కాశీలో విశ్వనాథుడు మోక్షమిస్తున్నాడా?

 ఓంనమశ్శివాయనమః 

పాఠక భక్తమహాశయులెల్లరకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
శ్రీరామకృష్ణ పరమహంసకు వారణాసిలో విశ్వనాథుని దివ్యానుభవము!

మనశాస్త్ర,  పురాణములలో  చెప్పబడిన అనేక  నిగూఢ సత్యములను శ్రీరామకృష్ణ పరమమహంస తమ అనుభవపూర్వకంగా తెలిసికొని, ఆయా విషయములెల్లను నూటికి నూరుపాళ్లు నిజమని లోకానికి తెలియ జెప్పారు.   వారణాసి పవిత్రపుణ్యక్షేత్రం, శివరాత్రిమహాపర్వదిన  శుభసందర్భముగా కాశీవిశ్వేశ్వరుని మహిమను తెలుపు శ్రీరామకృష్ణ పరమహంస దివ్యానుభవమును తెలుసుకొందాము.  కాశీలో మరణించినవారికి మోక్షం లభిస్తుందనేమాట నిజామా?  శ్రీరామకృష్ణుల అద్వైతానుభవము పొంది,  తమ సాధనాక్రమం పూర్తయ్యాక వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి పెక్కు దివ్యానుభూతుల పొందారు.  పరమహంస తమ వారణాసి దివ్యానుభవాన్ని మాథుర్ మరియు ఇతర భక్తులకిలా వివరించారు. " వారణాసి మణికర్ణికా ఘాట్లో నేనొక తెల్లటి పొడగాటి దివ్యమూర్తిని చూసాను ( ఆసమయంలో శ్రీరామకృష్ణ గంగానదిలో ఓపడవపై కూర్చొని వరుస ఘాట్లను చూస్తున్నారు. మణికర్ణికాఘాట్ సమీపించేసరికి వారు భావాతీత స్థితిపొంది సాధారణస్పృహ కోల్పోయారు. ఆవేశంతో పడవనుండి ముందుకుదూకబోవ, తోటివారు భయపడి వెనుకకు పట్టిలాగారు.)  ఆతేజోమూర్తి తలంతా జడలుగట్టియుంది.  ఆతేజస్వి  అచట దహనమవుతున్న ప్రతి మృతకళేబరంను సమీపించి, ఆ మరణించిన వ్యక్తి దేహంనుండి వాని ఆత్మను పైకితీసి వానిచెవిలో జీవికి మోక్షమును ప్రసాదించు పరబ్రహ్మ పవిత్రనామాన్ని ఉపదేశిస్తున్నాడు. మండుచున్న శవానికి రెండవవైపున సర్వశక్తిమయి జగన్మాతకాళి  కూర్చొనియుంది. ఆ దివ్యశక్తి ప్రతి విగతజీవి ఆత్మనుండి వాని స్థూల, సూక్ష్మ, కారణ బంధ శరీరములను వేరుపరచి  మోక్షద్వారం తెరుస్తూ వానిని నిర్వాణస్థలికి పంపుతుంది. కాశీవిశ్వనాధుడు ప్రతి ఆత్మను  దీవిస్తూ ఎన్నోజన్మల తపోధ్యానాదులకుగూడ వీలుపడని అద్వైత పరమానందానుభవాన్నిక్షణంలో   ప్రసాదిస్తున్నాడు. " 
శ్రీరామకృష్ణుల అనుభవములెల్లయు పరిపూర్ణ సత్యగుళికలుగావున వారుచెప్పిన పైయనుభవముసత్యమనియు, విశ్వనాథుడు తారకమంత్రోపదేశమిచ్చి కాశీపుణ్యక్షేత్రంలోతుదిశ్వాసవిడచిన వారలకు మోక్షముప్రసాదిస్తున్నాడనేది కేవలం తులసీరామాయణంలో చెప్పబడిన  శాస్త్రవాక్యమేగాక వాస్తవమని  తోస్తుంది!   ఎవరినమ్మకము వారిది! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

కాశీ అన్నపూర్ణేశ్వరుడు 

Comments

  1. కైలాసపతి లోకకల్యాణమూర్తి మరియు మానవాళికి మోక్షమిచ్చు కైవల్యప్రదాత!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)