సాయి కథలు - బోర్లించిన కుండలు !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - బోర్లించిన కుండలు !
" దాసగణు శిరిడీ వెళ్లుచుంటే కోపర్గావ్ లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చిఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగణు వానిని శిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్ తో, ' నాదగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి ' అన్నారు. అంధ మైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతోగాని లేక కనీసం జిజ్ఞాసతోగాని వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు, వాటిని నింపవచ్చు. కాని చిత్రం , ఆమాటతో సాయి అతని హృదయమనే కుండను సరిజేశారు. విశ్వాసంతో నింపారు."కుండపోత వర్షం కురిసినా బోర్లించిన కుండలోనికి ఓ చుక్క నీరు వెళ్ళనటుల భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు లేక సాయిని సమీపించినా వాని హృదయంలోకి గురుకృప ప్రవేశించదు!
మూలం, శ్రీసాయి లీలామృతము : పూజ్య ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ
బోర్లించిన కుండలో బొట్టు నీరునిల్వదు, శ్రధ్ధహీన హృదయంలో దైవకిరణం ప్రసరించదు !
ReplyDelete