శ్రీవిష్ణుసహస్రనామం.

శ్రీసాయినాథాయనమః 
భగవతేశ్రీవాసుదేవాయనమః 

శ్రీవిష్ణుసహస్రనామం
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " 

ఈరోజు పవిత్ర భీష్మఏకాదశి, షుమారు ఐదువేల సంవత్సరాలపూర్వము శ్రీవిష్ణుసహస్రనామము లోకానికందిన శుభదినము.
శ్రీవేదవ్యాస మహర్షి శ్రీమద్మమహాభారతం రచించారు. మహాభారతానికి రెండింటివలన గౌరవమని విజ్ఞుల అభిప్రాయము. మొదటిది శ్రీకృష్ణపరమాత్మ బోధించిన శ్రీమద్భగవద్గీత, రెండవది శ్రీభీష్మాచార్యులు లోకానికందించిన శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రము. కురుక్షేత్రయుద్ధం ముగిశాక అంపశయ్యపై పరుండిన భీష్మాచార్యులు తమకెదురుగా నిలబడియున్న పాండవులకుపదేశించారు, వారివెనుక శ్రీకృష్ణపరమాత్మ యున్నారు. ధర్మరాజడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యులు ఈస్తోత్రపరంగా శ్రీవిష్ణుమూర్తియొక్క కళ్యాణగుణాలను వివరించారు. ఈస్తోత్రాన్ని భక్తిశ్రద్ధల వినువారలకు, పఠించువారలకు  అనేక శుభములుకలుగుననెడిది  పెక్కుభక్తుల యనుభవము.
సాక్షాత్తు సద్గురు శ్రీసాయినాథులు తమ ప్రియభక్తుడు శ్యామాకు ఈగ్రంధ మహిమనిలా వివరించారు. " ఓ శ్యామా! ఈగ్రంధము మిగుల విలువైనది. ఫలప్రదమైనది.  కనుక నీకిది బహూకరించుచున్నాను.  నీవు దీనిని చదువుము. ఒకప్పుడునేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములో నుండెను. అట్టి సందిగ్ద స్థితియందు నేను ఈపుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలుజేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుజేసేనని యనుకొంటిని.  అందుచే  దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును."
పిదప ఈగ్రంధమును క్రమముగా శ్యామా  చదివి దానిలో గొప్పప్రావీణ్యము సంపాదించెను, విద్యావంతులకు సైతము బోధింపగలిగెను.
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Comments

  1. తమప్రియభక్తుడు శ్యామాను విష్ణుసహస్రనామం చదవమని సాయిబాబా ఆశీర్వదించారు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)