సాయి కథలు - ఆ సూర్యునికి వెలుగునిచ్చేదెవరు ?

శ్రీసాయినాథాయనమః

" నేనే జగన్మాతను ! "   సాయిబాబా 

సాయి కథలు - ఆ సూర్యునికి వెలుగునిచ్చేదెవరు ?
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము 

భూతలంపై నివసించే ప్రాణికోటి కెల్లరకు శక్తినిచ్చేది సూర్యుడు, ఆసూర్యశక్తిలేక జీవసముదాయం తమ మనుగడ సాగించలేదనేది  అందరికి తెలిసిన సత్యమే. మరి అలాంటి శక్తిప్రదాత సూర్యుడు తానెచటినుండి  తనశక్తిని  పొందుచున్నాడు? ఇందులకు శాస్త్రజ్ఞులు తమతమ కారణములు వివరించుచున్నారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే కఠ ఉపనిషత్తునందు  యిందులకు ఓచక్కని వివరణ మివ్వబడినది, అదేమిటో క్లుప్తంగా పరిశీలిద్దాము. ఉపనిషత్తులో యమధర్మరాజు బాలుడైన నచికేతునకు ఆత్మ తత్వమునుగూర్చి  విశేషంగా,  విపులంగా  వివరిస్తాడు. ఆసంభాషణలోని మూలభావము చూచెదము. 
" నీకు ప్రకాశమెద్ది? పగటియందు సూర్యుడును, రాత్రియందు చంద్రదీపాదులును. అటులే కానిమ్ముకాని , ఆసూర్య ప్రదీపాదులను ప్రకాశింపజేయునదేది?  నేత్రము. నేత్రము మూసికొనినపుడు నీకు ప్రకాశమెద్ది? బుద్ధి.  ఆబుద్ధిని ప్రకాశింపజేయు (తెలిసికొను) నదేది?    నేనే (ఆత్మయే)  కాన, ఆత్మస్వరూపుడవగునీవే అన్నిటికంటెను ప్రకాశమై యున్నావు. (శిష్యుడు) ప్రభో!  ఆ పరంజ్యోతి నేనేయైయున్నాను. ( ఇచట గురుశిష్యుల  సంవాదరూపమున ' తత్త్వమసి '  ' అహంబ్రహ్మాస్మి '  అనగా నేనే ప్రకాశమయ ఆత్మస్వరూపుడనను మహా వాక్యార్ధము బోధింపబడినది యెఱుంగునది.) 
 పైన పేర్కొనబడిన వివరణ ప్రకారము సృష్టికంతటికీ ప్రకాశమయ ఆత్మశక్తి మూలము, కాని సాధారణజనులమగు మనకు   ఈసత్యము అనుభవములోనికి రాదు. ఈవిషయంలో సద్గురుసాయినాథులు తాము ప్రకాశమయ ఆత్మస్వరూపులమనెడి సత్యానుభవాన్ని భక్తులకు ప్రసాదించారు . ఈవిషయం  ' శ్రీసాయిబాబా నిత్యసత్యులు,అప్రమత్తులు! '  అనే శీర్షికలో ( www.saileelatelugu.blogspot.com 10-20-2018 ) విపులంగా చెప్పబడినది. ఇలాంటి అనుభవాన్నే శ్రీరామకృష్ణ  పరమహంస తమశిష్యుడు మరియు మేనల్లుడగు హ్రిదయనాథ్ బంధోపాధ్యాయ్  కు చూపారు. ఆ అనుభవాన్ని స్మరించుకొందాము.
" ఓరోజు రాత్రి శ్రీరామకృష్ణ దక్షిణేశ్వర్ కాళీ ఆలయప్రాంగణంలోని పంచవటి (ఐదు వృక్షాలతోట) వైపుకు నడుస్తున్నారు. వారికి  అనుచరుడు, భక్తుడు మరియు మేనల్లుడైన హ్రిదయ్,    పరమహంస వారికి అవసరమని తలచి ఓనీటికుండ,  తువాలుతో అనుసరించాడు. ఆసమయంలో హ్రిదయ్  ఓ అద్భుత దృశ్యాన్ని చూసాడు. రామకృష్ణ రక్తమాంసాదులతో కూడిన మానవమాత్రులు కారు. వారిదేహంనుండి పంచవటీ ప్రాంతమంతా దేదీప్తమానమైన వెలుగు  వ్యాపిస్తుంది. నడిచే వారి ప్రకాశమయ పాదాలు భూమిని తాకక గాలిలో  ముందుకు సాగుతున్నాయి. అదంతా ఓ భ్రమయేమోనని తలచి  హ్రిదయ్  తనకనుల రుద్దుకొనుచూ మరీ పరిసరాల చూడనారంభించాడు. అచటి చెట్లు, తీవెలు, యెదురుగా ప్రవహించే గంగానది పరిసర గుడిసెలు మున్నగునవి ఎలాంటిమార్పులేక యధాతదంగా వున్నాయి, మరల తన చూపును రామకృష్ణుల వైపుకు మరల్చి వారి అత్యంత ప్రకాశవంతమైన తేజోమయ దేహాన్ని మరీమరి చూసాడు. వారినావిధంగా చూస్తున్న తనలో,   యేదైనా మార్పుకలిగినదాయని సందేహంలో పడ్డాడు. తన దేహంవైపు ఓసారిచూసుకొనగా తనశరీరంగూడ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. తాను  భగవంతుని అనాదిగా సేవించెడి సేవకునిగా తలచాడు. తానుగూడ దైవ తేజస్సులోని భాగంగాను, దేవుని సేవించుటకై మరొక తేజోమయ రూపాన్ని ధరించినట్లు భావించాడు. ఈ ఘటనతో హ్రిదయ్  తన నిజరూపరహస్య  అనుభవాన్నిపొంది పరమానంద భరితుడైనాడు. తనను తాను మరిచాడు, ప్రపంచాన్ని మరిచాడు, తనను లోకం పిచ్చివాడుగా తలస్తుందేమోయను  భావం మరిచాడు. బ్రహ్మానంద భరితుడై  ఉన్మత్తావస్థితిలో , "  ఓ రామకృష్ణ, రామకృష్ణా! మనమిరువురమూ మానవమాత్రులం కాదు. రమ్ము, లోకమంతా సంచరించి మానవజాతి నుధ్ధరించెదము. నీవూ నేనూ వేరుకాము,.... "  యంటూ మరోలోకం వానిలా మాట్లాడటం మొదలుపెట్టాడు.    తుదకు రామకృష్ణులు వానికలాంటి స్థితి శ్రేయస్సును  కలిగించదని దలచి కాళీమాతను ప్రార్ధించి  హ్రిదయ్   ను సాధారణ  స్థాయికి తీసుకొచ్చారు.
Ref : Sri Ramakrishna And His Divine Play ( page 334)   by Swami Saradananda , Swami Chetanananda 

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 
పారవశ్యస్థితిలో  శ్రీరామకృష్ణులు తనమేనల్లుడు హ్రిదయ తో 


Comments

  1. వెలుగులకు వెలుగునిచ్చేది అందరిలో దాగిన పరమాత్మ ప్రకాశమని , వేదాలసారమైన ఉపనిషత్తులలో పదేపదే నొక్కి చెప్పబడినది. మహాత్ములు అనుభవపూర్వకంగా చెప్పిన సత్యమిది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.