సాయి కథలు - ఆ అగంతుకుడెవ్వరు ?
శ్రీసాయినాథాయనమః
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము
సాయి కథలు - ఆ అగంతుకుడెవ్వరు ?
" దైవసహాయం తెలియనివ్యక్తులద్వారాకూడా లభింపగలదు. "
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము
" సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడుననునది భక్తుల యనుభవమే! " శ్రీ సాయి చరిత్రము
దైవసన్నిధికి, సద్గురుదర్శనానికి వెళ్లునప్పుడు అదృశ్యరూపంలో అనుకోని విధంగా భగవంతుని లేక సద్గురుని సహాయం లభిస్తుంది. ఇందులకు శ్రీ సాయి చరిత్రములో పెక్కు ఉదాహరణములున్నవి, మరియు ఇది యెంతోమంది భక్తుల యనుభవముకూడాను. 1910 లో అన్నాసాహెబ్ దభోల్కర్ ( హేమాడ్ పంత్ ) తనమిత్రుడు నానాసాహెబ్ చందోర్కర్ సలహాపై సాయిబాబాను చూచుటకై శిరిడీ ప్రయాణమౌతాడు ( 2వ అధ్యాయము ). బాంద్రానుండి దాదరు వెళ్లి అచటినుండి మన్మాడు రైలులో వెళ్లదలచి ముందుగా దాదరు వరకు టిక్కెటు కొన్నాడు. రైలు బయలుదేరు సమయమున ఎలాంటి పరిచయములేని మహమ్మదీయుడొకడు పంతు విషయము దెలిసికొని మన్మాడు వెళ్ళు రైలు దాదరులో ఆగదు గావున , ముందుకుబోయి బోరీబందరు స్టేషన్లో దిగమని సలహానిచ్చాడు. ఆప్రకారమే ప్రయాణంజేసి అనుకొన్నసమయానికి పంతు శిరిడీజేరి బాబా అద్భుత దర్శనం చేసుకొంటాడు. ఆ అపరిచితుని సమయానుకూల సలహా లభింపనిదే యాతనికి ప్రయాణంలో పెక్కుచికాకులు, అనుమానాలు గలిగేవి. బాలారాం మాన్ కర్ ( 31వ అధ్యాయము ) యనుభవము పై సంఘటనను బోలియుంటుంది. సాయిబాబా సలహాపై మాన్ కర్ మచ్చింద్రగఢ్ వెళ్లి ధ్యానంజేసి బాబా ప్రత్యక్ష భౌతిక దర్శనం పొందుతాడు. కొంతకాలం గడచిన తరువాత మాన్కర్ గడమును విడచి బాంద్రాకు బయలుదేరుతాడు. పూనానుండి దాదరుకు రైలులో పోదలచాడు. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిగుల క్రిక్కిరిసి యుండుటచే ఆతనికి టిక్కెట్టు దొరకలేదు. అదేసమయంలో లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొన్న ఒక గ్రామీణుడు వచ్చి యాతని ప్రయాణ వివరములు తెలిసికొని, అవసరమైన పనిచే తాను దాదరు పోలేకున్నానని చెప్పి తనవద్దనున్న దాదరు పోవు టిక్కెట్టు మాన్కర్ కిచ్చాడు. మాన్కర్ యెంతో సంతోషించి జేబునుండి పైకందీసి వాని కిచ్చు నంతలో, పల్లెటూరివ్యక్తి మాయమైనాడు. ఎంతవెదకినా ఆగుంపులో వాడు కనబడలేదు. మూడవ ఉదాహరణమును 36వ అధ్యాయంలో చూస్తాము. 30,000 రూపాయలు పోగొట్టుకొన్న గోవా పెద్ద, ఓ అపరిచిత ఫకీరు సలహాపై తనడబ్బును పొంది, మొక్కుకున్న విధముగా సాయిదర్శనానికి శిరిడీ వెళ్ళదలచి వాడావిడచి గోవా సముద్రపు టొడ్డునకు వెళతాడు. ప్రయాణీకులతో యచటి స్టీమరు నిండియుండుటచే లోపల ప్రవేశింపలేకపోతాడు. అదేసమయంలో గుర్తుతెలియని యొక నౌకరు సహాయంతో పెద్దమనిషి లోపలికెళ్ళి రెండవ యొడ్డు జేరి అక్కడ రైలునెక్కి ద్వారకామాయికి వస్తాడు. (గోవాపెద్దమనిషి పై చెప్పబడిన పరిచయంలేని ఫకీరును సాయిగా తెలుసుకొంటాడు ). ఇప్పటివరకు వివరింపబడిన మూడు సంఘటనలలో ఆ అగంతకుడెవ్వరు? సాయిబాబా తమభక్తుల సేవకుడనని పదేపదే చెప్పారు. సాయే సేవకరూపం దాల్చి భక్తులకు సాయంజేసారా, నిజమెవ్వరికెరుక?
పై ఘటనల పోలిన మరొక్క విచిత్ర సాయి లీలను " సాయి ఖండాంతర లీల " యను శీర్షికన www.saileelatelugu.blogspot.com; dated October 4, 2018 న చూడగలరు. ఇందులో పరిచయమేమీలేని వ్యక్తి, రచయిత మిత్రునకు శిరిడీలో వివిధ ప్రదేశముల చూపించిన వివరములు గలవు.
ఇపుడు రమణ మహర్షి జీటితచరిత్రలోని ఓ సంఘటన స్మరించుకొందాము. వెంకటరామన్ ( రమణ మహర్షి ) పదిహేడవ యేట మరణానుభవము పొందినపిమ్మట తాను శరీరముకాదని, సాక్షిభూత చైతన్యరూపునిగా అనుభవము పొందుతాడు. . ఆపై తిరువణ్ణామలైలోని అరుణాచలేస్వరుని దర్శనమునకై మిగులతపించి, యింటిలోని వారికెవ్వరికి చెప్పక మధురనుండి రైలులో బయలుదేరుతాడు, కాని అచటికెళ్ళు మార్గవివరములేమాత్రము తెలియవు , ఎవ్వరిని అడుగకుండా అరుణాచలుని ధ్యానంలో నిమగ్నుడౌతాడు. ఆ సమయంలో తనతో పయనించే ఓ మహమ్మదీయ మౌల్వి, వెంకటరామన్ స్థితికి తేజస్సుకు ముగ్ధుడై అణ్ణామలై జేరు ప్రయాణ వివరాలు చెబుతాడు, తిరుచునాపల్లి స్టేషన్లో తనధ్యానమునుండి కనులుతెరచి చూసుసరికి, తనకు ప్రయాణవివరాలు చెప్పి యింకా తిరుక్కోయిలూరువరకు వెళతానని ముందు జెప్పిన మౌల్వి అదృశ్యుడౌతాడు. ఆ ఫకీరేవ్వరు? అరుణాచలుడా, శిరిడీనాథుడా? నిజం దేవుడెరుగు!
ఇపుడు రమణ మహర్షి జీటితచరిత్రలోని ఓ సంఘటన స్మరించుకొందాము. వెంకటరామన్ ( రమణ మహర్షి ) పదిహేడవ యేట మరణానుభవము పొందినపిమ్మట తాను శరీరముకాదని, సాక్షిభూత చైతన్యరూపునిగా అనుభవము పొందుతాడు. . ఆపై తిరువణ్ణామలైలోని అరుణాచలేస్వరుని దర్శనమునకై మిగులతపించి, యింటిలోని వారికెవ్వరికి చెప్పక మధురనుండి రైలులో బయలుదేరుతాడు, కాని అచటికెళ్ళు మార్గవివరములేమాత్రము తెలియవు , ఎవ్వరిని అడుగకుండా అరుణాచలుని ధ్యానంలో నిమగ్నుడౌతాడు. ఆ సమయంలో తనతో పయనించే ఓ మహమ్మదీయ మౌల్వి, వెంకటరామన్ స్థితికి తేజస్సుకు ముగ్ధుడై అణ్ణామలై జేరు ప్రయాణ వివరాలు చెబుతాడు, తిరుచునాపల్లి స్టేషన్లో తనధ్యానమునుండి కనులుతెరచి చూసుసరికి, తనకు ప్రయాణవివరాలు చెప్పి యింకా తిరుక్కోయిలూరువరకు వెళతానని ముందు జెప్పిన మౌల్వి అదృశ్యుడౌతాడు. ఆ ఫకీరేవ్వరు? అరుణాచలుడా, శిరిడీనాథుడా? నిజం దేవుడెరుగు!
మహాత్ముల చరితలమధ్య పోలికలుంటాయి. రామకృష్ణ పరమహంస జీవితంలోగూడ ఓ అంతుతెలియని సన్యాసి సహాయపడతాడు. తనగురువైన తోతాపురినుండి సన్యాసం స్వీకరించినపిమ్మట ( 1864లో ), పరమహంస ధ్యానంజేస్తూ షుమారు ఆరుమాసములు నిర్వికల్ప సమాధిస్థితిలో బాహ్యస్మృతి కోల్పోతాడు. తినుట శ్వాస దీసుకొనుట జరుగనిస్థితి, మధ్యమధ్య అతిస్వల్పకాలము బాహ్యస్మృతి పొందుచున్నారు. చూచువారలకు యాతడు మరణించిన వ్యక్తిగా గోచరిస్తాడు. అలాంటిస్థితిలో 21రోజులు మించి యెవ్వరూ జీవింపలేరు. కాని రామకృష్ణుల దేహం తమ అవతారకార్యమునకై మరింత కాలం జీవింపవలసిన అవసరముంది (మహాసమాధి 1886లో ) . అదేసమయంలో గుర్తుతెలియని ఓసన్యాసి యెచటినుండో వస్తాడు. మధ్యమధ్య రామకృష్ణులను ఓ కర్రచే కొట్టి బాహ్యస్మృతి కలిగిస్తూ, ఏకొద్దిక్షణాలలోనో కొంతపాటి ఆహారం తినిపించి వారి ప్రాణాల కాపాడుతాడు. సన్యాసి అటుపిమ్మట అదృశ్యుడౌతాడు. రామకృష్ణుల ప్రాణదాత, అవతారకార్య సహాయకారి యెవరీ సన్యాసి? నిజమేదో జగన్మాతకే యెరుక!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో, దైవసహాయం అదృశ్యరూపంలోగాని, అపరిచితుల రూపంలోగాని లభిస్తుందనెడిది యెంతటి నిజమో !
ReplyDelete