శిరిడీలోని శక్తిస్థానములు



శ్రీసాయినాథాయనమః 

షిరిడీలోని శక్తిస్థానములు 

సాయిబాబా ఆగనంతో షిరిడీ గ్రామం మహత్తర శక్తి సంతరించుకొని ప్రఖ్యాత పుణ్యతీర్ధంగా విరాజిల్లుతుందిఈపావనక్షేత్రంలో బాబా నివాససంచారతపోమహిమల  ప్రభావంచే కొన్నిస్థానాలు మరింత  ప్రత్యేకశక్తి కూటములుగ భక్తుల మనోరథాల పూరించుచున్నాయిఈశక్తికూటముల వివరముల నిపుడు  పరిశీలించెదము  పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు "శ్రీసాయినాథప్రబోధామృతము" లో    ప్రత్యేకస్థానాలనిలా వివరించి సమన్వయపరచారు.     
చావడిలో రాత్రి విడిచి రాత్రి నిద్రించడము భావగర్భితమైన చర్యనవద్వారాలుగల దేహ స్ఫూరణతో కూడిన జాగ్రదవస్థకు ద్వారకామాయి సంకేతమునిద్రించను మాత్రమే ఆయన ఆశ్రయించిన చావడి నిద్రావస్థకు సంకేతముమెలకువలో ప్రజ్ఞ ధునిలాగ సులభగోచరమునిద్రలో ప్రఙ్ఞగుప్తముఅందుకే చావడిలో ధుని స్థాపించలేదు సాయి.   ధుని లేకపోయినా అఖండ దీపముయొక్క కొద్దివెలుగుతోఅబ్దుల్ అను సూక్ష్మముసాత్వికమూఅహంకారంతో కూడిన స్వప్నావస్థకు చిహ్నం లెండితోట అందులోకి బాబా ఒక్కరే ప్రవేశించేవారుగదాఇట్టి భేదాలుచిహ్నాలు లేని నిత్యశాంతి రూపమైన తురీయమే  సమాధి మందిరముఇంకొక కోణంలో చూస్తే వృక్షమూలంలోని 1) భూగృహము 2) వృక్షమూలము 3) ద్వారకామాయి 4) చావడి 5) లెండి 6) సమాధిమందిరము షట్చక్రాలకు సంకేతాలుసాయి నిలిపిన అఖండ దీపాలు అన్ని అవస్థలలోనూ చెక్కుచెదరని తురీయాతీత స్థితికి సంకేతము." ధుని, తిరుగలి, సాయి కూర్చున్న శిలావేదిక  మహిమాన్విత ద్వారకామాయిలోని అంతర్భాగములే.  షిర్డీలోని  ఈ పవిత్ర సాయి శక్తిస్థానముల స్మరిస్తూ, వందనమిడుచు  సాయినాథుని అనుగ్రహానికి పాత్రులగుదముగాక!  భక్తులు ఈవివరణభావన కనుగుణముగా శిరిడీ యాత్రజేసి, శ్రీసద్గురుసాయినాథుల కృపాకటాక్షముల మిగుల పొందుటకు ప్రార్ధించెదను.  

క్లుప్తంగా గుర్తుంచుకొనేదేమంటే, శిరిడీ సందర్శినప్పుడు భక్తిశ్రద్ధలతో పైన పేర్కొన్న పవిత్ర స్థానాలను దర్శించి, వీలైనచోట ఆస్థాన ప్రదక్షిణ చేయుట భక్తులకెంతో శ్రేయస్కరము. సమయాభావంచే అన్నిస్థానాలకు ప్రదక్షిణలు చేయలేని పక్షంలో, గురుస్థానము, నింబవృక్షము లకు 108 ప్రదక్షిణలు జేయుట మిగుల శుభకరము. 

1) భూగృహము, 2) వృక్షమూలము ( గురుస్థానము )


 నింబవృక్షమా  నీదేను పున్నెము
నీ ఛాయసీమలో వెలసేను దైవము

భూగర్భమందున బాబ తపము సేసెను
ఆతపపు తావిలొ నీమొలక నిలిచెను
నీ చివురు నీడనే గో..సాయి కూడెను
ఆకుపసరులా  రోగా.. మాన్పెను                      ||  నింబవృక్షమా! ||

నిలువెల్ల గరళము  అది నీకె  సహజము
హరియించె దైవము  నినునింపె మధురము
కురుపింతు వమృతం అది మాకె సుకృతం
దరిశింప  క్షణం ధ్యానింప ... క్షణం                 ||  నింబవృక్షమా|| 

వెలిగింప దీపము గురుపాద  స్థానము
తొలగింతు భారము కలిగింతు భోగము
మముగావు రాజమా గురుసాయి పీఠమా
మా కల్పవృక్షమా ...నీకే ప్రదక్షిణం                      ||   నింబవృక్షమా||

3) ద్వారకామాయి 

భాగవతం భాగవతం బాబాలీలల భాగవతం
భాగవతం భాగవతం ద్వారకామాయి భాగవతం

హేమాద్రిపంతుయె వేదవ్యాసుగ తేనెల సోనలు  కురిపెనులే
ఘటనఘటనలో లీలఘనములే బాలగోపాల సాయి చూపెలే              !భాగవతం!

అవతారపురుషులే సాయిబాబ యట షిరిడి నేలపై నడచెనులే
వెన్నదొంగయై పాండురంగడై క్రీడలెన్నొ మహి సాయి చుపేలే               !భాగవతం!

క్రతువులేవి మనబ్రతుకు మార్చవు భృతిని గూర్చినా గతిని చేర్చవు
సద్గురుపాద  భక్తిశ్రద్ధలే మాయ తొలచునని మాయి పలికెలే                !భాగవతం!

కర్మ పునాదియె వ్యాధుల బాధల కర్మల గాల్చుట తప్పదులే
బ్రతుకుబాట నిష్కర్మలు సేయగ ధుని సాయీశుని పలికెనులే             !భాగవతం!   

చీనాంబరములె చిఱుగునని మరి సింహాసనములె  తొలుగునని
శిలావేదికే చెప్పెనులె బహు సాయితత్వమును చాటెనులే                   !భాగవతం!

చిఱుగులె మిగులును రాజులకైనను మదిమహారాజుగ నుండమనీ
వైరాగ్యంబె వైకుంఠంబని కఫనీయే చెప్పక చెప్పేనులే                           !భాగవతం!

రూపులనేకము జగన్నాటకము శునకము పండితులేకమనీ
సుఖము దుఃఖము శీతల ఉష్ణము సమానమె సాయిభాష్యములే          !భాగవతం!

శక్తి ఆత్మయే సాటిలేనిదని గురునితోడ యది విప్పమని
చీకటి తొలగ కాంతులలరునని జలముల దివ్వెలు పలికెనులే                !భాగవతం!

3A) ధుని 

ధునిరా  సాయి  ధునిరా ; నిధిరా పెన్నిధిరా
గనిరా ఊదిగనిరా ; కనరా కనకనరా

బాబాముంగిట యజ్ఞగుండమురయజ్ఞఫలంబుల మనకందించుర
భక్తకర్మలె ధూమ్రసెగలుగనింగికెగయు మరినింగికెగయుర                    ||ధునిరా||

నిత్యశుద్ధమై మండుమండురఆత్మరూపమై ప్రజ్వరిల్లుర
సాయి సాయి రగిల్చె చూడర ; సాయిమహిమగా రేయిపగలురా!             ||ధునిరా||


   3B) తిరుగలి చక్రము

ద్వారకామాయిలొ తిరుగలి చక్రము
ద్వాపరయుగ సుదర్శన చక్రము
సాయి చేతిలో తిరుగు విచిత్రము
కృష్ణరూపుగ చూపెడు చిత్రము                       ||ద్వారకామాయిలొ||

ధరణిలో ధర్మము దారితప్పగ
దానవ మాయయే నివురుగప్పగా
వాసుదేవు సంధించిన చక్రము
ధరమ గోవు రక్షించెడి చక్రము                        ||ద్వారకామాయిలొ||

దైవశాసనమే గాడిదప్పగా
రోగము శోకము ముప్పిరిగొనగా
సాయి చేతిలో  తిరిగిన చక్రము
ధరమ రక్షణిగ నొప్పెడు చక్రము                      ||ద్వారకామాయిలొ||

3C) శిలావేదిక


ఓరన్న రామన్న చూడన్న సాయన్న  కూర్చున్న శిలయన్న బహుమిన్నా
చైతన్య రూపన్న ,శేషపానుపేరన్న  బాబా కూర్చున్న బహు చలువ శిలయన్న

బ్రహ్మరూపు సాయి వేదికే అదిరన్న , హరుని వాసము కైలాసమే రన్న
శ్రీహరి విలసిల్లు వైకుంఠమదిరన్న , శ్రీరంగడూ నిలుచు పండరీ పురమన్న                   ||ఓరన్న రామన్న||

తాకితే చాలులే తాపాలు తీరన్న , మొక్కితే చాలులే మొహాలు పోవన్న
ద్వారకమాయిలో దర్బారు శిలయన్న , చూడు చూడు రన్న మొక్కి చూడు రన్న          ||ఓరన్న రామన్న||

పాషాణ మదికాదు పాపాల రక్షించు , నవనీతమై ఒప్పు నమ్మితే కనువిప్పు
శిరమొంచి చూడన్న మనసుంచి  చూడన్నసాయి సాయి దేవ కూర్చున్న శిలయన్న    ||ఓరన్న రామన్న||

4) చావడి

రంగు రంగుల   చావడోత్సవము 
మదిలోన రంగ రంగవైభవము 

మేళతాళాల భక్తబృందాలు 
మైమరచి పాడంగ సాయిగీతాలు 
కనువిందుజేసేటి నృత్యభంగిమలు  
కదలె కదలేను  చావడోత్సవమున                           ||రంగు రంగుల||

సింగారపూ హయము ముందునడువంగ 
భక్తులు దివిటీలు చేతబట్టంగ 
రంగులా ఛత్రము చిత్రముగ తిరుగంగ 
దరహాసముల సాయి పల్లకీతో వెడలె                        ||రంగు రంగుల|| 

గురుదేవు సాయీకి పాదాభిషేకాలు 
భక్తులకనుల ఆనందబాష్పాలు 
మంగళారతులేమొ మగువలివ్వంగ 
సాయిదేవుడు వెడలె చావడోత్సవమున                   ||రంగు రంగుల||

కనులు రెండూ చాలవాసంబరముఁజూడ 
కలిలోనె వైకుంఠ మరుదెంచె నటుల 
బృందావనంబదియె భక్తహృదయంబుల 
సాయిదేవుడు వెడలె చావడోత్సవమున                   ||రంగు రంగుల||

రెండుగదుల యాచావడందు 
రెండుగదులా నాహృదయమందు 
హాయీగశయనించు శ్రీసాయిబాబా 
హాయిగ శయనించు నాసాయిబాబా!                       ||రంగు రంగుల||

 5) లెండివనము 

చూతము రారండి లెండీని చూతము రారండి 
పావన వనమండీ  బాబా పాదపు స్పర్శండి 

సాయిచేతులా నందదీపముతొ సుందర వనమండి 
రాకపోకల సాయితొ  నిత్యము మహిమల ఘనమండి          || చూతము రారండి ||

సాయిలీలల సాక్షిభూతమే చూడగ రారండి 
మురళీలోలుని వేణువాయువుల బృందావనమండి
గోకుల... బృందావనమండి                                                || చూతము రారండి ||

     6) సమాధిమందిరము 

సమాధానమే సాయి సమాధిమందిరము
భక్తుల సమాధానమే సాయి సమాధిమందిరము

తరగని నిధియది వితరణ కరమది
దినకర ప్రభాత శుభకర కిరణమె
నందనవనమది సుందర జగమది
నందనందనుని వందిత భవనమె                   || సమాధానమే ||

సిరిహరి వాసము గురిగురు వాసము
ద్వారమునడుగిడ దురితము  దూరము
పరమపవిత్రము పావనచరితము
చిత్తమునిలిపిన అప్రమత్తమే ...                     || సమాధానమే ||


శ్రీసాయికరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!









Comments

  1. శ్రీసాయిబాబా మానుషరూపంలోనున్న మహాశక్తి క్షేత్రం. వారి ఉనికిచే శిరిడీ, పరిసరాలు మహాశక్తిని సంతరించుకొన్నాయి. బాబా నివాస సంచార స్థానాల దర్శించి, స్మరించి మనంకూడా మన ఆధ్యాత్మశక్తి స్థాయిని, సాయికృపచే పెంచుకొందాము!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.