సాయి కథలు - శ్రద్ధ !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - శ్రద్ధ
నేడు గురుపౌర్ణమి
ఏవిషయంపైనను పట్టు సాధించాలంటే ఆ విషయంపై మిగుల శ్రద్ధ జూపటం మిగుల ఆవశ్యకం. ఉదాహరణముగా విద్యపట్లగాని, ధనసంపాదన పట్లగాని, లేక ఏదైనా కార్యసాధనపట్లగాని మిగుల శ్రద్ధజూపనిదే లక్ష్యమును జేరలేము. మరి ఆధ్యాత్మిక విషయాలకొస్తే లక్ష్యసాధనకు మరింత శ్రద్ధ అవసరము. అందులకే సాయిబాబా శ్రద్ధ-సహనముల గూర్చి మరీమరీ చెప్పారు. శ్రద్ధకు సంబంధించి శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పబడిన ఒక ఉదాహరణమునిచట పరిశీలించెదము.
1910వ సంవత్సరము దీపావళి ముందురోజైన ఘనత్రయోదశి నాడు జరిగిన విషయం, బాబా మండుచున్న ధునిలో తమ చేయిదూర్చి ఎంతో దూరాన కొలిమిలో బడనున్న బిడ్డను రక్షించారు. బిడ్డ రక్షింపబడినదిగాని, బిడ్డకర్మఫలంచే బాబా చేయి మిగుల కాలిపోయినది. ఈవిషయంతెలిసిన బాబాప్రియ భక్తుడు నానాసాహెబు చాందోర్కరు బొంబాయినుండి డాక్టరు పరమానందు యను ఖ్యాతిగాంచిన వైద్యుని వెంటనిడుకొని వచ్చారు. కాని సాయిబాబా తమకేమాత్రము బాధలేదని వానిసేవల తిరస్కరించారు. ఈసంఘటన తరువాత ప్రతిరోజు భాగోజీ షిండే యను సన్నిహిత భక్తుడు బాబాచేతికి కట్టుకట్ట నారంభించాడు. కొన్నిరోజులకు బాబాచేతిగాయం పూర్తిగా మానిపోయినది. అందరు సంతోషించారు. అప్పటికి నొప్పి ఏమైనా మిగిలియున్నదా యనువిషయము యెవ్వరికీ తెలియదుగాని, ప్రతిరోజు ఉదయం భాగోజీ బాబాచేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడి వాడు. ఇది వాని దినచర్యలో ఓ భాగమైనది.
శ్రద్ధ, సహనములనెడి రెండు కాళ్ళతొ నడచి సాయిసన్నిధిచేరుకోవాలి!
ReplyDelete