సాయిబాబా ఫోటో !

శ్రీసాయినాథాయనమః 

  సాయిబాబా  ఫోటో !
 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

సాయిబాబా  తమకు తమచిత్రానికి తేడాలేదని యెన్నో సార్లు చెప్పారు. పూజానంతరం బాబాఫోటోనుండి విభూతి, తేనె, కుంకుమ   రాలడం ఎందరో భక్తుల యనుభవము. ఇది రచయిత స్వానుభవంకూడాను.  ఈవిషయమై శ్రీ సాయిసచ్చరిత్రములో చెప్పబడిన యొకరి అనుభవాన్ని చూద్దాము. బాలబువా సుతారు ప్రముఖ సంకీర్తనకారుడు.  బొంబాయిలో నివసించే యితడు ఓపర్యాయము సాయి దర్శనానికై శిరిడీ వచ్చాడు. గొప్పభక్తుడు, ఎల్లవేళలా భగవన్నామము జేసెడి వాడు కావున జనులాతని ' నవయుగ తుకారాం ' అని పిలిచేవారు. సుతారు బాబాకు  నమస్కరించగానే  సాయి " నేనీతనిని నాలుగుసంవత్సరములనుండి ఎరుగుదు " ననిరి. మొదటిసారిగా శిరిడీ వచ్చిన ఈతనికీవిషయం బోధపడలేదు. కాని తీవ్రంగా ఆలోచించినపిమ్మట బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినటుల జ్ఞప్తికి వచ్చెను.
మరొకరి అనుభవం. అప్పాసాహెబు కులకర్ణి ఠాణాకు బదిలీపై వచ్చెను. బాలాసాహెబు భాటే యిచ్చిన  సాయిబాబా ఫోటోను నిత్యంపూజిస్తూ బాబాను చూడవలెనని మిగుల కోరుకొనెడివాడు. ఆతని భక్తికి సాయిబాబా ప్రసన్నుడై  దర్శన విభూతులతోపాటు , తొమ్మిది రకాల భక్తిమార్గాలకు  సంకేతంగా తొమ్మిది నాణాల నిచ్చారు. మనంగూడా  సాయిబాబా చిత్రపటాన్ని భక్తిశ్రద్ధలపూజించి వారి అశీసులు పొందెదముగాక !

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!  

Comments

  1. సాయిబాబాకు వారిఫోటోకు తేడాలేదనేది పెక్కుభక్తుల అనుభవం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)