సాయి కథలు - శిరిడీ ఆరతులు
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - శిరిడీ ఆరతులు
శ్రీసాయి విశ్వంలోని చరాచర జీవులందరిలో విలసిల్లు చైతన్య దీప్తులు. వ్యక్తుల అంతరంగాల చైతన్య పరచి తమ కార్యముల నెరవేర్చుకొనెడి కుశల కర్ములు సమర్ధ సాయినాథులు. ఈ సత్యాన్ని సమాధిమందిర నిర్మాణంలోను, తమ సమాధికెదురుగా నిలువెత్తు సమ్మోహన, సజీవ శిల్పస్థాపనలోను, సాయి మందిరాల్లో నిత్యం పాడుకొనే ఆరతుల రచనలలోనూ మనం చూడగలం. అరతుల వెనుక సాయి ప్రేరణ యెలాంటిదో ఇపుడు పరిశీలిద్దాం." నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908 లో ఒకరాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద " సచ్చిదానంద " అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని సద్గురుని నామమని చెప్పాడు. తర్వాత అతడు శిరిడీ వచ్చినపుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి " జై సచ్చిదానంద " అన్నారు. అతనాశ్చర్యపోయి తనకు స్వప్న దర్శన మిచ్చిన గురువు వీరేమోననుకొన్నాడుగాని , వారు వైష్ణవులు, సాయి ముస్లిం గదాయని శంకించాడు. ఒకరోజు సాయి , " మేము సర్వత్రా సంచరించుచున్నాము బొంబాయి, పూణే , నాగపూర్ మొదలగు ప్రదేశాలన్నీ రామ మయమే. తెలిసిందా మిత్రమా? నీవు ఐదు లడ్డులివ్వాలి " అన్నారు. మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లుబికి వెంటనే రెండు పాటలు వ్రాశాడు. కాని , ఆపై ఒక్కటిగూడ నడవలేదు. వాటిని సమర్పించగానే, సాయి అతనినే పాడి విన్పించమన్నారు. అతను పాడాక అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళీ స్ఫూర్తి గలిగి , మరి మూడు పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి శిరిడీ హారతులు. సాయి యిలా కోరి, తమ తపశ్శక్తి ధారవోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకొన్నవి. తర్వాత దాసగణు, మాధవుడు మరికొన్ని పాటలు చేర్చి నేటి శిరిడీ ఆరతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకోవడమెంతో శ్రేయస్కరం. "
శ్రీ సాయి లీలామృతము : పూజ్య ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ
శిరిడీ ఆరతుల వెనుక సాయినాథుని ప్రేరణ, ఆశీసులున్నాయి కావున భావమెరిగి పాడుకొనుట భక్తులకెంతో శ్రేయస్కరం !
ReplyDelete