సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ?
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ?
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
" నీకు కర్మలయందుగాని, ఆచరణమునందుగాని యేదేని సందేహము గలిగినేని, అకాలమునందాదేశమున ధర్మాధర్మ విచారణ సమర్థులును, ఆచార్యులును, నియమనిష్టలు గలవారును, స్వతంత్రులును, క్రూరతలేనివారును, కామహతులుగాని వారును, ధర్మకాములునునగు బ్రహ్మనిష్ఠులగు మహాత్ములు, ఆయా కర్మ ధర్మాచారమునందెట్లు ప్రవర్తించుచుందురో అట్లే నీవును ప్రవర్తించుము, వారల విచారించి (వారులేనిచో వారి వారి పవిత్ర జీవిత గ్రంథముల పఠించి, వారివారి సందేశముల పాటిస్తూ) వారు చేయునట్లు చేయుము. ఇదియే ఆదేశము, ఉపదేశము, వేదోపనిషద్రహస్యము, అనుశాసనము ఈశ్వర శాసనము మరియు ఉపాస్యము."
స్తోత్రమంజరి : సద్గురు శ్రీమలయాళ స్వామి
సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, మళయాళస్వామి, ప్రముఖస్వామి, మహాత్మా గాంధీ లాంటి మహాత్ములు కాలానుగుణముగా మనమధ్య అవతరించి సర్వమానవ ఏకత్వమును, సోదరభావమును, ఇతరులపట్ల గౌరవప్రేమాదరణలను, అన్నిమతములదాగిన మూలసూత్రరహస్యములను సర్వజనులకు అర్ధమయ్యే విధముగా బోధించి స్వయముగా ఆచరించి చూపారు. ప్రస్తుతకాలంలో వారు లేరని బాధపడనేల? వారిజీవనవిధానపరిశీలనము, వారి పావన చరిత్రల పారాయణము మన నిత్యజీవన చీకటి సమస్యల పరిష్కారమునకు దారిజూపు వెలుగు దీపములు. ఆ వెలుగు కాంతులలో జీవితముల చక్కదిద్దుకొని తృప్తిశాంతుల ప్రశాంత జీవనము గడిపి మనకు మనంగా మరియు మానవ సమాజమునకు మేలుజేయుదముగాక! మహాత్ముల చరితల పారాయణముచే మన ఆలోచనలు, భావములు శుద్ధిచెంది ప్రవర్తన చక్కబడుతుంది, మనలోని ఆధ్యాత్మిక శక్తి వుద్దీపన పొందుతుంది. మనకు మనమే సహాయం జేసుకోవాలి. ఆత్మకు, ఆత్మయే మిత్రుడనియు మరియు ఆత్మయే శత్రువని గీతాచార్యుని సందేశముగదా! సన్మార్గంలో నడిచేవారికి మహాత్ముల ఆశీసులు సదాలభిస్తాయనేది పెద్దల మాట.
శ్రీ సాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
రామకృష్ణ పరమహంస
రమణ మహర్షి
మలయాళ స్వామి
మహాత్ముల మాట , మల్లెల బాట !
ReplyDelete