బాబా అమృతతుల్య మాట(బాట)లు

శ్రీసాయినాథాయనమః 

బాబా అమృతతుల్య మాట(బాట)లు  



"...సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులుపైని చల్లుడు."  అ : 1
" జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారానికిగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలెను." అ : 1

వాడు నిమిత్తమాత్రుడే,వాని యహంకారము పూర్తిగా పడిపోయినపిమ్మటనేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందునునా కథలు బోధలు  విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును.   అధ్యాయము 2

నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి , వారి కథలను వారే వ్రాసికొనిరి గ్రంధము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదుభగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడజేయునుకుంటివానిని పర్వతము దాటించునుసచ్చరితామృతము వ్రాయుటతయారు చేయుట బాబాయొక్క కటాక్షము చేతనే సిద్ధించినవినేను నిమిత్తమాత్రుడుగనే యుంటిని.  అధ్యాయము 3

"మీరెక్కడున్ననూ , ఏమి చేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనునుడునేనందరి హృదయముల పాలించు వాడనుఅందరి హృదయములలో నివసించువాడనునేనుప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించి యున్నాను .  జగత్తును నడిపించువాడను , సూత్రధారిని నేనే ". అధ్యాయము 3

సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును , సంకీర్తనమందును మిక్కిలి ప్రీతినామ సప్తాహానంతరము కాకాకు విఠలు దర్శనము .  అధ్యాయము 4


"అంతదూరము పోవలసిన అవసరమే లేదుమనప్రయాగ యిచ్చటనే  కలదునామాటలు విశ్వసింపుము." అధ్యాయము 4



అది తమ గురుస్థానమనియు , వారి సమాధి యచ్చట గలదు గావున దానిని కాపాడ వలయుననియు చెప్పెనుఅశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడుఅధ్యాయము 5

బాబా యా పాదుకలను స్పృశించిఅవి భగవంతుని పాదుకులని  నుడివెనువానిని వేపచెట్టు మూలమున ప్రతిష్టింపుడని యాదేశించెనుఅధ్యాయము 5

"నేను వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండునునాసద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా,శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచితన లీలలను తానే వినిపింప జేయునట్లు తోచునునేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించునుభాగవతమో , ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించునుఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికివచ్చునునాకై నెను  ఏదైన వ్రాయతలపెట్టినచోయొకమాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదువారి యాశీర్వాదము లభించిన వెంటనే రచనా ధార  యంతులేనట్లు సాగును." రచయిత హేమద్పంత్అధ్యాయము 6

నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదునాయందే మనస్సు  నిలిపి , భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నేయారాధించువారి యోగక్షేమములను నేను జూచెదనుఎల్లప్పుడును నన్నే జ్ఞప్తియందుంచుకొనుము." సాయిబాబా.    అధ్యాయము 6

బాబా వారితో కలసి నవ్వుచూసంభాషించుచూ సంచరించుచున్నప్పటికీవారినాలుకపై "అల్లామాలిక్ " యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిదిఅధ్యాయము 7
మానవదేహముతో  సంచరించుచున్నప్పటికీవారిచర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెనువారిని జూచిన వారందరు వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి.  అధ్యాయము 7

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారురోగులు ఆరోగ్యవంతు లగుచుండిరిదుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరిఅనేకులకు కోరికలు నెరవేరుచుండెనుఅధ్యాయము 7

"బిడ్డ మండుచున్న కొలిమిలొ బడెనువెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి  బిడ్డను రక్షించితినినా చేయి కాలితే కాలినదిఅది నాకంత బాధాకరము కాదుకానీ బిడ్డ రక్షింపబడుట నాకానందము కలుగజేయుచున్నది." సాయిబాబా.  అధ్యాయము 7

చంకలో కోడిగుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను జూపుచు, " నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుమువారికష్టములన్నియు నావే!" .   సాయిబాబాఅధ్యాయము 7

"మన నలుగురము కలసి భజన చేసెదముపండరీ ద్వారములు తెరచినారుకనుక ఆనందముగా పాడెదము లెండు!" నానాసాహెబు పండరి వెడలునప్పుడు బాబా పక్కవారలతో  చెప్పిన మాటలుఅధ్యాయము 7

"శ్రద్ధా భక్తులతో ఎవ్వరేని పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను" (భగవద్గీత 9  26శ్లోఅధ్యాయము 9


తల్లిఏమయిన తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ యింటికి పోయినాను . తలుపు తాళము వేసియుండెనుఎలాగుననో లోపల ప్రవేశించితిని . కాని అక్కడ తినుట కేమి లేకపోవుటచే తిరిగి వచ్చితినిబాబా ఆత్మారాము తార్ఖడు భార్యతో:  అధ్యాయము 9

"నీవు ఇంటివద్ద బయలు దేరునప్పుడు ఆత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?"  గోవింద్ బలరాం మాన్కర్ తో బాబా:  అధ్యాయము 9

"నా భక్తులు నన్నెటుల భావింతురోనేను వారి నావిధముగనే అనుగ్రహింతును."  అధ్యాయము 9 (గీతావాక్యము 4-11)

"తల్లీనాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావునా జీవశక్తులు సంతుష్టి చెందినవి."   బాబా ఆత్మారాము తార్ఖడు భార్యతో:  అధ్యాయము 9

శిరిడీ స్త్రీలు పామరులైనప్పటికివారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పడుకొని చుండిరివారికీ అక్షరజ్ఞానము  శూన్యమైనప్పటికి వారిపాటలలో నిజమైన కవిత్వము గానవచ్చునుయదార్ధమైన కవిత్వము పాండిత్యమువల్ల రాదుఅది యసలైన ప్రేమవలన వెలువడునుఅధ్యాయము 10

బానిసలకు బానిసనగు నేను మీకు ఋణగ్రస్తుడనుమీ పాదములు దర్శించుట నా భాగ్యము." అధ్యాయము 10

మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు , వారి కథలు వినుడువారు తప్పక మనల అనుగ్రహించగలరుమన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదముల నాశ్రయించు భాగ్యము లభించినదిఅధ్యాయము 10

వర్ణింపనలవికాని సచ్చిదానంద స్వరూపము షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెనుఅధ్యాయము 11

అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది . డాక్టరు పండితుగూర్చి బాబా;  అధ్యాయము 11

నేనెప్పుడూ మీ యోగక్షేమములనే అపేక్షించెదనునేను మీ సేవకుడనునేనెప్పుడూ మీ వెంటనే యుండి పిలిచిన పలుకుతానునేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే!"  అధ్యాయము 11

అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలనుఅల్లా మియ్యా కటాక్షము లేనిచో యీ మసీదులో పదము పెట్టగలుగు వారెవ్వరుహాజీ సిద్దిఖ్ ఫాల్కే గూర్చి  :11

ఆగునీ తీవ్రతను తగ్గించునెమ్మదించు."; " దిగు దిగు శాంతించుముబాబా తుఫాను,ధునిమంటల నియంత్రించుట : 11

వారి ఇచ్ఛ లేనిదే భక్తులు వారివద్దకు రాలేకుండిరివారివంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారువారిలీలలు ఎరుగుట కూడా తటస్తించదుఎవ్వరును తమ యిష్టానుసారము  షిరిడీ పోలేకుండిరిబాబా యాజ్ఞ వరకే షిరిడీలో నుండగలిగిరికాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి యుండెను.   : 12

"గేరు తయారుగ నుంచుడుఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను."   :12
తన ఇష్టదైవమగు శ్రీరాముడు  గద్దెపై గాన్పించుటచే వారిపాదములపైబడి నమస్కార మొనర్చితినని డాక్టరు బదులిడెను :12

ఎల్లప్పుడు సాయి సాయి యని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదనుపూజా తంతుతో నాకు పనిలేదుషోడశోపచారములు గాని అష్టాంగయోగములుగాని నాకు అవసరము లేదుభక్తియున్నచోటనే నా నివాసము. "    :13

"...  నీ కష్టములు గట్టెక్కినవిఎంతటి పీడబాధలున్నవారలైనను ఎప్పుడైతే  మశీదు మెట్లెక్కుదురో వారికష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయునుఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడువారీ రోగమును తప్పక బాగుచేయును."   : 13

ప్రతినిత్యము సాయిలీలలు వినినచోనీవు శ్రీసాయిని చూడగలవునీ మనస్సున వారిని రాత్రింబవళ్లు  జ్ఞప్తియందుంచుకొనుము.   :13

దిగులు పడకునీ కీడు రోజులు ముగిసినవిఅల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును."  
బాబా రతంజీ వాడియాతో     : 14

నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము!" జోగ్ తో బాబా   : 15

నా ముందర భక్తితో మీరు చేతులు చాచినచో వెంటనే రాత్రింబవళ్లు మీ చెంతనే యుండెదనునా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న  పనులు నాకు తెలియునుప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడునేను మీ చెంతనే యుండెదను."   : 15


"నీ పేరాసనులోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవుఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమైయున్నదో , వాడా యభిమానమును పోగొట్టుకోనంతవరకు బ్రహ్మము నెట్లు పొందగలడుపేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. "
ధనికునితో బాబా.   : 16-17

భక్తుల మనసులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారుఅంతియేగాకచెడ్డయాలోచనల నణచుచు , మంచి యాలోచనల ప్రోత్సహించువారుహేమాద్రిపంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపిశ్యామావద్దకు పోయి అతనివద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని , అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను : 18-19

భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునోబాబా యంత త్వరగా వానికి సహాయపడునుఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును.    : 18-19

రాత్రింబవళ్లు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టిని నిగిడ్చితినివారిని చూడనిచో నాకు శాంతి లేకుండెనువారిధ్యానము వారిసేవ తప్ప నాకింకొకటి లేకుండెనువారే నాయాశ్రమమునా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిదిఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైససంతోష స్తైర్యములతో గూడిన ఓరిమి " సబూరియనునది రెండవ పైసా. "   : 18-19

తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు , నన్నుగూడ మాగురువు తమ దృష్టిచేతనే పోషించుచుండెడి వారు తల్లీ ! నాగురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదునీ ఆలోచనలునీవు చేయు పనులు నాకొరకే వినియోగించుమునా వైపు సంపూర్ణ హృదయముతో చూడుమునేను నీ వైపు అట్లనే చూచెదను.  "  భక్తురాలు రాధాబాయితో బాబా   : 18-19



సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుముమీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు."   : 18-19

ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరివద్దకు పోరుఎవరుగాని ఎట్టిజంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుముదాహము గలవారికి నీరుఆకలిగొన్నవారికి అన్నముబట్టలులేనివారికి బట్టలునీయింటి వసారా ఇతరుల విశ్రాంతికి వినియోగించినచో  నిశ్చయముగా భగవంతుడు ప్రీతి చెందునుఋణానుబంధముచే మనమందరము కలసితిమి. "   : 18-19

భక్తిప్రేమలచే వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకు సహాయ పడెదరుసద్విచారముల ప్రోత్సహించెదరుగురువారమంతయు రామస్మరణ చేయ దలచిన హేమాద్రిపంతు మసీదులో ఎకనాథ్ మహారాజ్ రచించిన " గురుకృపాంజను పాయోయను   చక్కని పాటను వినెను : 18-19

ఎంత ఆనందముగా నీవు సాటిసోదరుని తిట్టు చున్నావుఎంతోపుణ్యము జేయగ నీకీ మానవజన్మ లభించినదిఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకుతోడ్పడునా ?"  : 18-19

బాబా ఉపదేశములకు  పరిమితిలేదువివిధ భక్తులకు వివిధ మార్గముల సూచించిరికొందరికి స్వయముగా ఉపదేశము నిచ్చువారుకొందరికి స్వప్నములో నిచ్చేవారు.   : 18-19

ఒకరి కష్టము నింకొకరుంచుకోరాదుకష్టపడువాని కూలి దాతృత్వముతోను ధారాళముగనివ్వవలెను : 18-19

తొందర పడవద్దు విషయములో ఎట్టికష్టమును లేదుతిరుగుప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల సందేహమును తీర్చును."   : 20

ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభముకాదునాన్ హేఘాట్ ఎనుబోతుపైన సవారిచేయుటకంటె కష్టముఈఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనదిదీనికి ఎంతో కృషి అవసరము."   : 21

ప్రజలెంత టక్కరులువారు పాదములపై బడెదరుదక్షిణ నిచ్చెదరుకానీచాటున నిందించెదరుఇది చిత్రము గాదా? "  : 21

నీవిపుడు కూర్చున్నదే  ద్వారకామాయిఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండియాతురతలనుండి తప్పించును మసీదు తల్లి చాల  దయార్ద్ర హృదయురాలుఆమె నిరాడంబర భక్తులకు తల్లివారిని ఆపదలనుండి తప్పించునువారికి ఆనందము కలుగును. "    : 22

ఈనానా ఏమనుచున్నాడునీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదాసరేనీవు ఏమి భయపడనక్కరలేదుమృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక! "  : 22

"భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడుఅవి సర్పములుగానితేళ్ళుగాని కానిండువారియాజ్ఞయైన గాని యెవరు యెవరినీ యేమి చేయలేరుకాబట్టి మనము కనికరించి అన్నిజీవులను ప్రేమించవలెను. "    : 22

నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను."   : 23

ఓరి  పిరికి పురోహితుడాపైకెక్కవద్దుఎక్కితివో ఏమగునో చూడుపోవెడలిపొమ్ముదిగువకు పొమ్ము."   : 23

ఏమి యాలోచించుచుంటివినరుకుము!"  : 23

నీ అమృతము వంటి పలుకే మాకు చట్టముమాకింకొక చట్టమేమియు తెలియదునిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదముమీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్లు నీ యాజ్ఞలు పాటింతుముఅది ఉచితమా?  కాదాయనునది మాకు తెలియదుదానిని మేము విచారించముఅది సరియైనదా కాదాయని వాదించముతర్కించముగురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధిమా ధర్మము."   : 23

అన్నాసాహెబుకు తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదుఈనాడు సంతరోజుశనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడువాని నైజము నాకు తెలియును శనగలే దానికి నిదర్శనము విషయములో నేమి యాశ్చ్యర్యమున్నది?"   : 24

కాని నీవు తినుటకు ముందు  నన్ను స్మరింతువానేనెల్లప్పుడు నీ చెంత లేనానీవేదైనా తినుటకు ముందు నా కర్పించు చున్నావా?   : 24

మొదట భగవంతునికి అర్పించి  భుక్త శేషమునే మనము అనుభవించవలెను.   : 24

దేవానీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొనిభక్తుల నాందోళనపాలు చేసెదవువారు వ్యాకులులగుటతోవారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. "   : 25

సేటుకు పిచ్చి యెత్తినదిఅతని గృహమందేలోటు లేదని వ్రాయుముతనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుములక్షలార్జించుటకు ఆయాసపడవద్దని    చెప్పుము. "    : 25

సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడునుమీ క్షేమమును కనుగొను చుండునుఅవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించునుమనఃపూర్వకముగ నన్ను శరణుజొచ్చినవారితో నా సమాధికూడ మాట్లాడునువారనెన్నంటి కదలునునేను మీవద్ద నుండనేమోయని మీరాందోళన పడవద్దుఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడుఅప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు."   : 25

మామిడిచెట్ల వయిపు పూతపూసియున్నప్పుడు చూడుముపువ్వులన్నియు పండ్లు అయినచో , నెంత మంచి పంట యగునుకాని యట్లు జరుగునా? "  : 25

ఎక్కడైనను నెప్పుడైనను నాగురించి చింతించినచో నేనక్కడనే యుండెదను." దాముతో బాబా.   : 25

మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుముమా చెంచెల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. "  : 26

ఏమైనను కానిండుపట్టు విడువరాదునీ గురునియందే యాశ్రయము నిలుపుము."   : 26
బాపూ ! అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటినిఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నానువీనిని మీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుమునీవు మేలు పొందెదవు. "   : 26

గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదుకర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదునీవింకొక జన్మమెత్తి బాధ అనుభవింపవలెనుచచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించరాదు."   : 26

 రామదాసీఎందులకు చికాకు పడుచున్నావుశ్యామా మనవాడు కాడానీ వా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నదినిజమైన రామదాసికి మమతకాక సమత యుండవలెను."  : 27

గతజన్మలో నీమె ఒక వర్తకుని యావుతరువాత క్రమముగ జన్మలెత్తి తుదకు ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెనుకావున ఆమె పళ్ళెమునుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు."  : 27

"  రాజారామ్ యను మంత్రమును ఎల్లప్పుడు జపించుమునీవిట్లు చేసినచో నీ 
వితాశయమును పొందెదవునీకు మేలగును."  : 27

నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమునున్నప్పటికి పిచ్చుక  కాళ్లకు దారము కట్టి యీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను."  : 28

టక్కరివాడుదారిలో భజన చేయునునన్నుగూర్చి ఇతరులను విచారించు  చుండునుఇతరుల నడుగనేల? "  : 28


 మేఘాఈచిన్న యుపకారము చేసి పెట్టుముశరీరమునకు తల ముఖ్యముకావున తలపైనే నీళ్లు పోయుము."   : 28

ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరములేదునాకు రూపము లేదునేనన్నిచోట్ల నివసించుచున్నానుఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో వారిపనులన్నియు సూత్రధారియై నేనే నడిపించెదను."  : 28

చూడు శంకరుడు వచ్చినాడుజాగ్రత్తగా పూజింపుము. "    : 28


ఆమెకు బాబా శ్రీరామునివలే గాన్పించెనుకాని ఇతరులకు మామూలు సాయినాథునివలె గాన్పించెను : 29

నాయందు నమ్మకముంచి జాతకములువాని ఫలితములుసాముద్రిక శాస్త్రముల పలుకు లొక ప్రక్కకు ద్రోసి తనపాఠముల చదువుకొనుమని చెప్పుముతప్పక ఉత్తీర్ణుడగును. "   : 29

ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికి బాబా మాత్రము మనలను విడువడువారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి , జ్ఞానమునిత్యానిత్య వివేకములను పొందెదరుమా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటము లన్నియు బాపుగాక.   : 30

 కథలను చదువుటకు కావలిసినది యంతులేని ప్రేమభక్తివివాదము కాదు : 30

యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరుఅతని ఆజ్ఞలేక చెట్టు ఆకు గూడ కదలదు : 30

మీరెవ్వరు ? ఎచటినుండి వచ్చినా " రని కాకాజీ యడిగెను. " మాది షిరిడీనేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినానని శ్యామా యనెను : 30

ఏమి  అద్భుత శక్తిబాబా ఏమియు పలుకలేదుఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదుఆశీర్వచనములనైన పలుకలేదుకేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. " కాకాజీ వైద్య ;   : 30

బాబా స్వప్నములకు కాలనియమము లేదుపగటి స్వప్నములో కుశాల్చందును షిరిడీకి రమ్మనిరి : 30

ఎవరినైనను మనము పిలిచినచో వచ్చువారికొరకు కావలిసినవన్నియు మనము సమకూర్చెదముపంజాబీ రామలాల్బాబాను స్వప్నమందు గని ,  దుకాణములో బాబా ఫోటో జూసిషిరిడీకి వెళ్లి అచ్చటనే తన యంత్యకాలమువరకుండెను.   : 30

 పనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు "  బాబా;   : 31

కోరికలు లేనివాడవై రేపటినుండి భాగవతమును పారాయణము చేయుము." బాబా;   : 31

నీ చంచల మనస్సు నిలకడకై నిన్నిచటకు బంపితినినీ విచట జూచిన నా రూపము షిరిడీలో జూసిన నా రూపముతో సమానముగనున్నదో లేదో నిర్ధారింపుము. " బాబా ;  : 31

అయ్యోతాత్యా మనకంటె ముందు వెళ్లిపోయెనుఅతనికి పునర్జన్మ లేదు." బాబా : 31

అడవుల సంగతులు పూర్తిగా తెలియకుండ మీ ఇష్టము వచ్చినట్లు తిరుగరాదుఅడవులలో సంచరించినచో మీవెంట  మార్గదర్శి యుండియే తీరవలెనుభోజనముజేసి నీరు త్రాగండి."  బంజారా : 32

మీతెలివి తేటలపై ఆధారపడి దారి తప్పితిరిచిన్నదానికిగాని పెద్దదానికిగాని సరియైన మార్గము జూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెనుఉత్తికడుపుతో అన్వేషణము జయప్రదము కాదు." బంజారా : 32

నాతో వచ్చుట కిష్టపడెదరామీకు కావలసినదేదో నేను జూపెదనునాయందు విశ్వాసమున్నవారికే జయము గల్గును."  బాబా గురువు ;  : 32

తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి."  : 32

నాగురువే నాకు సమస్తముగా దోచు చుండెనునా యిల్లు నా ఆస్థి  నా తల్లిదండ్రులు అంతయు వారేనా ఇంద్రియములన్నియు తమతమ స్థానముల విడచినా కండ్లయందు కేంద్రీకృతమయ్యెనునా ద్రుష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెనునా ధ్యానమంతము నా గురువుపైననే నిల్పితిని."  : 32

ఉపవాసము చేయవలసిన యవసరమేమిదాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లకు బెట్టి నీవు కూడ తినుము."  : 32

నా సర్కారుయొక్క ఖజానా నిండుగా నున్నదిత్రవ్వి ఈధనమును బండ్లతో తీసుకపొండుసుపుత్రుడైనవాడు  ద్రవ్యమునంతను దాచుకొన వలెను."   : 32

నేనెక్కడికో పోయెదనుమాయ నన్ను మిగుల బాధించుచున్నదిఐనప్పటికీ నావారికొరకు నేనుఆతురపడెదను."   : 32

ఊది  వివేకమునుదక్షిణ వైరాగ్యమును బోధించును.   : 33



నారాయణ మోతిరాం జానీ, ఊది రాసిన చేయి తీసివేయగనే నొప్పి తగ్గిపోయెను : 33

నానాసాహెబు తన భార్యను బిలచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి  హారతిని పాడుమనిరికొద్దినిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను : 33

శరీరమున్నన్నాళ్లు బాబా బ్రతికి యుండిరాశరీరము పోయినదిగాన చనిపోయినారాలేదుఎల్లప్పుడు జీవించియే యున్నారుబాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించినచో వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు."   : 33

నేనీతనని నాలుగు సంవత్సరములనుండి ఎరుగుదును." అనిరితీవ్రముగా ఆలోచించగా బాలబువ సుతార్ కు, 4  సంవత్సరముల క్రిందట తాను  బాబాఫోటోకు నమస్కరించినటుల జ్ఞప్తికి వచ్చెను : 33

ఫకీరు అప్పాసాహెబు కులకర్ణి నుండి పదిరూపాయల నోటు పుచ్చుకొనితొమ్మిదిరూపాయలు తిరిగి ఇచ్చివేసి యక్కడినుండి వెడలెను : 33

యోగేశ్వరులందరు ఏకాత్మభావముతో కార్యము లొనర్తురుహరిభావ్ కర్ణిక్ నుండి నరసింగ మహరాజ్ రూపాయి దక్షిణ పొందిరి : 33

ఎవరయితే  మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో  వ్యాధిచేతను బాధపడరు." బాబా : 34

ఇంకను నన్ను నమ్మవా? "  డాక్టరుకు 3 రాత్రులు కంఠధ్వని వినిపించెను : 34
అతడేల పది జన్మలవరకు బాధపడవలెనుపదిరోజులలో గతజన్మ పాపమును హరింపజేయగలను. "   : 34

మన కష్టసుఖములకు  మన కర్మయే కారణముఅల్లాయే ఆర్చి తీర్చువాడువాని నెల్లప్పుడు ధ్యానించుడుఅతడే నీ క్షేమమును జూచును."  : 34

దేవాఏమి నీ యాటమొట్టమొదట తుఫానులేపి మాకు అశాంతి కలుగజేసెదవుతిరిగి దాని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు." శ్యామా బాబాతో ;  : 34

ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమేకాకామహాజని స్నేహితుడు పలికివెంటనే మసీదు లోపలికివెళ్ళితన మనోనిశ్చయమును మరచినవాడైబాబా పాదములకు నమస్కరించెను.  
 : 35


బాబా " నీకిచ్చుటకు మనమున నిష్టము లేకుండెనుకాన నిన్నడుగలేదుకాని , ఇప్పుడు నీకిష్టమున్నయెడల ఇవ్వవచ్చుననెను : 35

బాబా " నీవు దానిని తీసివేయుముమనకు మధ్యనున్న యడ్డును తీసివేయుముఅప్పుడు మన  మోకరికొకరు ముఖాముఖి చూచుకొనగలముకలిసికొన గలము!"   : 35

బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపళ్ళను గింజలులేనివానిగా మార్చివేసెనుఏమి ఆశ్చ్యర్యకరమైన శక్తికాకామహాజని యజమాని : 35

అతని మనస్సుకు నిలకడలేకుండెనుఅతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కిష్టము వచ్చినచోట నీ నమ్మకము పాదుకొల్పుముఎందుకిట్లు భ్రమించెదవుఒకేచోటు నాశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పితిని : 35

నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనుంచిగాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెనుదక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. "   : 35

భయపడకుముఇది మనదికాదుఇది సాయి యాహారమేఅన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుమువానిలో కొంచెము ఊది వేయుముగుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుముసాయి మనలను కాపాడును." బాలాజీ నెవాస్కరు తల్లి మాటలు.   : 35

తీవ్రముగా ప్రార్ధించినచో యధా ప్రకారము ఫలితమును పొందవచ్చును.   : 35

ఇదియేమిఇద్దరు కలిసి వచ్చిరిఒకరి దక్షిణ యమోదించితివిరెండవ వానిది తిరస్కరించితివిఎందులకీ భేదభావం? " బాబాతో శ్యామా ;  : 36

శ్యామాఎందులకో నీకేమియును తెలియదునేనెవరివద్ద ఏమియు తీసికొననుమసీదుమాయి బాకీని కోరునుబాకీయున్నవాడు చెల్లించిఋణవిమోచనమును పొందును. "  బాబా : 36

శ్యామా! 72 జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదుఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది." బాబా : 36

ఆమెకు 12 మాసములలో  సంతానము కలుగును." శ్యామాతో బాబా;   : 36

సాయి సముద్రము వలె గంభీరులుపురుషులను అన్నదమ్ములవలెస్త్రీల అక్కచెల్లెన్డ్రవలె చూచుకొనెడివారువారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు  నిలుచుగాకవారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక!   : 37



1910 డిసెంబరు 10 తేదినుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుప మొదలిడిరి.    : 37
చావడి సమయమున బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశము తోడనుసౌందర్యము తోడను వెలుగుచుండెను.   : 37

జడమగు చిలుము ధన్యమైనదిమొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెనుతుదకు అది బాబా ముద్దుకు హస్త స్పర్శకు నోచుకొన్నది.   : 37

నన్ను కాపాడుమునీకిష్టమున్నచో వెళ్లుము గాని రాత్రి యొకసారి వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము."   : 37

పవిత్ర ఆత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను."    : 38

దానములన్నిటిలో అన్నదానమే ప్రధానమైనదిఅన్నిపుణ్యములలో అన్నదానమెక్కువ.  : 38
బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపు చుండెడివారు.    : 38


ఒక ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొనితెమ్మనెను.   : 38

గురుసేవకు ముఖ్యముగా  కావలసినది అక్షరాల గురు ఆజ్ఞను పాటించుటే.   : 38

నా సహవాసము ఇన్నాళ్లు చేసియు నిట్లేల చేసితివి?" నానాతో బాబా.    : 38

అది యట్టి రుచిప్రేమశక్తి గలిగిన యాహారము.   : 38

దాని నంతయు త్రాగుమునీకిక మీదట ఇట్టి యవకాశము దొరకదు."    : 38

అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెనుకాని మనకు కావలిసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను.   : 38

షిరిడీ నుండు   స్త్రీలు ధన్యులుబాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనదిబాబామహిమను వారు స్నానము చేయునప్పుడువిసురునప్పుడురుబ్బునప్పుడు,  ధాన్యము దంచునప్పుడు , తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారువారి భక్తి ప్రేమలు పావనములువారు చక్కని పాటలు పాడుచుండెడివారుఅవి పాడినవారికి , విన్నవారికి మనఃశాంతి కలుగజేయు చుండెను : 39

నానాసాహెబు చాందోర్కరు తన పాండిత్యమునకు గర్వించుచుండెను : 39

భక్తుడు ఏగురువునైనను శ్రీకృష్ణునిగా   భావించును : 39

గురువు భాషాపరంగా బోధించు బోధయు అజ్ఞానమే ! అనుభవపరముగా అంతఃకరణములో కలుగజేయు జాగరణము   నిజమైన గురు బోధ : 39

బాబా నావద్దకు వచ్చి ఒకమందిరముతో సహా వాడాను నిర్మింపుమునేనందరి కోర్కెలు నెరవేర్చెద ననెను." బూటీతో శ్యామా : 39

వాడా పూర్తియైనపిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెనుమనమందర  మచ్చటనుందముఅందరు కలసి మెలసి యాడుకొందము."   : 39

మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియుబూటీవాడయె సమాధిమందిరమని గ్రహింపవలెను : 39

నన్నే గుర్తుంచుకొనువారిని నేను మరువనునాకు బండిగాని టాంగాగానిరైలుగానివిమానముగాని అవసరము లేదునన్ను ప్రేమతో బిలుచువారి యొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను." జోగుతో బాబా   : 40

హావాగ్దానము జేసిదగా చేసితి ననుచున్నాడుఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితినికాని నన్ను పోల్చు కొనలేకపోయెనని వ్రాయుముఅట్టివాడు నన్ను పిలువనేల? " జోగుతో బాబా   : 40

1917  సంవత్సరము హోళీ పండుగనాడు వేకువఝామున హేమాడ్ పంతుకు స్వప్నంలో ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను : 40

భోజన స్థలము విడిచి పెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివికావున ఇదిగో నీవస్తువును నీవు తీసుకొనుము తరువాత వివరించెదము."  ఆలీమహమ్మద్మౌలానా హేమాడ్ పంత్తో    : 40

 పటమును బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్ధములన్నియు వడ్డించినైవేద్యము పెట్టిన పిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తిజేసిరి : 40

నేను నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొనియున్నానుఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలనీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని 
యున్నదా ? "  దేవ్ తో బాబా   : 41

నీ వాతురపడవద్దునీ చావు చీటి తీసివేసితినిత్వరలో బాగుపడెదవు కానితాత్యాకోతే పాటిలుగూర్చి సంశయించుచున్నానుఅతడు 1918  సంవత్సరము విజయదశమినాడు మరణించును."  : 42

అనవసరముగా విచారించెదవేలకుక్క యాకలి దీర్చుట నా యాకలి దీర్చుటవంటిదిఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే! "  లక్ష్మీబాయి షిండే తో బాబా    : 42

ఇటుక కాదునా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినదిఅది నా జీవితపు తోడునీడదాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడనుఇరోజు అది నన్ను విడచినది." బాబా భావము   : 43-44

నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుమునేను తిరిగి వచ్చినట్లయిన సరేలేనియెడల నా శరీరము  నేదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము."  మహాల్సాపతితో బాబా    : 43-44


ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరునేను లేక వానికి జగత్తంతయు శూన్యమునా కథలు తప్ప మరేమియు చెప్పడునన్నే ధ్యానము చేయునునా నామమునే సదా జపించును. "  బాబా అమృతతుల్యమగు మాటలు.   : 43-44

ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరోఎవరు దానిని భక్తితో వినెదరోఉభయులును సాయితో నైక్యమగుదురు.  హేమాద్రిపంత్   :  : 43-44


 ఎవరయితే వారి యదృష్టముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు నిరాశ చెందనేల? అ : 45

వేయేల! హృదయపూర్వకముగా నీగురువును ప్రేమించుము. వారిని సర్వశ్య శరణాగతి వేడుము. భక్తితో వారిపాదములకు మ్రొక్కుము. అట్లుచేసినచో సూర్యునిముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు. అ : 45

 మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మన దగ్గర నున్నది. ఏది యితరులదో , యది యితరులవద్ద నున్నది. అ : 45

నీవు నీశక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. అంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు.నీజీవితమునెవరు తెలియజాలరు. అ : 46

బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్లు అతని చెంతనేయుండి , యింటివద్దనుగాని,దూరదేశమునగాని వానిని వెంబడించు చుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని రూపమున నుండును.  అ : 46

' వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించు యున్నావా? ఛీ,సిగ్గులేదా! మీ ద్వేషముల విడచి శాంతింపుడు.' అ : 47


భక్తితోను ప్రేమతోను మన్ననతోను ఇచ్చిన చిన్నచిన్న మొత్తములకు దైవ మిష్టపడును. అ : 47

ఎవరికైన ఏమైన బాకియున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని శత్రుత్వశేషముగాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. అ : 47

" ఈ పాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీకష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు  నెరవేరును. అ : 48

" నానా! అనవసరముగా చికాకు పడుచుంటివేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొనగూడదు. .... మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియు దోషములేదు. అ : 49

" ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. ఆ నారికేళము  నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తనని యనుకొననేల?  అ : 50

" గత 60 తరములనుండి మనమొండొరులము పరిచయము గలవారము." అ : 50

సాయిని జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లు చేసెదరు. అ : 51

ఈభయంకర సంసారసాగరమునకు సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. అ : 51


శ్రీసాయికథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మికజీవితమునందు శ్రద్ధ కలుగును. అ : 51

ప్రేమతో పారాయణము చేసిన పాపములు నశించును, జనన మరణ వలయంనుండి విముక్తి కలుగును. ఇతరులకు చెప్పుటవలన కొత్తసంగతులు తెలియును, వినువారల పాపములు తొలగును. సాయిసగుణోపాసన ద్వారా ఆత్మసాక్షాత్కారానికి మార్గము దొరగును. వారము రోజుల పారాయణముచే వారి యాపదలు నశించగలవు. కోరినవారలకు ధనము లభించును. వ్యాపారము వృద్ధిచెందును. ఇవి వారి భక్తిశ్రద్ధలపై ఆధారపడియున్నవి. జ్ఞానము,ధనము,ఐశ్వర్యములు లభించును. రోజుకో అధ్యాయ పారాయణముచే యపరిమితానందము కలుగును. జాగరూకకతో పారాయణము చేయవలెను. ఈగ్రంధమును గురుపూర్ణిమ నాడు,గోకులాష్టమి నాడు,శ్రీరామనవమి నాడు,విజయదశమి నాడు ఇంటివద్ద తప్పక పారాయణము చేయవలెను, పారాయణము చేసిన వారల కోరికలన్నియు నెరవేరును. రోగులు ఆరోగ్యమును పొందెదరు. అ : 51

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!

సాయి పదాలు , గురూజీ శరత్ బాబూజి గారు రచించిన మధుర గీతాలు. 

ప్రాతఃదర్శనమివ్వుముసాయి 







Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)