నాదుభాగ్యము
శ్రీసాయినాథాయనమః
నాదుభాగ్యము
భాగ్యభాగ్య మదేనేమొ నాదుభాగ్యము
మధురసాయి స్మరణమేమొ నాదుసొంతములీలలీల అదేలే సాయిపాదము
శిరమునాది తాకగనే తొలగు పాపము!
గుహుడు గుహుడు సాయి గలువ కడుగు బాబపాదమే
శబరితల్లి సాయి జూడ ఎంగిలి ఫలహారమే
శిలయదియే సాయిస్పర్శ బహుసుందర రూపమె
తులసిదాసు సాయినెరుగ సాయిచరితమానసమే!
యశోదమ్మ సాయితోడ ముద్దులు వెనముద్దలే
గోపికలేసాయిగూడ పరవశముల పండుగయే
మీరబాయి సాయితలువ ప్రేమసాయి భజనయే
మనసిదే సాయిధ్యాన దేవదేవ మందిరమే!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సాయిబాబా పట్ల భక్తికుదురుట భక్తుల సౌభాగ్యము!
ReplyDelete