Posts

Showing posts from August, 2019

సాయి కథలు - శిరిడీ ఆరతులు

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - శిరిడీ  ఆరతులు  శ్రీసాయి విశ్వంలోని చరాచర జీవులందరిలో విలసిల్లు చైతన్య దీప్తులు. వ్యక్తుల అంతరంగాల చైతన్య పరచి తమ కార్యముల నెరవేర్చుకొనెడి కుశల కర్ములు సమర్ధ సాయినాథులు. ఈ సత్యాన్ని సమాధిమందిర నిర్మాణంలోను, తమ సమాధికెదురుగా  నిలువెత్తు సమ్మోహన, సజీవ శిల్పస్థాపనలోను, సాయి మందిరాల్లో నిత్యం పాడుకొనే ఆరతుల రచనలలోనూ మనం చూడగలం. అరతుల వెనుక సాయి ప్రేరణ యెలాంటిదో ఇపుడు పరిశీలిద్దాం. " నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908 లో ఒకరాత్రి కలలో ఒక  నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద " సచ్చిదానంద " అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని సద్గురుని నామమని చెప్పాడు. తర్వాత అతడు శిరిడీ వచ్చినపుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి  " జై సచ్చిదానంద "  అన్నారు. అతనాశ్చర్యపోయి తనకు స్వప్న దర్శన మిచ్చిన గురువు వీరేమోననుకొన్నాడుగాని , వారు వైష్ణవులు, సాయి ముస్లిం గదాయని శంకించాడు. ఒకరోజు సాయి , " మేము సర్వత్రా సంచరించుచున్నాము  బొంబాయి, పూణే , నాగపూర్ మొదలగు ప్రదేశాలన్నీ రామ మయమే. తెలిసిందా మిత్రమా? నీవు ఐద...

సాయి కథలు - ఏడురోజులలొ ముక్తి !

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - ఏడురోజులలొ ముక్తి ! ఏడురోజులలోనే ముక్తి, ఇది సాధ్యమా యని తలచువారికి మనపురాణాల్లో జెప్పబడిన  ఓ ప్రసిద్ధ ఘటనను పెద్దలు చెబుతుంటారు.  అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు మహరాజు  మునిబాలుని శాపానికి గురై కేవలం మరొక్క ఏడురోజులలోనే మరణిస్తానని గ్రహిస్తాడు. అంత తక్కువ వ్యవధిలో  తానుముక్తి పొందుటకు భాగవత శ్రావణమే అతి సమీప మార్గముగా తెలిసికొని , వ్యాసమహర్షి పుత్రుడైన బ్రహ్మజ్ఞాని శుకమహర్షి ద్వారా ఆ పవిత్ర గ్రంథ శ్రవణాన్ని మిగుల భక్తి శ్రధ్ధలతోడను, తీవ్ర వ్యాకులతోను ఏడురోజుల్లో పూర్తిజేసి ముక్తిని పొందుతాడు. ఆయన శ్రవణము గొప్ప తపస్సులా కొనసాగింది. పై సంఘటనను పోలిన కథయొకటి శ్రీ సాయి  సచ్చరిత్రము 18-19 అధ్యాయములలో చూస్తాము. సాఠేయనునతడు మిక్కిలి పలుకుబడి కలిగియున్న వ్యక్తి. జీవితంలో ఒడిదుడుకులు సహజం, కాలాంతరంలో యతడు వ్యాపారంలో మిగుల నష్టాన్ని పొందుతాడు. దానికితోడు మరిన్ని చికాకులు, సమస్యలు చుట్టుముట్టుటచే తీవ్రమనోవ్యాకులతకు గురియై విరక్తి చెందుతాడు. ఆ సమయంలో సాఠే తన స్నేహితుని ద్వారా సాయి బాబాను గూర్చి వింటాడు. తన సమస్యల పరిష్కారానికి, ...

సాయి కథలు - బోర్లించిన కుండలు !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - బోర్లించిన కుండలు !  " దాసగణు శిరిడీ వెళ్లుచుంటే కోపర్గావ్ లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చిఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగణు వానిని శిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్ తో, '  నాదగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి ' అన్నారు. అంధ మైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతోగాని లేక కనీసం జిజ్ఞాసతోగాని వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు, వాటిని నింపవచ్చు. కాని చిత్రం ,  ఆమాటతో సాయి అతని హృదయమనే కుండను సరిజేశారు. విశ్వాసంతో నింపారు." కుండపోత వర్షం కురిసినా బోర్లించిన కుండలోనికి ఓ చుక్క  నీరు వెళ్ళనటుల భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు లేక సాయిని సమీపించినా వాని  హృదయంలోకి గురుకృప ప్రవేశించదు! మూలం, శ్రీసాయి లీలామృతము :  పూజ్య ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

సాయి కథలు - మురళీధరుడే సాయినాథుడు !

Image
శ్రీసాయినాథాయనమః   సాయి కథలు -  మురళీధరుడే సాయినాథుడు ! నేడు శ్రీకృష్ణాష్టమి  " ఒంగోలు లోని శ్రీమతి సీతారామ్మూర్తిగారు కృష్ణభక్తురాలు. సత్సంగాలలో పాల్గొనుచు మంచి అనుభవాల పొందియున్నారు. ఆమె  " శ్రీ సాయి లీలామృతము " చదివి ,  సాయి శ్రీకృష్ణుడుగా  దర్శనమివ్వలేదని అనుకొన్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం కృష్ణవర్ణంగా (నీలిరంగుగా) మారిపోయింది. పూజలో లోపంవలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటిరాత్రి సాయి కలలో కన్పించి , " నేను వస్తే భయపడతావేమి? నా తలపై మూడు పువ్వులుంచి పూజచేయి, రేపు వెళతాను" అన్నారు. ఆమె అలానే చేసారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మాములుగా  వచ్చేసింది1 సాయికి వారిపటానికి , కృష్ణునికీ తేడాలేదు. శ్రీ సాయి లీలామృతము: పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ బూటీవాడలో  మురళీధరవిగ్రహాన్ని  స్థాపింపదలచిన స్థానంలో సాయిబాబా దేహాన్ని సమాధిజేశారు, సాయియే మురళీధరుడు! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

శ్రీసాయికృష్ణలీలామృతము !

Image
శ్రీసాయినాథాయనమః  పాఠక   సాయిబంధువులందరికి    హృదయపూర్వక   జన్మాష్టమి   శుభాకాంక్షలు ! ముందుమాట ! శ్రీకృష్ణ   జన్మాష్టమి  1994  వ   సంవత్సరములో   ఆగష్టు  29  వ   తేదీన   వచ్చినది . షుమారు ఓ నెలరోజులముందుగ    ఓ   ఆలోచన   కలిగినది .  సాయిబాబా   ఎన్నో   మహిమలు ,  లీలలు   చూపారు .  అలాగే   శ్రీకృష్ణ   పరమాత్మకూడ   బాలప్రాయంలోనే   ఎన్నెన్నో   అద్భుత   లీలలు   చూపారు .  సాయిబాబా   బూటీ   వాడలోని   మురళీధరుడుగదా !   మరి   శ్రీకృష్ణ   లీలలకు  ,  బాబా   లీలలకు   ఏమైనా   పోలికలున్నాయా   అనే   తలంపు   వచ్చినది .  ఆ   ఆలోచన   కలిగిన   రెండు   రోజుల   తర్వాత   ఈనాడు   పేపర్   చదువుతున్నాను .  కొన్నిపేజీల   తర్వాత   ఓ   పేజీలో   క్రిందభాగంలో   శ్రీకృష్ణ   లీలల   సచిత్ర...