నాసిక్ జిల్లా, మాలేగాం లో నివేసించే వైద్యుడు. వానిమేనల్లుడు నయంకాని రాచకురుపుచే బాధపడుచున్నాడు. డాక్టరుతో పాటు ఇతర డాక్టర్లుకూడా నయంచేయలేకపోయారు. తుదకు పిల్లవాని తలిదండ్రులు బాబాను శరణువేడారు. బాబా కృపచే మేనల్లుడు రోగముక్తుడైనాడు. ఈవిషయం తెలిసిన డాక్టరు మిగుల ఆశ్చర్యపడ్డాడు. మాలేగాం నుండి శిరిడీ మీదుగా బొంబాయి వెళ్ళుమార్గమధ్యలో సాయిబాబాను దర్శింప దలచాడు డాక్టరు. కాని మాలేగాం, మన్మాడులలో బాబానుగూర్చి కొందరు వ్యతిరేకంగా చెప్పుటచే తనమనసు మార్చుకున్న డాక్టరు నేరుగా బొంబాయి వెళ్ళాడు.
తానున్న బొంబాయిలో వరుసగా మూడురాత్రులు " ఇంకను నను నమ్మవా " యనుమాటలు వినిపించుటచే మరల మనసుమార్చుకొని శిరిడీ వెళ్ళ సంకల్పించాడు.
తనమనసులో సాయిని పరీక్షింపదలచి, తానుఁజూచుచున్న రోగి అదేరోజున బాగయిన మరుసటి దినమే శిరిడీ వెళ్ళ దలచాడు . ఆశ్చర్యకరంగా రోగి బాగాగుటచే డాక్టరు అనుకొన్నవిధంగా బాబాను దర్శించి మిగులభక్తిశ్రద్ధల నమస్కరించి ఆసీసులు పొందాడు. తనకు చక్కటి అనుభవములు కలుగుటచే మంచి భక్తుడైనాడు. నాలుగురోజులు శిరిడీలో గడిపి ఊది ప్రసాదములు, బాబా ఆశీసులతో ఇంటికి జేరాడు. పక్షం రోజుల్లో హెచ్చుజీతంపై బీజాపూరుకు బదిలీ యైనాడు. మేనల్లుని రోగమావిధంగా బాబా దర్శనానికి తోడ్పడినది. తమకు గలిగిన అనుభవములను ఆసరాగా గ్రహించి సాయిపట్ల నమ్మకము పెంపొందించుకొనుట భక్తులకెంతో మేలుగదా!
శ్రీసాయినాథాయనమః సాయి బోధ - ఈశోపనిషత్తు దేహ ఆరోగ్యానికి, పోషణకు, ఎదుగుదలకు ఆహారపువిలువలతోకూడిన పౌష్టిక ఆహారము మిక్కిలి ఆవశ్యకము. అలాగే తిన్నటువంటి ఆ ఆహారమును బాగుగా జీర్ణించుకొనవలెను, లేనియెడల అజీర్ణవ్యాధిచే ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును. ఇదేవిధంగా పుస్తక లేక గ్రంథపఠనముకూడ. చదివిన మంచి విషయముల భావమునెఱిగి తదనుగుణంగా ఆచరించినయెడల ప్రయోజనముంటుందికాని, కేవలం అర్ధం తెలియని పఠనం వ్యర్థం, పైపెచ్చు యెంతో తెలుసుననెడి గర్వం తలెత్తే ప్రమాదముంది. సరిగ్గా దీనిని పోలిన ఓ సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములో చూడగలము. దాసగణు మహరాజు, గొప్పసాయి భక్తుడు, కీర్తనకారుడు. ఓ పర్యాయం యితడు సంస్కృత భాషలోని ఈశావాస ఉపనిషతును మరాఠీభాషలోని ఓవీ ఛందస్సులోనికి అనువదించాడు. (గ్రంధంలో ఆత్మ తత్వముగూర్చి వివరింపబడినది.) కాని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన విషయ సారాంశము వానికి సరిగా బోధపడలేదు, పండితులతో చర్చించినప్పటికి సరియైన సమాధానం లభింపకపోవుటచే ఆత్మసాక్షాత్కారము పొందిన సద్గుఫు సాయినాథుని దర్శించి తన సమస్యను వివరించి వివరణకై వేడుకొన్నాడు. బాబా వాని నాశీర్వదించి యిట్లన్నార...
సాధారణ వ్యక్తులలో భక్తివిశ్వాస బీజములనాటి తమభక్తులుగా మార్చుట సాయిలీల !
ReplyDelete