సాయి కథలు - సాయియే గణపతి !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - సాయియే  గణపతి 

ప్రియ పాఠకులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు! 

శ్రీసాయినాథులు సర్వ దేవతా స్వరూపులని భక్తులకు అనుభవము కలిగించారు. రామునిగా, కృష్ణునిగా, పాండురంగనిగా, దత్తాత్రేయునిగా మరెన్నో దేవరూపులుగా  భక్తులెందరో సాయిని గాంచారు. ఇదేక్రమంలో తామే గణపతియని  కొందరి శ్రద్ధాళువులకు తెలియబలికారు. శ్రీసాయిసచ్చరిత్రము రచయిత హేమాడ్ పంతు సాయిని గణపతిగా స్తుతించాడు. ఇచట కొందరి అనుభవముల పరిశీలిద్దాము.
" చిదంబరరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు శిరీడీ దర్శించినప్పటినుండి యింటిదగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఓ రోజతడు శిరిడీ వచ్చినపుడు సాయి నవ్వి , ' ఈ ముసలాడు చాల టక్కరి. ఎలుకే నావాహనమని కనిపెట్టాడు ' అన్నారు. ఒకసారి బాంద్రానుండి ఒకామెవచ్చి సాయికి నమస్కరించి ఆయన యెదుట కూర్చోగానే , ఆమెను 7 సంవత్సరములుగా వేధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆమాట చెప్పగానే బాబా, ' అమ్మా నీచిన్నతనమునుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు ' అన్నారు. ఆమెకేమీ అర్ధం కాలేదు. బాబా నవ్వుతూ,  ' నీవెవరిని  పూజిస్తావు' అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి, ' నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి' అన్నారు. విఘ్నేశ్వరుడు భోజనప్రియుడు. ఆగణపతియే తామని సూచించారు. "
శ్రీ సాయి లీలామృతము:  పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ                         

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)



          

Comments

  1. " సాయియే గణపతి, సాయి నామస్మరణం సర్వవిఘ్నహరణం! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)