సాయి కథలు - సాయితొ ఉన్నతజన్మలు
భక్తుల చెడు సంస్కారాల హరించి వారిని ఉన్నత జన్మల వైపుకు నడిపించడానికి సంకేతంగా సాయిబాబా ద్వారకామాయిలొ మధ్యాహ్న సమయాన తాము ఒంటరిగా వున్నపుడు తెరగట్టి దానిచాటున పాత నాణాల చేతి వేళ్ళతో రుద్దేవారట. ఎవరైనా గమనిస్తె ఆపని ఆపేసేవారట. అతికొద్దిజన్మలలో ముక్తిసాధించలేము గనుక జన్మజన్మలకు సాయి సహాయం భక్తులకు యెంతో ఆవశ్యకము. పరిశుద్ధ సంస్కారాలతొ, పరమపద సోపానపటంలోని నిచ్చెనలా సాయి మనజీవితాలను పవిత్రమయం జేస్తారు. సాయితో కలసి జీవించినా వారిపట్ల భక్తిశ్రద్ధల కోల్పోయిన అదృష్ట హీనులు కొందరు పామునోటబడి పాతాళానికి పడిపోతారు.
పూర్వజన్మలగూర్చి భక్తులతో వేరు వేరు సందర్భాలలో వెలిబుచ్చిన సాయిజన్మాంతర జ్ఞానాన్ని పరిశీలించెదము. తమ ప్రియ సన్నిహితభక్తుడు శ్యామాతో తమది 72 జన్మలబంధమని పలికారు. పురంధరేతో తమది 7 శతాబ్దాల అనుబంధమని తెలియపరిచారు. అటులనే ధురంధరేను 60 తరములనుండి యెరుగుదమని ద్వారకామాయిలోని తోటి భక్తులకు చెప్పారు. శ్రీమతి ఖాపర్డే జన్మపరంపరలు మిగుల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమె ప్రధమంగా ఓవర్తకునింట ఆవుగా జన్మించి సాయికి పాలను మిగుల సమకూర్చినది. ఆపై క్రమంగా ఒకతోటమాలి ఇంట్లోను, క్షత్రియుని యింటిలోను చివరకు బ్రాహ్మణుని యింటిలోను జన్మించి సాయికి ప్రస్తుతజన్మలొ మంచి భోజనం సమకూర్చినది. అందులకే ఆమెతెచ్చిన భోజనాన్ని మిగుల ఆదరణ ఆతురలతో ఆరగించారు. సమాధి మందిరం నిర్మించిన నాగపూరుకు చెందిన గోపాలరావు బూటీ అల్లునితో నార్కేతో తమది 30 జన్మల అనుబంధమని పలికారు. యశ్వంతరావు పూర్వజన్మలో పవిత్ర జీవనం గడిపాడు గావున ప్రస్తుతమీ తల్లిగర్భాన జన్మిమ్ప జేసామని జెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కొందరి బుద్ధులు మారవు, కళ్యాణ్ కు చెందిన కార్నిక్ అటువంటివాడనియు, రెండువేల సంవత్సరాలైనా వాని కోతిబుద్ధులు మారలేదని చెప్పారు.
మద్రాసు సన్యాసి విజయానందు, మేఘా, మాన్కర్, నూల్కర్ ల పూర్వ జన్మల గూర్చి చెప్పనప్పటికి ప్రస్తుత జన్మలో సాయి చరణాల చెంత తుదిశ్వాస విడచి సద్గతి పొందారు. కాని పూర్వజన్మలో సాయికి సహచరులైన అన్నదమ్ములు వైరంతో పరస్పరం చంపుకొని ప్రస్తుతజన్మలో మేకలుగా పుట్టి తమ మానవజన్మను కోల్పోయారు. వీరభద్రప్ప చెన్నబసప్పలు తమపూర్వజన్మల వైరంచే పాముకప్పలుగా జన్మించి అధోగతి పాలయ్యారు. సాయిపథంలో పయనించి జన్మోన్నతులకు ప్రయత్నిద్దాం. సాయివైపు మనం ఒక్క అడుగు వేస్తె ఆయన మనవైపు వంద అడుగులు వేస్తారనేది సత్యవాక్యం!
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!

పరమపదలబ్ధికి ఎన్నిజన్మలెత్తవలెనో కదా? జన్మ జన్మల బంధువు సాయినాథులు, అన్నిజన్మలలోను వారి రక్షణ యెంతో ఆవశ్యకము. మంచివార్తేమంటే " నావాణ్ణి నేను మధ్యలో విడువ " ననేది సాయిదేవుల అభయ వాక్యం!
ReplyDelete