీరామకృష్ణ పరమహంస జీవిత గ్రంధాన్ని చదివేటపుడీ సత్యం మరింత బోధపడింది. అదెలాగో  పరమహంసలవారి అనుభవాన్ని వారిమాటల్లోనే చూద్దాం.  " ఆధ్యాత్మ గ్రంధాలలో వివరింపబడిన సూత్రాలకనుగుణంగా నా ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుండేది. సాధన ఫలితంగా  నాలోని  పాపపురుషుని దహించినటుల భావించేవాణ్ణి. మనలో నిజంగా ఓ పాపపురుషుడున్నాడనియు, వానిని  దహించి నాశనం జేయవచ్చునని అపుడెవరెరుగుదురు.  సాధన ప్రారంభంలో నా దేహమంతా మండునటుల తీవ్ర బాధను అనుభవించేవాణ్ణి. ' ఏ రకమైనదీజబ్బు? ' యని తలస్తుండేవాడిని. కొలదికాలంలోనే అది భరింపరాని  బాధగా పరిణమించినది.  ఎన్నో ఔషధములను, లేపనములను వాడినను యేమాత్రము ఉపశమనము కలుగలేదు. ఆ పిమ్మట ఓరోజు  పంచవటిలో కూర్చున్నాను. అనుకోకుండా, ఆశ్చర్యం గొల్పుతూ  నా యీదేహంనుండి వెలువడు ఓభయంకర...

సాయి కథలు - ఎంత ప్రాప్తమో, అంతే ఫలితం !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఎంత ప్రాప్తమో, అంతే ఫలితం !   మనకు లభించే ప్రాప్తాప్రాప్తాలకు  మనం చేసిన పుర్వకర్మలు మరియు  పుణ్యపాపాలకు సంబంధం వుంటుందని పెద్దలమాట. తెలిసో తెలియకో చేసిన ప్రతి కర్మ దాని ఫలితాన్ని శాసిస్తుందని దీని అర్ధం. తక్కువ పుణ్యంజేసుకొని ఎక్కువ ఫలాలను ఆశించడం అత్యాశయనియుకూడ దీని భావం. కర్మబలం  కొన్నిసందర్భాలలో  దైవానుగ్రహాన్ని, దైవబలాన్ని సయితం అతిక్రమిస్తుంది. ఈవిషయానికి తగిన ఉదాహరణమును శ్రీసాయిబాబా జీవితచరిత్రలో చూడవచ్చును. ఒకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం యొకడు తనకు నాలుగు వేల రూపాయలుకావాలని సాయిని మిగుల ప్రాధేయపడ్డాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంతచెప్పినా అతడు వినలేదు. తుదకు  మరునాడు మఱ్ఱిచెట్టువద్ద లంకెబిందె దొరుకుతుందని చెప్పగా, అతడు  నమ్మలేదు గాని చెట్టువద్దకెళ్లాడు.  ఆశ్చర్యంగా అచట లంకెబిందొకటి కన్పించింది. ఆబిందెను మోయలేక వేరొకరి సాయంకోసం వెళ్లివచ్చేలోపున అదక్కడలేదు. అతడేడుస్తూవచ్చి బాబాకు చెప్పాడు. దానిని రూయీ  గ్రామస్థుడొకడు తీసుకెళ్లాడన్నారు సాయిబాబ. అందులకే సాయిమనలను,   నిత్యం...

సాయి కథలు - దుష్కర్మల ఫ(బ) లం తగ్గించడమెలా?

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు -  దుష్కర్మల  ఫ(బ) లం తగ్గించడమెలా? శ్రీసాయిబాబాను కర్మధ్వంసిగా నామావళిలో స్థుతిస్తాము. వ్యక్తులు  తాము చేసిన దుష్కర్మల ఫలం, బలం అనుభవింపక తప్పదు.  ఇందులకు సాయిబాబా చక్కని విరుగుడు చెప్పారు. అనన్యంగా శరణు కోరినవారి కష్టముల దీర్చెదననియు, వారిబరువుల మోసెదననియు, వారి కర్మల నశింపజేయుదుననియు , తమ ఏకాదశ సూత్రాలలో మాట ఇచ్చియున్నారు. తానెన్నడూ మాటతప్పనని ద్వారకామాయిలో మరిమరీ నొక్కిచెప్పారు. శ్రీసాయి చరిత్రలోని భక్తుల అనుభవాలన్నీ ఇందుకు నిదర్శనము. " అనన్యంగా శరణు పొందటం " అంటే ఇదివరలో తెలిసో తెలియకో దుష్కర్మల జేసియుండవచ్చు కాని ఇప్పుడు నిన్ను ( సాయిని) ఆశ్రయించాను, నేనిక పిమ్మట చెడుకర్మల  చేయనని సాయికి ప్రమాణం చేయటమేయని దీనిభావం. మంచివానిగా మారిన పుత్రునిజూసి ఏతండ్రి సంతోషింపడు?  తండ్రికితగ్గ బిడ్డలకమ్మని సాయి తమభక్తులకు చెప్పియున్నారు. ఆశ్రీతుల దుష్కర్మ ఫలితాలను సాయి తన దివ్యశక్తితో దహించి వారికి మేలుచేస్తారు. దీనికి సంకేతంగా సాయి ద్వారకామాయిలో నేటికిని అహోరాత్రాలు మండే  ధుని ప్రతిష్టించారు. (పూనాజిల్లా  నారాయణగావ్...

సాయి కథలు - పెద్దముల్లు చిన్నముల్లు

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - పెద్దముల్లు  చిన్నముల్లు  సాయిబాబా తన భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ కు భగవద్గీత 4వ అధ్యాయం, 34వ శ్లోకం వివరిస్తూ,  గురువు తన బోధయనెడి అజ్ఞానంతో  శిష్యునిలోని జన్మజన్మల కొనసాగిన చీకటిపొరలనెడి అజ్ఞానాన్ని తొలగిస్తాడని తెలియబరచారు. అంటే బోధకునిది  పరిపూర్ణ జ్ఞానం కాదన్నమాట. బోధ పెద్దముల్లులాంటిది, దాని సాయంతో శిష్యునిలో దాగిన అజ్ఞానమనే చిన్నముల్లును తొలగించ వచ్చును. అంతవరకే బోధయొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత. వ్యక్తి తన నిజస్వరూపం తెలిసికొనుటకు బోధకు అతీతమైన పరిపూర్ణ అనుభవం పొందాలి. ఈవిషయాన్నీ  క్రింది విధంగా అర్ధం చేసుకొనవచ్చును. ఒక వ్యక్తి పంచదార గూర్చి వినలేదు, తినలేదు, చూడలేదు, దాని లక్షణములుకూడ ఏమాత్రం తెలియదు. మరొక వ్యక్తి గలడు, అతడు పంచదారను చూసాడు, దాని ధర్మాలగూర్చి విన్నాడు కాని తన జీవితంలో ఎపుడూ రుచిచూసి యెరుగడు. కాని పంచదారనుగూర్చి తనకున్న జ్ఞానాన్ని   రెండవ వ్యక్తి  మొదటివానితో పంచుకొనవచ్చును.  ఇచట రెండవవాని జ్ఞానం పైనచెప్పబడిన పెద్దముల్లులాంటిది. రెండవవానికి పంచదార వివరాలు తెలు...

సాయి కథలు - కాపాడబోతె కర్రదెబ్బా?

Image
శ్రీసాయినాథాయనమః!  సాయి కథలు - కాపాడబోతె  కర్రదెబ్బా ? హంసరాజు మిగుల ఉబ్బస వ్యాధి భరించలేక భార్యతో శిరిడీలో కొంతకాలమున్నాడు. బాబా దయతొ వానికి వ్యాధి నయమైంది, కాని పుల్లపెరుగు యేమాత్రము తినకూడదన్నారు. బాబామాటను లక్ష్యపెట్టక వాడు రోజూ భార్యచె పాలుతోడు పెట్టించేవాడు. ఈవిషయాన్ని బాబాకు తెలియనివ్వలేదు. చిత్రమేమంటే రోజూ భార్యాభర్తలు ఆరతికి వెళ్లివచ్చేటప్పటికి ఒక పిల్లి ఆపెరుగు తాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడవెళ్ళక పొంచియుండి, పిల్లివచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. ఆపిమ్మట యాతడు మజీదుకు వెళ్ళగానే బాబా, " ఇక్కడొక మూర్ఖుడు పుల్లపెరుగుతిని చావాలని చూస్తున్నాడు. కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడీరోజు కర్రతో కొట్టాడు ! " అన్నారు. భక్తుల రక్షించే సాయి కొన్ని సందర్భాలలో వారినుండి తిట్లు దెబ్బలు తినవలసి వచ్చేది.   సాయిసహాయం ఏరూపంలోనైనా మనకు లభింపవచ్చు, మనమే సాయి సర్వవ్యాపి యనే ఎరుకతో వ్యవహరించాలి. శ్రీసాయిలీలామృతము: పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! ...

సాయి కథలు - సాయితొ ఉన్నతజన్మలు

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు -  సాయితొ ఉన్నతజన్మలు ! భక్తుల చెడు సంస్కారాల హరించి వారిని ఉన్నత జన్మల వైపుకు నడిపించడానికి సంకేతంగా సాయిబాబా ద్వారకామాయిలొ మధ్యాహ్న సమయాన తాము ఒంటరిగా వున్నపుడు తెరగట్టి దానిచాటున పాత నాణాల చేతి వేళ్ళతో రుద్దేవారట. ఎవరైనా గమనిస్తె ఆపని ఆపేసేవారట. అతికొద్దిజన్మలలో ముక్తిసాధించలేము గనుక జన్మజన్మలకు సాయి సహాయం భక్తులకు యెంతో ఆవశ్యకము. పరిశుద్ధ సంస్కారాలతొ, పరమపద సోపానపటంలోని నిచ్చెనలా సాయి మనజీవితాలను పవిత్రమయం జేస్తారు. సాయితో కలసి జీవించినా వారిపట్ల భక్తిశ్రద్ధల కోల్పోయిన అదృష్ట హీనులు కొందరు పామునోటబడి పాతాళానికి పడిపోతారు. పూర్వజన్మలగూర్చి భక్తులతో వేరు వేరు సందర్భాలలో వెలిబుచ్చిన సాయిజన్మాంతర జ్ఞానాన్ని పరిశీలించెదము. తమ ప్రియ సన్నిహితభక్తుడు శ్యామాతో తమది 72 జన్మలబంధమని పలికారు. పురంధరేతో తమది 7 శతాబ్దాల అనుబంధమని తెలియపరిచారు. అటులనే ధురంధరేను 60 తరములనుండి యెరుగుదమని ద్వారకామాయిలోని తోటి భక్తులకు చెప్పారు. శ్రీమతి ఖాపర్డే జన్మపరంపరలు మిగుల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమె ప్రధమంగా ఓవర్తకునింట  ఆవుగా జన్మించి సాయికి పాలను మిగుల సమకూర...

సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే సాయినాథులు!

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే  సాయినాథులు!  సాయిలీలలను స్మరిస్తుంటే శ్రీకృష్ణుని, శ్రీరాముని,  గాథలు కనులముందు గోచరిస్తాయని రచయిత హేమాద్రిపంత్ శ్రీసాయిసచ్చరిత్రములో పేర్కొన్నాడు. నాకుకూడ అలాంటి యనుభవమే అపుడపుడూ కలుగుతుంటుంది. శ్రీసాయిసచ్చరిత్రము 48వ అధ్యాయములోని శేవడే మరియు సపత్నేకర్ కథలు చదువునపుడు ఓ మధురమైన విష్ణులీల మనసుకి తట్టింది. ఆవివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాము.  ముందుగా సపత్నేకరు గూర్చి తెలిసికొందాము. షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట నివాసి యతడు, తన లా పరీక్షకు చదువుచుండెను. శేవడే ఆతని సహవిద్యార్థి, సాయిబాబాను మిగులునమ్మినవాడు. తానుబాగుగ చదవకున్నను బాబాకృపతో లాపరీక్షలో తప్పక ఉత్తీర్ణుడ కాగలనని విశ్వసిస్తాడు. బాబాపై యాతని అపార విశ్వాసానికి నవ్వుకొంటాడు సపత్నేకర్. అంతేగాక బాబాను సయితము వెక్కిరిస్తాడు. పరీక్షలో పాసైన సపత్నేకర్ అక్కల్ కోటలో న్యాయవాదవృత్తి ప్రారంభిస్తాడు. పదేళ్ళపిమ్మట  దురదృష్ట వశాత్తు తన భార్యను, ఒక్కగానొక్క కొడుకుని కోల్పోతాడు. మిగుల వికలమనస్కుడై పండరీపురము, గాణ్గాపుర పుణ్యక్షేత్రముల దర్శిం...