సాయి కథలు - నారికేళ మహిమ !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - నారికేళ మహిమ

నేడు గురుపౌర్ణమి 

సఖారాం ఔరంగాబాద్ కర్  మహారాష్ట్రలోని షోలాపూర్ నివాసి. వాని భార్యకు 27 సంవత్సరాలైనను బిడ్డలు పుట్టలేదు. పెక్కువ్రతములాచరించినను ఎట్టి ఫలితం లభింపకపోవుటచే తన సవతి కొడుకు విశ్వనాథునితో శిరిడీకి వచ్చినది. శ్యామాసహాయంతో ఒంటరిగానున్న బాబాను సమీపించి కొబ్బరికాయ, అగరవత్తులు సమర్పించింది. సాయి ఆటెంకాయను ఆడించెను. అదిఎండుదికనుక కుడుక  లోపల ఆడుటచే శబ్దము వచ్చుచుండెను. ఆ శబ్దానికి అర్ధమేమని శ్యామా నడిగారు. తన గర్భంలోగూడ ఓబిడ్డ అటులనే ఆడవలెనని  కోరుకొనుచున్నది కావున తమ ఆశీస్సులతో టెంకాయను  యామెకివ్వవలసినదని శ్యామా బదులిచ్చాడు.ఈవిషయముపై  వారిద్దరిమధ్య కొంత సంవాదము జరిగిన పిమ్మట, బాబా ప్రసన్నులై యామెకు సంవత్సరములోపున సంతానము కలుగునని ఆశీర్వదించారు. టెంకాయ పగులగొట్టి ఓచిప్ప వారివురుతిని రెండవచిప్పను ఆశీసులతో ఆమెకిచ్చారు. సాయి దీవెనలచె ఒక సంవత్సరములో ఆమెకు కొడుకు పుట్టాడు. 5వ మాసంలో బాబా ఆశీసులకై  బిడ్డను తెచ్చి గురుపాదముల ప్రణమిల్లారు. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలివ్వ బాబాగుఱ్ఱము శ్యామకర్ణకు శాల నిర్మించారు.
సపత్నేకర్ యనుభక్తుడు బాబాఆశీసుల టెంకాయతో  సంతానఫలము పొందుట  శ్రీసాయిసచ్చరిత్రము  వేరొక అధ్యాయములో చెప్పబడినది.

వేరొక సందర్భంలో రాజమండ్రిలో మకాంజేసిన శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామివారు తమను చూడవచ్చిన పుండలీకరావునకు ఓటెంకాయనిచ్చి తమ   నమస్కారములతో బాబాకు సమర్పింపవలసినదిగా చెప్పారు. కానిమార్గమధ్యంలో  పొరపాటున అదేకొబ్బరికాయను పుండలీకరావు పగులగొట్టి తన మిత్రులతో పంచుకున్నాడు. శిరిడీ జేరిన పుండలీకరావు తానుజేసిన తప్పుకు భయపడుతూ బాబావద్దకెళ్లాడు. వెనువెంటనే సర్వమునెరిగిన  సాయి తమసోదరుడు పంపిన కొబ్బరికాయను కోరారు.  తనతప్పునెరిగిన పుండలీకరావు బాబాను క్షమార్పణ వేడి వేరొక టెంకాయతెచ్చెదనన్నాడు. కాని ఆటెంకాయ ఎంతోవిలువైనదనియు, దానికి  మరేదీ సమతుల్యం కాదని చెబుతూ ఆ ఘటన పూర్వాపరాలకు  తామే సూత్రధారుల మనియు, నిమిత్తమాత్రుడగు పుండలీకరావు బాధపదవలదని బాబా చెప్పారు.

ప్రియపాఠకులకు మరొక్క గమనిక: రచయితకు శిరిడీలోని గురుస్థానమువద్ద సాయిబాబా ప్రసాదంగా ఓ నారికేళము లభించిన యనుభవ వివరములను  ' saileelatelugu.blogspot.com ' dated , August 24, 2018 న చూడగలరు. 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


Comments

  1. నారికేళమును తమ ప్రసాదంగా భక్తులకిచ్చి ఎందరో మనోరధాల పూరించారు సద్గురు సాయినాథులు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)