శ్రీరామకృష్ణ పరమహంస జయంతి.
శ్రీసాయినాథాయనమః, శ్రీరామకృష్ణాయనమః ! 1836 - 1886 నేడు శ్రీరామకృష్ణ పరమహంస 185వ పవిత్ర జయంతి. " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీరామకృష్ణ పరమహంస మహాద్భుత జన్మ వృత్తాంతము. అవతారపురుషుల జన్మము అద్భుతము, వారి కర్మలు అద్భుతము, వారి జీవనసరళి అత్యత్భుతము. ఈసత్యమును శ్రీకృష్ణుని, గౌతమబుద్ధుని, ఆదిశంకరాచార్య, చైతన్య మహాప్రభు, శిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస మున్నగు మహాపురుషుల జీవితములు పరిశీలించిన చూడగలము. గదాధరుని ( శ్రీరామకృష్ణ పరమహంస) శేషఅవతారకార్యమును కొనసాగించుటకుగాను తాము మరల ప్రాణముపొందితిమని 1886వ సంవత్సరములో మూడురోజుల సమాధియనంతరము సాయిబాబా భక్తులకు చెప్పియున్నారు. అనగా వీరిరువురి అవతారకార్యములు ముడివడియున్నటుల గ్రహింపవచ్చును. ఈమహనీయులిద్దరు యితర అవతారపురుషులవలె కారణజన్ములు, కేవలము లోకకళ్యాణమునకై మానుషవేషధారులై ప్రభవించారు. ప్రస్తుతవ్యాసంలో శ్రీరామకృష్ణుల జన్మవృత్తాంతమును క్లుప్తంగా పరిశీలించెదము. శ్రీరామకృష్ణ పరమహంస బాల్యనామము గదాధరుడు. ఆతని తండ్రిపేరు క్షుద...