సాయి కథలు - బోర్లించిన కుండలు !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - బోర్లించిన కుండలు !

 " దాసగణు శిరిడీ వెళ్లుచుంటే కోపర్గావ్ లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చిఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగణు వానిని శిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్ తో, '  నాదగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి ' అన్నారు. అంధ మైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతోగాని లేక కనీసం జిజ్ఞాసతోగాని వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు, వాటిని నింపవచ్చు. కాని చిత్రం ,  ఆమాటతో సాయి అతని హృదయమనే కుండను సరిజేశారు. విశ్వాసంతో నింపారు."
కుండపోత వర్షం కురిసినా బోర్లించిన కుండలోనికి ఓ చుక్క  నీరు వెళ్ళనటుల భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు లేక సాయిని సమీపించినా వాని  హృదయంలోకి గురుకృప ప్రవేశించదు!
మూలం, శ్రీసాయి లీలామృతము :  పూజ్య ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!



Comments

  1. బోర్లించిన కుండలో బొట్టు నీరునిల్వదు, శ్రధ్ధహీన హృదయంలో దైవకిరణం ప్రసరించదు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)