సాయి కథలు - సాయి శిరిడీకే పరిమితులా ?
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - సాయి శిరిడీకే పరిమితులా ?
Source: Sree Ramakrishna and His Divine Play by Swami Saradananda, Swami Chetanananda
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
సాయి కథలు - సాయి శిరిడీకే పరిమితులా ?
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
సాయి శిరిడీకే పరిమితులా ? ఈ ప్రశ్నకు సమాధానం శ్రీసాయిసచ్చరిత్రము 31వ అధ్యాయంలో లభిస్తుంది. బాలారామ్ మాన్ కర్ యనునాతడు తనభార్య మరణానంతరము విరక్తిచెంది, గృహబాధ్యతలను కొడుకు కప్పగించి మనశాంతికై శిరిడీ బాబా వద్దకు వస్తాడు. కాని బాబా వానికి 12 రూపాయలనిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్ కు అతని ఇష్టానికి వ్యతిరేకంగా పంపుతారు. అచటి ప్రకృతికి, పరిసరాలకు మిగుల ముగ్ధుడౌతాడు. బాబా ఆదేశంపై రోజుకు మూడుసార్లు తీవ్రంగా ధ్యానం చేస్తాడు. కొన్నిరోజుల తర్వాత బాబా వానికి మెలకువలో, భౌతికంగా దర్శనమిచ్చారు. శిరిడీలో వానిమనసు నిలకడ పొందకుండుటచే గఢ్ కు పంపామని, కేవలం తాము శిరిడీలోనే యుంటామనే యాతని భ్రమతొలగించి, సర్వత్రా వ్యాపితులమనే అనుభవమిచ్చుటకై భౌతికంగా కన్పించామని చెబుతారు. కొంతకాలం పిమ్మట మాన్ కర్ శిరిడీజేరి సాయిసన్నిధిలో తుదిశ్వాస విడుస్తాడు.
దేవీనవరాత్రులలోని ఈరోజు పవిత్రమైన మహాసప్తమి, ఇదే మహాసప్తమి రోజు 1868 న, శ్రీ రామకృష్ణ పరమహంస తో ఓభక్తుని అనుభవము, మహాత్ములు సర్వత్రా వ్యాపకులనెడి పైచెప్పబడిన సత్యాన్ని ధ్రువపరుస్తుంది.
సాక్షాత్కార సిద్ధిపొందిన యోగులు, సద్గురువులు సర్వత్రా వ్యాపకులు యనెడి నిజాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస ధ్రువపరచారు. ఆ వివరాల పరిశీలిద్దాం. హ్రిదయనాథ్ బంధోపాధ్యాయ్ రామకృష్ణుల తోపాటు దక్షిణేశ్వర్ లోని కాళీ దేవాలయంలో పూజారి మరియు వారికి మేనల్లుడు. ఓ పర్యాయం హ్రిదయ్ తన స్వగ్రామమైన సిహార్ లో దుర్గా పూజ జేయ సంకల్పిస్తాడు. రామకృష్ణులందులకంగీకరిస్తారు. రామకృష్ణులు కూడ తమయూరికి రావలయునని ప్రాధేయపడతాడు. దేవాలయపు యజమాని మాథుర్ బిస్వాస్ పూజాఖర్చులు సమకూరుస్తాడు, కాని పూజకు రామకృష్ణులను సిహార్ పంపనని, తమగృహంలో వారు పూజచేయాలని కోరుకొంటాడు. విచారంతో తమ ఉరికి బయలుదేరు హ్రిదయ్ ను పరమహంస యిలా వోదారుస్తారు : " బాధపడతావెందుకు? నేను ప్రతిరోజూ నీ వద్దకు సూక్ష్మ దేహంతో వచ్చి పూజ తిలకిస్తాను, కాని నీవుతప్ప ఇతరులెవరూ నన్ను చూడలేరు. బ్రాహ్మణునొకని నియమించి పూజ నిర్వహింపుము. పూర్తిగా ఉపవసింపకుము. భోజనవేళకు పాలు, గంగాజలము , లేక పటికబెల్ల పానకము మాత్రము స్వీకరింపుము. ఇలా జేస్తే దివ్యజనని దుర్గామాత నీపూజను స్వీకరిస్తుంది. " మరియూ పూజకు సంబంధించి కొన్నిసలహాలను పొంది హ్రిదయ్ సంతోషంతో సిహర్ ప్రయాణమౌతాడు. హ్రిదయ్ తన గ్రామం వెళ్లి రామకృష్ణుల సలహామేరకు పూజకు అన్నీ సమకూరుస్తాడు. శుక్లపక్ష నవరాత్రులలోని 6వ రోజైన షష్టి దినమున ( 1868వ సంవత్సరము ) దుర్గామాత ప్రతిష్టపూజ జరిగినది. ఏడవరోజు సప్తమి పూజాకార్యక్రమము ముగిసి సంధ్యా ఆరతి జరుగుసమయమున హ్రిదయ్, దుర్గామాత విగ్రహము పక్కన మిగుల పారవశ్యంతో వెలిగే ప్రకాశవంతమైన రామకృష్ణుల కాంతిరూపాన్ని తిలకించి మిగుల ఆనందభరితుదౌతాడు. ఇదే మనోరంజక దృశ్యాన్ని ఆపై ప్రతిరోజూ సంధ్యాపూజ, ఆరతుల సమయాన హ్రిదయ్ తిలకించి పులకితుడౌతాడు. కొన్నిరోజుల పిదప దక్షిణేశ్వర్ వెళ్లి తన అనుభవాన్ని పరమహంసకు వివరిస్తాడు. " ఔను ఇది నిజం, నీయింట పుజారతులు జరిగే వేళ, చూడాలనే బలీయమైన కోరిక నాలో కలిగేది. మిగుల పరవశుడనై, కాంతిమయ దేహంతో వెలుగుమార్గంలో పయనించి నీపూజాగృహంలో ప్రవేశించేవాణ్ణి. " మహాత్ములు దేహాతీతులు, కాలాతీతులు, సర్వాతీతులు! శరణుకోరి వారికృప పొందినవారి జన్మలు ధన్యము గదా!Source: Sree Ramakrishna and His Divine Play by Swami Saradananda, Swami Chetanananda
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి. )
మహాత్ములు పరమాత్మస్వరూపులు, సర్వత్రా వ్యాపకులు !
ReplyDelete