సాయి కథలు - గురివింద , పరనింద !
" తప్పులెన్నువారు తండోపతండంబు
ఉర్విజనులకెల్ల వుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పు నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ " వేమన శతకము
గురివింద తననలుపుచూడకయే యితరులను వెక్కిరించుననుట అందరెరిగిన సామెత. యోగి వేమన కూడా అదే సత్యవాక్యాన్ని పద్యరూపంలో బోధ పరచారు. తప్పులు జేయటం లోకజనులందరికి సహజమైనప్పటికి, సామాన్యులు యితరుల దోషములెన్నుటలో సంతోషపడతారుగాని తమ తప్పును గ్రహింపలేకపోవడం ఓ లోక విచిత్రం. శ్రీశిరిడీసాయినాథులుగూడ అదే సత్యాన్ని వేరొకరూపంలో వివరించిన సంఘటనను శ్రీసాయిసచ్చరిత్రము 18-19 అధ్యాయాల ముగింపులో చూస్తాము. ఆవివరాలనొకపరి పరిశీలిద్దాం. శిరిడీలో ఒకనాడొకభక్తుడు వేరొక భక్తునిగూర్చి పరోక్షంగా ఇతరులముందు తీవ్రంగా నిందిస్తున్నాడు. మిక్కిలి హీనమైన యాతని దూషణలు విన్నవారు విసిగిపోయారు. పరులనిందించువారు వారి మలినములను తమ నాలుకతో శుభ్రపరచెదరని యోగులు తలుస్తారు. అతడా విధంగా నిందించువానికి సహాయం చేస్తున్నాడు. ఇచట నిందించినవాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞులగుటచే గ్రహించారు. ఆరోజు మిట్టమధ్యాహ్నం, బాబా లెండీతోటకు పోవునపుడు వాడు బాబాను దర్శించాడు. బాబా వానికొక పందినిజూపి యిట్లన్నారు, " చూడుము! ఈ పంది అమేధ్యమును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావంగూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీసాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగా నీకీ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? " భక్తుడు బాబా బోధను గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు. కావున మానవ స్వభావంచే ఇతరులగూర్చి చులకనగా మాట్లాడువేళ ఈ బాబా సందేశాన్ని గుర్తుకు తెచ్చుకొని, మన ప్రవర్తన పట్ల జాగర్త వహించడం యెంతో శ్రేయస్కరముగదా!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
ఉర్విజనులకెల్ల వుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పు నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ " వేమన శతకము
" ధర్మాచరణలో ఆత్మవిమర్శనమొక్కటే తగియున్నది. సాటివారి గుణదోషాలు నిరంతరం చింతించడంవల్ల అది, నిజమైనా అబద్ధమైనా సాయి అందరిలో వున్నాడనే వివేకాన్ని కోల్పోయి మనస్సు నిరంతరం రాగద్వేషాలకు నిలయమవుతుంది. ఇక ప్రేమ, కరుణలకు చోటెలా లభిస్తుంది? " ఆచార్యవాణి
గురివింద తననలుపుచూడకయే యితరులను వెక్కిరించుననుట అందరెరిగిన సామెత. యోగి వేమన కూడా అదే సత్యవాక్యాన్ని పద్యరూపంలో బోధ పరచారు. తప్పులు జేయటం లోకజనులందరికి సహజమైనప్పటికి, సామాన్యులు యితరుల దోషములెన్నుటలో సంతోషపడతారుగాని తమ తప్పును గ్రహింపలేకపోవడం ఓ లోక విచిత్రం. శ్రీశిరిడీసాయినాథులుగూడ అదే సత్యాన్ని వేరొకరూపంలో వివరించిన సంఘటనను శ్రీసాయిసచ్చరిత్రము 18-19 అధ్యాయాల ముగింపులో చూస్తాము. ఆవివరాలనొకపరి పరిశీలిద్దాం. శిరిడీలో ఒకనాడొకభక్తుడు వేరొక భక్తునిగూర్చి పరోక్షంగా ఇతరులముందు తీవ్రంగా నిందిస్తున్నాడు. మిక్కిలి హీనమైన యాతని దూషణలు విన్నవారు విసిగిపోయారు. పరులనిందించువారు వారి మలినములను తమ నాలుకతో శుభ్రపరచెదరని యోగులు తలుస్తారు. అతడా విధంగా నిందించువానికి సహాయం చేస్తున్నాడు. ఇచట నిందించినవాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞులగుటచే గ్రహించారు. ఆరోజు మిట్టమధ్యాహ్నం, బాబా లెండీతోటకు పోవునపుడు వాడు బాబాను దర్శించాడు. బాబా వానికొక పందినిజూపి యిట్లన్నారు, " చూడుము! ఈ పంది అమేధ్యమును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావంగూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీసాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగా నీకీ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? " భక్తుడు బాబా బోధను గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు. కావున మానవ స్వభావంచే ఇతరులగూర్చి చులకనగా మాట్లాడువేళ ఈ బాబా సందేశాన్ని గుర్తుకు తెచ్చుకొని, మన ప్రవర్తన పట్ల జాగర్త వహించడం యెంతో శ్రేయస్కరముగదా!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
పరనింద, పుణ్యహరణం!
ReplyDelete