దైవమునీవు

శ్రీసాయినాథాయనమః 

దైవమునీవు

దయగనవయ్యా  దేవాసాయి
దైవమునీవు  దీనుడనేను

కారణమీవు          కణమును  నేను
అక్షయుడీవు        క్షణికుడ నేను
అదియునీవు        అల్పుడనేను
కడలివినీవు          అలనే నేను                      || దయగనవయ్యా ||

దాతవునీవు          దాసుడ నేను
ప్రభువేనీవు           భృత్యుడ నేను
విఠలుడవీవు         వికలుడ నేను
విశ్వమునీవు         శూన్యుడ నేను              || దయగనవయ్యా ||


శ్రీసాయికరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!




Comments

  1. దీనుల దైవము సాయినాథుడు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)