సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన !
సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన !
నేడు గురుపౌర్ణమి
112 సంవత్సరములకు పూర్వము, అనగా 1917వ సంవత్సరమున గురుపౌర్ణమి రోజున ఠాణా జిల్లా దహను గ్రామానికి చెందిన భక్తుడు హరిభావ్ కర్ణిక్ బాబాను తగువిధమున పూజించి వస్త్రముల, దక్షిణల సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవుపొంది మసీదునుండి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళినపిమ్మట బాబాకు మరొక్క రూపాయి దక్షిణనివ్వాలనే భావంతో వెనుదిరిగాడు. అలా సెలవుపొందినపిమ్మట తిరిగిరావడం శిరిడీ సాంప్రదాయానికి వ్యతిరేకమని యచటి వారుచెప్పుటచే కర్ణిక్ తనప్రయాణం కొనసాగించాడు. మార్గమధ్యంలో నాసిక్ లోని కాలారాముని దర్శించుకొని మందిరమునుండి వెలుపలికి వచ్చునపుడు యచటనే వేంచేసియున్న నరసింగ మహరాజ్ యను యోగిపుంగవులు తమభక్తులవిడచి హరిభావ్ చేతిని పట్టుకొని తమరూపాయి తమకివ్వవలెనని పట్టుపట్టారు. మిగుల ఆశ్చర్య ఆనందాలకు లోనయిన కర్ణిక్ తాను సాయికివ్వదలచిన దక్షిణరూపాయిని నరసింగ్ మహారాజుకు సమర్పించాడు. యోగీశ్వరుల అంతరంగములు ఒకేస్థాయిలో వ్యాపించియుంటాయి, ఒకరిభావాల మరొకరు యతిసులువుగా గ్రహింపగలరను సత్యము నిచట నిరూపింపబడినది. యోగీశ్వరులకు జేసిన పూజ సాయిపూజ, వారికి సమర్పించిన దక్షిణ సాయికి దక్షిణ!
సాధు సత్పురుషులసేవ సాయికి ప్రియము! వారి యంతరంగములన్నియు ఒకే తలంపై యుంటాయి, భక్తులకు శ్రేయస్సు గూర్చుతాయి!
ReplyDelete