Posts

సాయి కథలు : రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు

Image
 శ్రీసాయినాథాయనమః  ప్రియ పాఠకమహాశయులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు !  సాయి కథలు :  రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము మతములను పారే  పావన జీవ  నదులుగా భావిస్తే, ఆధ్యాత్మికతపరిపూర్ణతనును  సాగర సంగమంగా తలచవచ్చును.  అవతారపురుషుల, మహాత్ముల  జీవితవిశేషాలు పవిత్రసంగమాన్ని పోలియుంటాయి. శిరిడీ సాయిబాబా, తామే సర్వ దేవీ, దేవత, యోగి, సర్వమత  ప్రవక్త,  సర్వజీవ, విశ్వమంతా వ్యాపించిన చేతనాచేతన సృష్టి రూపులుగా భక్తులకనుభవమిచ్చారు. సాయి జీవనానికి సమాంతరంగా  రామకృష్ణ పరమహంస జీవితం గోచరిస్తుంది. ఎవరు రాముడో, యెవరు కృష్ణుడో అతడే ప్రస్తుతం ఈదేహం ధరించాడని వారే చెప్పారు. అంతేగాక అన్నిమతముల మూలసత్యమొక్కటేయని తాము స్వయంగా అనుభవం పొంది యున్నారు. రామ,కృష్ణ, హనుమ, రాధ, చైతన్య,  ప్రవక్త మహమ్మద్, జీసస్ మొదలుగాగల ప్రవక్తల ఏకరూప దైవత్వాన్ని  పరమహంస స్వయంగా పొందియున్నారు. సాయిబాబా, జీసస్ క్రిస్తు ఒకరే యనెడి ఓ భక్తురాలి అనుభవమును ' సాయీ నీవే...

సాయి కథలు - కుండలిని శక్తి

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - కుండలిని శక్తి " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము భగవంతుని జేరుటకు మన శాస్రములందు వేరు వేరు మార్గములు చెప్పబడినవి. ఆయా మార్గములను  యోగములనియు యందురు, ఉదాహరణకు కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగమార్గములు మొదలగునవి. కుండలినీ యోగమార్గముగూడ భగవంతునిజేరు యొకదారియని సిద్ధయోగులు వచించినారు. . సాయిబాబా విషయమున కుండలినీ సాధన వివరములు గుహ్యమైనప్పటికీ, వారు పరిపూర్ణ యోగసిద్ధులుగ అందరికి తెలిసిన విషయమే.  వారి జీవనము కుండలినీ యోగము సిద్ధించిన యోగులజీవితమును బోలియుంటుంది.  అందరిలో నిద్రాణమైన దైవశక్తియే కుండలినీశక్తిగా చెప్పబడినది. ఆశక్తి మనిషి  వెన్నెముక క్రిందిభాగంలోని మూలాధారచక్రమందు చుట్టచుట్టుకొని  నిదురించెడి సర్పంగా యోగులు అనుభవపూర్వకంగా లోకానికి తెలియజేసారు. సాధారణ మానవుడు దైవమును జేరు మార్గములలో ఇది యొకటిగా పేర్కొనబడినది. కుండలిని తంత్రయోగమునకు సంబంధించినది. నిదురించెడి శక్తిని సద్గురుని సహాయముచేతగాని, యోగసాధనముచేగాని మేల్కొలిపి, వెన్నెముక క్రిందభాగమునయున్న మూలాధారచక్రమునుండి వెన్నెముక ...

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 2

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము  2 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."   దైవస్పర్శ ప్రభావము మరియు  శక్తి,   రామాయణ మహాభాగవత సద్గ్రంధములందు సోదాహరణముగా వివరింపబడినది. శ్రీరామచంద్రుని పాదస్పర్శచే శిలారూపము దాల్చిన అహల్య సుందరమూర్తిగా శాపవిమోచనం పొందినది. శ్రీకృష్ణుడు కురూపి కుబ్జను తాకి సౌందర్యరూపిణిగా మార్చారు. ఈభాగమునందు శ్రీరామకృష్ణ పరమహంస  నరేంద్రుని (స్వామి వివేకానంద) స్పృశించి తమశక్తిని చొప్పించి వానికి దివ్యదైవదర్శనం కల్గించిన  వివరములను పరిశీలించెదము. శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుల ప్రధమ కలయిక ఎల్లప్పుడూ దైవావస్థలో విలసిల్లే రామకృష్ణులకు వారు కాంక్షించే  తమ రాబోయే మరియు కాబోయే శిష్యుల ఆగమన వివరములు బాగుగ తెలియును. కలకత్తాలోని సిమ్లా ప్రాంతానికి చెందిన సురేంద్రనాథ్ మిత్ర దక్షిణేశ్వరిలోని రామకృష్ణుల మొట్టమొదట దర్శనముతోనే  మిగుల ఆకర...

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును." బాబా సపత్నేకర్ తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె. " ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. "  సంతానలేమిచే దుఃఖపడు యాతనికి ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను.     గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః  గురుదేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్  పరబ్రహ్మా  తస్మై శ్రీగురవేనమః ( గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు విశ్వ మూలకారణ పరబ్రహ్మ.  అలాంటి గురువరేణ్యునకు నా నమస్కారములు.) శరణం శరణం గురుచరణం  శరణం శరణం  శరణం శరణం  సాయీచరణం ...శరణం శరణం  భవభయహరణం  బహుశుభకరణం  బాబాచరణం   పావన తీర్ధం                  ...

సాయి కథలు - పై లోకాలున్నయ్యా ?

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు -  పై లోకాలున్నయ్యా ? " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై  ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం  బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు?  సర్వము తానె యైన వా  వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే  శరణంబు వేడెదన్                గజేంద్రమోక్షము, శ్రీమద్భాగవతము  ఓ పర్యాయము బాబా ప్రియభక్తుడు శ్యామా తనకు బ్రహ్మాది లోకాల జాపమని సాయిని పట్టుబట్టాడు. భగవంతునిముందు అవి అల్పాలని, అశాశ్వితాలని, వాటిని పట్టించుకోవద్దనీ చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయాలోకాలు కన్పిస్తుంటే బాబా, సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి జూపి , " మనం కోరవలసినది వీటికతీతమైనది. " అన్నారు.  శ్రీ సాయిలీలామృతము  పైనున్న లోకాలగురించి  రామకృష్ణ పరమహంస గాంచిన అద్భుత దృశ్యము. శ్రీరామకృష్ణుల మాటలలోనే వారు గాంచిన అద్భుతదృశ్య వివరములు, " ఒకరోజు సమాధిస్థిత...

సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను! "

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను!  "  తమభక్తులనెపుడూ పడిపోవనీయనని సాయినాథులు అభయమిచ్చినారు. కోపతాపాలనుండి, కామ లోభాలనుండి భక్తుల విచిత్రరీతుల రక్షించారు. హరి వినాయక్ సాఠే బాబాకు గొప్పభక్తుడు. శిరిడీలో  సాయినిదర్శించు వారలనివాసమునకై   మొట్టమొదట  సాఠేవాడ  నిర్మించాడు. సాఠే ప్రవర్తనను సాయి యెలా చక్కదిద్దారో పరిశీలిద్దాము. తమమామ దాదాకేల్కర్ సలహాపై శిరిడీలో ఇరువది ఎకరాల పొలము కొన్నాడు సాఠే. ఆ భూమిని తనభార్యతో కలసి చూచుటకై తాత్యానుండి ఎద్దులబండి తెప్పించాడు. భార్య మొదట అంగీకరించినదికాని, తర్వాత తండ్రిమాటపై చూచుటకు రానన్నది. తనమాటవినలేదన్న మిగుల కోపంతో ఆమెను దండించుటకు చెర్నాకోలు తీసుకొన్నాడు. అదేసమయాన మేఘుడు పరుగులవచ్చి వెంటనే బాబా రమ్మన్నారన్న వార్తను సాఠేకు తెలియజేస్తాడు. సాయిని సందర్శించిన సాఠేతో బాబా, ' ఏమిటి విషయం, ఏమైనది? నీభూమి అక్కడే వుందిగా, చూచేదేమిటి? ' అన్నారు. సాఠే ప్రవర్తనపట్ల సాయి యెంతటి అప్రమత్తులోకదా! మరొక సంఘటన. ఒకరోజున మొదటిసారిగా శిరిడీలో ఓభక్తురాలి యింటికి వెళ్లదలచాడు సాఠే. సరిగా అంతకు కొద్దిసేపటికి మ...

సాయి కథలు - ఆహారశుద్ధి

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఆహారశుద్ధి  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము           ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల ?  భాండశుద్ధిలేని పాకమేల?  చిత్తశుద్దిలేని శివపూజలేలరా?  విశ్వదాభిరామ వినురవేమ.                                                           ఆహారవిషయమై మహాత్ముల అభిప్రాయములను, భగవద్గీత సందేశమును తెలిసికొందము.  ముందుగా సాయిబాబా యీవిషయమై ఏమిచెప్పారో చూచెదము.  " ఒక అనుభవములేని యోగసాధకుడు, నానాసాహెబు చాందోర్కరునితో కలసి మసీదుకుబోయి సాయిను జూచుసరికి  బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన మెదలెను. ' రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? ' సాయిబాబా యతని మనసున మెదిలిన ఆలోచనను గ్రహించి , నానాసాహెబుతో నిట్లనియెన...