సాయి కథలు - సద్గురు పాదము

శ్రీసాయినాథాయనమః 

" సాయి అనంతుడు, నేడు అనంతపద్మనాభ చతుర్థి " 

గంగ యముల పవిత్రసంగమం ప్రయాగ. ప్రయాగలో స్నానం చేయడమెంతో పవిత్రమని హిందువుల విశ్వాసం. దాసగణుకూడా ప్రయాగ సంగమ స్నానం చేయదలచి బాబా యనుమతి కోరతాడు. " వ్యయ ప్రయాసలతో అంత దూరమెందుకెళ్లవలె, మన ప్రయాగ ఇచటనేయుందిగదా  నా మాటల నమ్ముము "  బాబా పలికారు. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరసునుంచగనే బహు ఆశ్చ్యర్యకరమైన వింత జరిగినది. బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగా యమున జలములు జలజల బారినవి. ఈ సాయిమహిమ జూచి దాసగణు భక్త్యావేశములతో తనదేహం మరచాడు. అతని హృదయంలో కవితావేశం వుప్పొంగి శ్రీసాయిలీలా గానరూపంలో పెళ్లుబికింది.  ఇచట బాబా చూపిన లీల వారి అన్యాపదేశ సందేశమా యన్నట్లు సందేహమొస్తుంది.  సందేశమేమన, "  ఓ జనులారా, మిగుల కష్టపడి అటునిటు తిరిగి యేల  శ్రమపడెదరు, శిరిడీ దర్శనంలోనే అన్నిపుణ్యక్షేత్రదర్శన ఫలమొందగలరు, ఈ ఫకీరులోనే అందరి దేవీ దేవతలను వీక్షింపగలరు! "  భక్తులు తమతమ  భావన కనుగుణంగా బాబాలీల గ్రహింపగలరు!  

సాయిబాబా మాటలు నర్భగర్భములు శక్తివంతములు; వారిమాటలు  సమతూకములు, మంత్రాక్షరములు !   

" My words are always pregnant with meaning and never hallow..." Sai Baba

సాయి కథలు - సద్గురు పాదము 

గంగ పొంగిన పాదము
బాబ బంగరు పాదము
సాయి సద్గురు పాదము
సకల జగతికి శరణము

మాల్స  స్వాగత పాదము
పంతు పొగిడిన పాదము
వింత వింతల  పాదము
సకల జగతికి శరణము

గణుని గానపు పాదము
మేఘ విడువని పాదము
జోగు పూజల పాదము
సకల జగతికి శరణము

రాధ సేవల పాదము
లక్ష్మి ప్రేమల పాదము
శ్యామ ప్రేరణ పాదము
సకల జగతికి శరణము

రాముజూపిన పాదము
రాజ్యమేలెడి పాదము
వామ దేవుని పాదము
సకల జగతికి శరణము

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!  

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)




Comments

  1. " అన్ని క్షేత్రాలు శిరిడీలోనే , అన్నిరూపాలు సాయి లోనే! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)