సాయి కథలు - సద్గురునితో పరిహాసమా?
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - సద్గురునితో పరిహాసమా?
ఓపర్యాయము సాయిబాబాకు భక్తుడొకరు దక్షిణగా రెండురూపాయలు మని ఆర్డర్ ద్వారా పంపాడు. ఆడబ్బు నందుకొన్న శ్యామా (బాబాకు అత్యంత సన్నిహిత ప్రియ భక్తుడు ) బాబాకివ్వకుండా దగ్గరలో దాచిపెట్టాడు. ఇదిజరిగిన ఆరుమాసములకు శ్యామా ఇంట్లో దొంగలు పడి ( 250 రూపాయల విలువుగల ) యాతనిసర్వస్వమూ దోచుకుపోతారు. పాలీసులద్వారా కూడ ఆడబ్బు ఆచూకీతెలియకపోవుటచే శ్యామా మిగుల దిగులుతో బాబావద్దకెళ్లి తన డబ్బంతా దొంగలు దోచుకున్నారు, సాయముజేయవలసినదిగా ప్రాధేయపడతాడు. అపుడు శ్యామాతో బాబా " అరే శ్యామా! నీడబ్బుపోతే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను, కాని ఆరుమాసాలక్రిందట పోయిన ఈ ఫకీరు రెండురూపాయలగూర్చి ఎవరికి చెప్పుకోను ? " యనగా తనతప్పు గ్రహించిన శ్యామా నిరుత్తురడవుతాడు. చూసాముకదా మరి సద్గురునిపట్ల అపచారమూ, పరిహాసమువలన శ్యామా ఎంత నష్టపోయాడో! సాయి అనుగ్రహిస్తే రూపాయకు వందరూపాయలనిస్తాడు కాని ఆగ్రహిస్తే వందరూపాయల వసూలుజేస్తాడు. కావున ఈవిషయమున భక్తులెంతో జాగరూకులై వ్యవహరింపవలె. ఎంతవారలైనను కర్మఫలమనుభవింపక తప్పదుకదా!
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
సద్గురు సామర్ధ్యాలను కలనైనా శంకింపరాదు, వారిపట్ల భక్తిశ్రద్ధల పలుచబడనీయరాదు !
ReplyDelete