సాయి కథలు - సద్గ్రంథ పఠనము

శ్రీసాయినాథాయనమః 

మహాత్మాగాంధీ 150వ జయంతి   స్మృతి సమర్పణ !

సాయి కథలు -  సద్గ్రంథ పఠనము 

" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము 

సాయిబాబా సద్గ్రంథ పఠనమునకెంతో ప్రాధాన్యత నిచ్చారు. " పనిచేయి, దేవుని నామముచ్చరించు , సద్గ్రంధముల పఠించుము"  యనెడిది వారి ప్రముఖ సందేశములలో నొక్కటి.  ఏకనాథ భాగవతము  , ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి, విష్ణుసహస్రనామము  మున్నగు పవిత్రగ్రంధముల చదువుటకు భక్తుల ప్రోత్సహించేవారు. వేరువేరు సమస్యలతో వారివద్దకు వచ్చిన భక్తులను పైనపేర్కొన్న గ్రంథప్రవచనములు  జరుగు ప్రదేశములకు పంపెడివారు. ఆసందర్భోచిత ప్రసంగములలో భక్తుల సమస్యలకు పరిష్కారము లభించెడిది. మరియును తమలీలల పఠించి , స్మరించి వానిని లోతుగా ఆలోచించి వాస్తవభావముల గ్రహించి యాచరింపుమనెడివారు.

భగవంతుడు, భాగవతము, భక్తుడు వేరు వేరు కాదని, అంతా ఒక్కరేయనేది మహాత్ముల  అనుభవ సందేశము. ఈ వాస్తవమును శ్రీరామకృష్ణ పరమహంస తమ అనుభవపూర్వకంగా గుర్తించారు *. ఓరోజు దక్షిణేశ్వరంలోని  విష్ణుదేవాలయ ముందటి హాలులో వారు భాగవత ప్రసంగము వింటున్నారు. వింటూవింటూ మిగుల పారవశ్యంతో భావసమాధిచెంది శ్రీకృష్ణ దర్శనాన్ని పొందారు. ఆసమయంలో  తీవెలాంటి ఓ ప్రకాశవంతమైన వెలుగుకిరణం  కృష్ణుని పాదములనుండి వెలువడి యచటి భాగవత గ్రంధాన్ని తాకి ఆపై రామకృష్ణుల హృదయభాగాన్ని స్పృశించినది. ఆవిధంగా కొద్దిసమయమావెలుగు  కిరణం మువ్వురను ఏకం చేసినది. ఈ యనుభవం తరువాత భగవంతుడు, భక్తుడు, భగవంతుని ముఖారవిందమునుండి వెలువడిన వారి వాక్యములతో గూడిన భాగవతాది  పవిత్రగ్రంధాలు, చూచుటకు వేరువేరు  మువ్వురుగా ( మూడుగ )  గోచరించినప్పటికీ ఒక్కటే యనెడి సత్యాన్ని రామకృష్ణ పరమహంస అనుభవ పూర్వకముగా గ్రహించి నిర్ధారించారు.  పరీక్షిత్తు మహరాజు ఏడురోజులు భాగవత గ్రంథ శ్రవణముజేసి దైవసాన్నిధ్యము  పొందాడనేది  పురాణసత్యవాక్యము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ  తన తల్లి వడిలో  చిన్నతనంనుండే  పవిత్ర పురాణగాధల వింటూ ఆప్రభావంచే సత్యవాదిగా యెదిగి మహాత్ముడిగా ఖ్యాతి గడించాడు. భగవద్గీత వారి నిత్యపారాయణ ప్రబోధగ్రంధము. తమజీవన విధానానికి గీతయే ప్రేరణ, మార్గదర్శనమని మహాత్మా గాంధీ చెప్పారు.
* Ref: 'Sree Ramakrishna and His Divine Play' by Swami Saradananda, Swami Chetanananda

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 




Comments

  1. " A good book is like a good friend. It will stay with you for the rest of your life. "
    Charlie Lovett

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)